Home /News /life-style /

THESE EIGHT TIPS KEEPS YOU AWAY FROM JUNK FOOD RNK

Healthy diet: ఈ 8 టిప్స్‌తో జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటారు!

కార్బొహైడ్రేట్లతో పోలిస్తే.. ప్రోటీన్‌ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఎక్కువసేపు పొట్ట ఫుల్‌గా ఉంటుంది.

కార్బొహైడ్రేట్లతో పోలిస్తే.. ప్రోటీన్‌ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఎక్కువసేపు పొట్ట ఫుల్‌గా ఉంటుంది.

Avoid junk food: యోగా, ద్యానం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. దీంతో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి సహాయపడుతుంది.

సాధారణంగా మనం సన్నగా.. ఫిట్‌గా ఉండటానికి డైట్‌ Diet పాటిస్తాం. కానీ, జంక్‌ఫుడ్‌ను junk food చూడగానే డైట్‌ విషయం పక్కనబెట్టి టెంప్ట్‌ అయిపోతాం. ఇది శరీరానికి ఎక్కువ కేలరీలను నింపుతుంది. వీటికి దూరంగా ఉండి.. ఆరోగ్యకరంగా ఉంగే 8 అద్భుతమైన చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.

  • మనం ఫుల్‌గా భోజనం చేసినా కూడా కేలరీలు calories అధికంగా ఉండే ఫుడ్‌ను చూడగానే మళ్లీ తినాలపించే కోరిక వస్తుంది. ఇది సాధారణం. ఇవి ఒత్తిడి, హార్మొన్ల అసమతుల్యత, పొట్ట, పోషకాహారలోపం వల్ల అలా అవుతుంది. జంక్‌ ఫుడ్‌ను ప్రేరేపించడానికి మన చూపు, జ్ఞాపకశక్తి, వాసనలు కూడా కారణం. ఇది డైట్‌కు బ్రేక్‌ వేస్తుంది. దీంతో మన శరీరంలో కేలరీలు లోడ్‌ అవుతాయి.

  • నీరు తగిన మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆహార పదార్థాలపై కోరికలను తగ్గిస్తుంది. అంతేకాదు రోజంతా శరీరాన్ని హైడ్రేటేడ్‌గా ఉంచుతుంది. భోజన సమయం గ్యాప్‌ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. కొద్దిగా భోజనం చేసినా.. ఇతర ఆహార పదార్థాలను తినాలని కోరిక వస్తుంది. మధ్యలో కాస్త వాల్‌నట్స్, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తీసుకోవడం వల్ల సంతృప్తినిస్తుంది.


ఇది కూడా చదవండి: ప్రముఖ బాలివుడ్‌ నటి రేఖ బ్యూటీ సిక్రెట్‌ ఇదే!




  • పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారాన్ని సరిగ్గా నమిలి మింగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. చూయింగ్‌ గమ్‌ కూడా ఆకలిని తగ్గించి సమర్థవంతంగా పనిచేస్తుంది.

  • భోజనం చేయడం మానవద్దు. ఇలా అలవాటు చేసుకుంటే.. జంక్‌ ఫుడ్‌ లేదా స్వీట్‌ తినాలనిపిస్తుంది. శరీరం ఎక్కువ సమయం ఆకలితో ఉన్నపుడు అనారోగ్యకరమైన ఫుడ్‌నే కోరుకుంటుంది.


ప్రోటీన్‌..
ప్రతి భోజనంలో ప్రోటీన్లు Proteins ఉండటం వల్ల అనారోగ్య కోరికలు తగ్గిపోతాయి. కార్బొహైడ్రేట్లతో పోలిస్తే.. ప్రోటీన్‌ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఎక్కువసేపు పొట్ట ఫుల్‌గా ఉంటుంది.
స్ట్రెస్‌..
తమ భావోద్వేగాలను సమతుల్యం చేసుకోలేని వ్యక్తులు తరచూ స్ట్రెస్‌కు stress గురవుతారు. అటువంటి వ్యక్తుల ఆహార కోరికలు ఒత్తిడి వల్ల ఎక్కువగా ఉంటాయి. యోగా, ద్యానం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. దీంతో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: మీ మెదడుకు మేలు చేసే 5 రకాల ఫుడ్స్‌!

సరైన నిద్ర..
ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులు పగటిపూట తక్కువ ఆకలి ఉంటుంది. వారు తీపి, ఉప్పగా ఉండే ఫుడ్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపరు.

ఎల్లప్పుడూ మీ శరీరానికి జంక్‌ ఫుడ్‌ అలవాటు చేయకుండా ఉండాలని గుర్తుంచుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. చిప్స్, నామ్‌కీన్స్, కుకీలను తీసుకునే బదులు వాల్‌నట్స్‌ వంటివి తీసుకోవాలి.
Published by:Renuka Godugu
First published:

Tags: Health food

తదుపరి వార్తలు