Home /News /life-style /

THESE ARE THE TIPS TO GROW YOUR HAIR NATURALLY RNK

Hair care tips: ఈ టిప్‌తో మీ జుట్టు వత్తుగా.. స్ట్రాంగ్‌గా పెరుగడం ఖాయం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

For long and strong hair: జట్టు అంటే ఇష్టం లేని వారుండరు. ఆడ మగ అనే తేడా లేకుండా అందరు వారి కేశాలపై అపరమైన ప్రేమ కలిగినవారే. ఈ హెయిర్‌కు సరైన చిట్కాలు ఎలా పాటించాలో వివరాలు తెలుసుకుందాం.

వారానికి ఓ రెండు సార్లు తలస్నానం (head bath) చేస్తే సరిపోతుంది. ఎక్కువ సార్లు చేస్తే.. హెయిర్‌ డ్రై అయిపోయే ఛాన్స్‌ ఉంటుంది. కాబట్టి కచ్ఛితంగా వీక్లీ రెండు సార్లు హెడ్‌ బాత్‌ చేయాల్సిందే.

  • హెడ్‌ బాత్‌ (head bath)  చేసిన తర్వాత మరో విషయం గుర్తుంచువాలి. క్లీన్‌ చేయని కొంబ్‌ వాడకూడదు. ఎందుకంటే హెడ్‌బాత్‌కు  (head bath) ముందు అది వాడాం. దానికి బ్యాక్టిరియా (bacteria) ఉంటుంది. తలస్నానం చేసిన తర్వాత అదే కోంబ్‌ను వాడితే అది స్కాల్ప్‌లోకి వెళ్తుంది.


సిరం...
హెడ్‌బాత్‌ చేసిన వెంటనే కచ్ఛితంగా ఏదైనా సిరం అప్లై చేసుకోవాలి. దీనికి ఓ స్పూన్‌ కలబంద, కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ ఆయిల్, ఓ విటమిన్‌ ఈ క్యాప్సూల్‌ వేసి కలిపి అప్లై చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏవైనా సిరమ్స్‌ కూడా పెట్టుకోవచ్చు. ఇది జుట్టును డ్రై అవ్వకుండా చేసి.. స్లి్పట్స్‌ రాకుండా నియంత్రిస్తుంది.

ఇది కూడా చదవండి: చక్కెర ప్యూరిటీని గుర్తించండి! లేకపోతే అందులో యూరియా..

కోంబింగ్‌..
హెయిర్‌ను వెట్‌గా ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడదు. అప్పుడు జుట్లు కుదుళ్లు తడిగా ఉంటాయి. దీంతో హెయిర్‌ ఫాల్‌ ఎక్కువవుతుంది.

  • చాలా మంది తెలియక కొబ్బరి నూనె పెట్టుకుని చిక్కుళ్లు తీసుకుంటారు. అలా చేయకూడదు. చేస్తే... హెయిర్‌ ఎక్కువగా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. హెయిర్‌ పొడిగా ఉన్నపుడు మాత్రమే కొంబింగ్‌ చేసుకోవాలి.

  • చిక్కులు తీసుకునే విధానం..
    ఎప్పుడైనా హెయిర్‌ను కింది నుంచి చిక్కులు తీసుకుంటూ రావాలి. ఆ తర్వాత చివరగా పైన చిక్కులు తీసుకోవాలి. లేకపోతే హెయిర్‌పై ఫోర్స్‌ పడుతుంది. కచ్ఛితంగా కొబ్బరినూనె పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా అని ఎక్కువ ఆయిల్‌ పెట్టుకోకూడదు.


ఇది కూడా చదవండి: బ్యాక్‌ పెయిన్‌కు ఇంట్లో ఉండే ఏకైక మందు ఏంటో తెలుసా?

ఇన్‌వెర్షన్‌ పద్ధతి..
మన తలని కిందకి వంచి వెనుకవైపు ఉండే వెంటుకలను కూడా కొంబింగ్‌ చేసుకోవాలి. దీంతో బ్లడ్‌ సర్క్యూలేషన్‌ బాగా అవుతుంది. హెయిర్‌ కూడా పెరుగుతుంది.

ట్రిమ్మింగ్‌...
స్లి్పట్‌ ఎండ్స్‌ను ట్రిమ్‌ చేస్తూ ఉండాలి. నెలకు ఒక్కసారి అయిన కట్‌చేయాలి. ఇవి హెయిర్‌ గ్రోత్‌కు అడ్డుగా ఉంటాయి. దీంతో జుట్టు పలచబడిపోతుంది.

హెయిర్‌ మాస్క్‌..
హెయిర్‌ మాస్క్‌ను వారానికి ఒకసారి పెట్టుకుంటే హెయిర్‌ డ్రైనెస్‌ పోవడంతోపాటు హెల్తీగా పెరుగుతుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Hair problem tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు