హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Ugadi 2022: ఉగాది రోజు చేయకూడని పనులు ఇవే..

Ugadi 2022: ఉగాది రోజు చేయకూడని పనులు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉగాది రోజున దాదాపు అందరు కూడా పంచాంగ శ్రవణం చేస్తుంటారు. అయితే పంచాగం వినేటప్పుడు దక్షిణ ముఖంగా కూర్చోకూడదని పండితులు చెబుతున్నారు.

ఉగాది... మన తెలుగింటి తొలి పండగ. ఈ పండగతోనే.. తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. అందుకే ఇది తెలుగువారి మొదటి పండగ అయింది. చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదినాడే… ఇలా చెప్పుకుంటూపోతే ఉగాది పండగకు సంబంధించిన ఎన్నో ఇతిహాసాలు, కథలు మన పురాణాల్లో కనిపిస్తాయి. అయితే ఉగాది మనకు పచ్చి ప్రకృతి పండగలా అనిపిస్తోంది.

ఉగాది పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండగ గుర్తొస్తుంది. ప్రకృతి పరంగా చూస్తే… మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అందుకే ఉగాదిని కొత్తదనానికి నాందిగా అభివర్ణిస్తారు. అయితే ప్రతీ పండగకు ప్రత్యేకతలు ఎలా ఉంటాయో.. ఆయా రోజుల్లో తప్పకుండా చేయాల్సిన పనులు.. అసలు ఏ మాత్రం చేయకూడని పనులు కూడా ఉంటాయి. మన పెద్దలు పండితులు పండగ పూట చేయాల్సిన పనులు.. చేయకూడని పనుల గురించి మనకు చెబుతుంటారు. అయితే ఉగాది రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయడం మంచిది కాదని చెబుతున్నారు పండితులు.

సాధారణంగా చాలామంది ఉదయం 9... 10 వరకు నిద్రపోతుంటారు. అయితే ఉగాది రోజు మాత్రం ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదంటున్నారు. కొందరికి పండుగలు, పబ్బాలు వస్తే.. చాలు ముక్క చుక్క ఉండాల్సిందే. మరికొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే ఈ ఉగాది రోజున మాత్రం మాంసాహారం, మద్యం లాంటివి తీసుకోకూడదు. ఇక ఉగాది రోజు చాలా మంది పంచాంగ శ్రవణం చేస్తుంటారు. అయితే అలా పంచాంగ శ్రవణం దక్షిణ ముఖంగా కూర్చొని చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా ఉగాది రోజు ఈ తప్పుల్ని చేయకుండా ఉంటే మంచి కలుగుతుందని చెబుతున్నారు.

వీటితో పాటు పండగరోజు కొన్ని పనులు చేయడం వల్ల కూడా మంచి కలుగుతుందని అంటున్నారు. ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి కలుగుతుంది. దీంతో పాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసినకర్రను కూడా ఉగాది రోజు కొనుక్కునేవారు. ఇక కొత్తబట్టలు, కొత్త ఆభరణాలు వేసుకోవడం ఉగాది రోజు మామూలే. అలానే ఉగాది రోజు దానం చేస్తే మంచి ఫలితం వస్తోంది. పూర్వం అయితే పండగపూట విసనకర్రలు దానం చేసేవారు.అలాగే ఇంట్లో ఉగాది పూజ దమనంతో చేయాలి. దమనమనేది సుగంధం తో ఉండే ఆకు. దీనితో పూజ చేస్తే చక్కటి ఫలితాలను పొందొచ్చు. ఉగాది పచ్చడి చేసుకుని కూడా తప్పకుండా తినాలి.

First published:

Tags: Hindu festivals, Maa Ugadi Veduka

ఉత్తమ కథలు