మీ పిల్లలు (Children) మాట్లాడే భాష, వాడే పదాలు మిమ్మల్ని తరచూ బెంబేలెత్తిస్తున్నాయా? వారి అతి వాగుడు, అసందర్భ ప్రేలాపనలు (inappropriate) మిమ్మల్ని భయపెడుతున్నాయా? ఇలాగే నలుగురిలో మాట్లాడితే మీ పరువు పోతుందనే దిగులెందుకు? మీ పిల్లలు (Children) వాడే భాషను మీరు నియంత్రించవచ్చు, సంస్కరించవచ్చు. మంచి భాష, పదాలు (words) వాడేలా మీ పిల్లలను అదుపు చేసే మార్గాలు ఉన్నాయి. ఇంతమాత్రానికే మీరు దిగులుపడితే ఎలా? మీరు చేయాల్సిందల్లా ముందు మీ పిల్లలు (Children) ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తూ, ఎలాంటి భాషను వాడుతున్నారో గుర్తించండి. ఆతరువాత ఈ చెడ్డ పదాలకు చెక్ పెట్టడం చాలా ఈజీ. సడన్ గా పిల్లలు (Children) మాట్లాడే భాషను విని షాక్ (shock) తినకండి.
స్వతహాగా పిల్లలు (Children) ఏమీ మాట్లాడరు, ఏం చేయరు. బాల్యంలోనే వీరు అందరినీ చూసి, చుట్టుపక్కల వారు ఎలా ఉంటే అలా ఉండటం అలవాటు చేసుకుంటారు. భాష అయినా, పదాలైనా కుటుంబ సభ్యులు (family members), ఫ్రెండ్స్ ను చూసి అలవర్చుకుంటారు. ఉదాహరణకు స్కూల్లో మీ అబ్బాయి లేదా అమ్మాయి ఫ్రెండ్స్ అంతా సభ్యతగా మాట్లాడితే మీ పిల్లలు (kids) కూడా సభ్యతగానే మాట్లాడతారు. మీ ఇంట్లో లేదా స్నేహితుల్లో కొందరు పదేపదే గలీజు మాటలు మాట్లాడితే మీ పిల్లల (kids) కు అదే అలవాటు అయితీరుతుంది. ఇలాంటి ప్రతి విషయంపై మీరు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలి.
మీ భాష ఎలాంటిది..?
ముందు తల్లిదండ్రులుగా మీరు ప్రయోగించే భాష ఎలా ఉందో సరిచూసుకోండి. తరచూ మీరు కూడా షటప్ (Shutup), మైండ్ యువర్ బిజినెస్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, యూ డంబ్, అమ్మ తోడు, దేవుని తోడు వంటి పదాలను ప్రయోగిస్తుంటే ఇక మీ పిల్లలకు (kids) కూడా ఇవి ఊతపదాలుగా వచ్చేయడం ఖాయం. అందుకే మీరు ఇలాంటి కఠినమైన, కాస్త అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తుంటే వాటిని తక్షణం మానేయాలి. ముఖ్యంగా తల్లి-తండ్రుల మధ్య వాదులాట (quarreling) జరిగే సమయంలో మీ నోరును అదుపులో పెట్టుకోండి. పిల్లలు (kids) అన్నీ గమనిస్తున్నారని గుర్తుంచుకోండి.
ప్రోటోకాల్స్ పెట్టండి
ఇలా మాట్లాడాలి, ఇలా అస్సలు మాట్లాడరాదు, సారీ చెప్పు, అనవసరంగా ప్రమాణాలు (swear) చేయద్దు వంటివి తూచ పాటించేలా ఇంట్లో ప్రోటోకాల్స్ (protocols) పెట్టండి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఈ ప్రోటోకాల్ పాటిస్తే మీ పిల్లలకు (kids) చెడ్డ భాష, గలీజు భాష చీటికీ మాటికీ మాట్లాడే అలవాటు అవ్వదు.
అర్థాలు చెప్పండి
సడన్ గా మీ పిల్లలు (kids) ఏదో బూతు మాటే అన్నారనుకోండి. బహుశా వారికి ఆ పదాల అర్థం తెలియకపోవచ్చు.. పెద్దలుగా మీరు కోపాన్ని అణచుకుని వాటి అర్థాలేంటో వివరించి, ఇలా మాట్లాడితే జరిగే ప్రమాదాలు వివరించండి. అప్పుడు మీ పిల్లలు (kids) అలాంటి పదాలు వాడటాన్ని తక్షణం మానేస్తారు. అంతేకాదు కొన్ని విరుగుడులు చెప్పండి. అంటే కోపం అణుచుకోలేనంత వస్తే డామ్, డామిట్ వంటివి అనేలా సూటబుల్ పదాలను నేర్పండి.
సెన్సార్ తప్పదు
ఇంట్లో కూడా సెన్సార్ (censor) తప్పదు. ఇంటర్నెట్ లో, టీవీ షోల్లో మాట్లాడే అసభ్య పదజాలం వారి వరకూ చేరకుండా ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోక తప్పదు. కాబట్టి కొన్ని షోలను, సినిమాలను వారు చూడకుండా ఉండేలా సెన్సార్ చేసేయండి. కొన్ని మ్యూజిక్ వీడియోలు, గేమ్స్, షోలు, సినిమాల్లో చెడ్డ మాటలు లేదా భాష ఉండవచ్చు.. వాటిని మీరు ముందే పసిగట్టండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.