హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Covid vaccine expiry: కొవిడ్ వ్యాక్సిన్ కి ఎక్స్ పైరీ డేట్ విధించిన 5 దేశాలు ఏవంటే?

Covid vaccine expiry: కొవిడ్ వ్యాక్సిన్ కి ఎక్స్ పైరీ డేట్ విధించిన 5 దేశాలు ఏవంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid vaccine expiry: కరోనా టీకాకు ఎక్స్ పైరీ డేట్ తప్పనిసరి చేస్తున్న దేశాల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే పలు దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

మీరు విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఒకవేళ వచ్చే ఏడాదిలో వెళ్లాల్సి వచ్చినా.. బూస్టర్ డోస్ (Booster dose) తప్పనిసరి. ఎందుకంటే కరోనా టీకా సర్టిఫికేట్ కు (covid vaccine certificate)  ఎక్స్ పైరీ డేట్ తప్పనిసరి చేస్తున్న దేశాల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే పలు దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. రానున్న మరిన్ని దేశాలు కూడా ఈ విధానాన్ని అవలంభించనున్నాయి.

క్రొయేషియా..

కొవిడ్ టీకాకు ఎక్స్ పైరీ (Expiry) ని విధించిన మొదటి దేశం క్రొయేషియా. మందు రెండు డోసులు తీసుకున్న ట్రావెలర్స్ ను మాత్రమే అనుమతించిన ఈ దేశం 9 నెలల వ్యాలిడిటీ తర్వాత టీకా తీసుకున్న ఏడాదిలోపు అని ఎక్స్ పైరీ సమయాన్ని విధించింది.

ఆస్ట్రియా..

ఈ దేశం ఆగస్టులో 9 నెలలోపు వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉన్నవారిని మాత్రమే అనుమతించింది. ఆ తర్వాత ఏడాదికి పొడిగించారు. ఆస్ట్రియన్ టూరిజం వెబ్ సైట్ ప్రకారం కరోనా టీకా వ్యాక్సిన్ తీసుకున్న 365 రోజులలోపు వర్తింపజేసింది. అదేవిధంగా కొవిడ్ బారినుంచి రికవర్ అయిన 180 రోజుల తర్వాత ట్రావెలర్స్ ను అనుమతించింది.

ఇది కూడా చదవండి: పెళ్లిలో మీరు మరింత అందంగా కనిపించాలంటే.. ఈ చిట్కా


స్విట్జర్లాండ్..

స్విట్జర్లాండ్ కూడా టూరిస్టులను అనుమతిస్తోంది. తాజా నివేధికల ప్రకారం పూర్తి డోసుల టీకా తీసుకున్న వారికి ఏడాదిలోపు సర్టిఫికేషన్తో అనుమతిస్తున్నారని అధికారులు తెలిపారు.

వియాత్నాం..

ఏషియన్ దేశాలు కూడా విదేశీ ట్రావెలర్స్ ను అనుమతిస్తున్నారు. కొన్ని జాగ్రత్త చర్యలు పాటస్తున్నారు. వచ్చే నెల నుంచి వియాత్నాం పైలట్ ప్రోగ్రాంను మొదలు పెట్టనుంది. లిమిటెడ్ నంబర్స్ తో ఫుల్ గా టీకా తీసుకున్నవారికి క్వారంటైన్ ఫ్రీ ఫు కువక్ కు ప్రయాణం చేయవచ్చు. రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత కూడా ఏడాదిలోపు ప్రయాణం చేయవచ్చు.

ఇది కూడా చదవండి:  మీకు స్క్విడ్ గేమ్ సిరీస్ నచ్చితే.. ఈ 5 కొరియన్ నవలలు కూడా చదవండి..


ఇజ్రాయేల్..

ఇజ్రాయేల్ కొవిడ్ గ్రీన్ పాస్ తో ట్రావెల్ చేసే వెసులుబాటును కల్పించింది. కరోనా నుంచి రికవర్ అయిన వ్యక్తులు కూడా రెండు డోసులు పూర్తయిన తర్వాత మాత్రమే అనుమతిస్తోంది. కానీ, కేవలం 6 నెలల వ్యాలిడిటీని మాత్రమే విధించింది.

First published:

Tags: Covid

ఉత్తమ కథలు