Home /News /life-style /

THESE ARE THE STORIES SHOULD INSPIRE US LIFELONG IN DIVERSITY A BILLION PEOPLE BANDED TOGETHER FOR HUMANITY SRD

భిన్నత్వంలో..మానవత్వం లక్షలాది మందిని ఒక్కటి చేసింది – వారి కథలు మనకు ఒక Lifelong పాఠాలు!

భిన్నత్వంలో..మానవత్వం లక్షలాది మందిని ఒక్కటి చేసింది – వారి కథలు మనకు ఒక Lifelong పాఠాలు!

భిన్నత్వంలో..మానవత్వం లక్షలాది మందిని ఒక్కటి చేసింది – వారి కథలు మనకు ఒక Lifelong పాఠాలు!

దేశవ్యాప్తంగా, ఎందరో తమకు ఏమాత్రం పరిచయంలేని వ్యక్తుల కోసం, వారి మందులు, ఆక్సిజన్, హాస్పిటల్ బెడ్‌లు వెతకడంలో, అంతే కాదు తమ వారికి చివరి వీడ్కోలు చెప్పడానికి స్మశానవాటికల వద్ద పొడవాటి లైన్‌లలో వేచి ఉన్న ఎందరికో సహాయం చేయడం కోసం అండగా నిలబడ్డారు.

ఇంకా చదవండి ...
  Covid19 భారతదేశాన్ని గట్టిగా దెబ్బతీసింది. మనలా హుషారైన కమ్యూనిటీలలో కూడా, ఈ ప్రాణాంతక వ్యాధి అందిరినీ శక్తి హీనులను చేసింది. ఇలాంటి సమయాలలో మనకు అంతగా తెలియని వారు, ఎలాంటి సంబంధం లేని వారి నుండి సహాయం అందింది.. అయినప్పటికీ, ఇది అనేక కుటుంబాలకి తమకి ప్రియమైన వారి ప్రాణాల కోసం చేసే చావు బ్రతుకుల పోరాటంగా మారింది.

  దేశవ్యాప్తంగా, ఎందరో తమకు ఏమాత్రం పరిచయంలేని వ్యక్తుల కోసం, వారి మందులు, ఆక్సిజన్, హాస్పిటల్ బెడ్‌లు వెతకడంలో, అంతే కాదు తమ వారికి చివరి వీడ్కోలు చెప్పడానికి స్మశానవాటికల వద్ద పొడవాటి లైన్‌లలో వేచి ఉన్న ఎందరికో సహాయం చేయడం కోసం అండగా నిలబడ్డారు. కులం, జాతి, సామాజిక దూరం అని వదిలేయ్యకుండా నిస్వార్థంగా, ధైర్యంగా వారి కోసం నిలబడిన వీరులకు ఈ ఘనత చెందుతుంది, వారే మనకి మనిషి అనే దానికి నిజమైన అర్థం చూపించారు.

  ఇవి రిసోర్స్ పూల్ చేసి, వృద్ధుల కోసం కనెక్ట్ అండ్ కేర్ వంటి వ్యవస్థలు సృష్టించి, అకస్మాత్తుగా జీవనోపాధి కోల్పోయిన పని వారు, డ్రైవర్ల కోసం యాప్‌లు అలాగే బిజినెస్‌లు కూడా క్రియేట్ చేసిన (అ)సాధారణ భారతీయుల కథలు ఇవి.  మీడియాలో భారీ కథనాలు వచ్చినప్పటికీ, అత్యంత అవసరమైన సమయాలలో సహాయం చేయడానికి సామాన్యలు వేల సంఖ్యలలో ముందుకు వచ్చారు. మేము, COVID పాజిటివ్ వచ్చిన రోగులకు, ఇంకా అవసరంలో ఉన్న వారికి సంజీవని వంటి రేషన్, మందులు ఇంకా ఇతర అత్యవసర వస్తువులు అందిచడానికి కొన్ని మైళ్ళ దూరం సైకిల్ తొక్కి వెళ్ళే హైదరాబాద్ వాసి, రిటైర్డ్ ఎయిర్ ఇండియా ఉద్యోగి శ్రీ కె.ఆర్ శ్రీనివాస రావు (70 సంవత్సరాలు), తమ కమ్యూనిటీలో సహాయం చేయడం మొదలుపెట్టి, సహాయం కోసం తరలివస్తున్న వేల ప్రజల కోసం వారి పనిని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్న ఒక యువ బృందం వంటి నిజమైన కథలు తెలుసు. విద్యార్థి అయిన అర్నవ్ ప్రణీత్ అలాగే తనతో మొదలైన కొద్ది మంది నిర్వాహకులు వారు రియల్-టైమ్‌లో ధృవీకరించిన రీసోర్స్‌ల డేటాబేస్ సెటప్ చేశారు. తనతో పాటు పని చేసింది అయాన్ ఖాన్, ఆదిత్య అగర్వాల్, సుదీప్తో ఘోష్, ముదిత్ అగర్వాల్, హర్భజన్ సింగ్ పుజారి, దేబోద్వాని మిశ్రా, దేబాదిత్య హల్దేర్, విశ్వం శ్రీవాస్తవ, జైదిత్య ఝా, ఆదిత్య గాంధీ, శివం సోలంకి, ప్రభాకర్ భార్గవ, అవి సెహగల్ మరియు ఇప్సిత చౌదరి.

  వారు సామాజిక మీడియా హద్దులను మరింత విస్తరించి, సహాయం కోసం, ఆక్సిజన్ కోసం, ప్రమాదకర స్థితిలో ఉన్న రోగుల విషయంలో సహాయం కోసం ఇంకా మరిన్నింటి కోసం ఎక్కడికి వెళ్ళాలి అనే మార్గ నిర్దేశం చేసారు. ఈ అందమైన మనసులకు మరింత మంది తోడయ్యి వందలాది వాలంటీర్లుగా మారి, ఒక రోజుకు సగటున 20కు పైగా క్రిటికల్ కేసులకు సహాయం చేయగలిగే స్థాయికి వెళ్లారు.  ఆ తర్వాత సోషల్ మీడియాలో లేని వారికి సహాయం చేయడానికి ఒక వెబ్‌సైట్ అలాగే హెల్ప్‌లైన్ కూడా ప్రారంభించారు. కానీ, ఇది ఇక్కడితో ఆగిపోలేదు. కొంత మంది ఇంకొక అడుగు ముందుకు వేశారు. రిక్షా నడిపే పునేకర్ అక్షయ్ కొతావాలే, తన పెళ్ళి కోసం దాచిన 2 లక్షల రూపాయలతో గత ఏడాది మార్చి నుండి 1,550కి పైగా కుటుంబాలకి ఆహారం, రేషన్ అందించారు. ఈరోజు కూడా, నగరం అంతటా వలస కార్మికులకు ఆహారం అందిస్తున్నారు.

  లక్షలాది మంది వైరస్ బారిన పడినప్పుడు, ఊహించని రీతిలో సహాయం అందింది. మాట్రన్ జెమినిబెన్ జోషి, గుజరాత్‌కు చెందిన 71-ఏళ్ళ రిటైర్డ్ నర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు నిర్విరామ శ్రమతో అలసిపోయిన వైనం గమనించారు. తన ప్రాణాలకు ప్రమాదం అవ్వచ్చు అని తెలిసి కూడా ఆవిడ తన పనిని తిరిగి ప్రారంభించారు, ఒక హాస్పిటల్‌లో మందులు అందిస్తూ, ఆక్సిజన్ అందిస్తూ, టెస్టింగ్ కోసం శాంపిల్స్ తీసుకుంటూ రోజుకి 12 గంటలు పని చేశారు.

  మహమ్మారి దృఢంగా మారినప్పుడు, మరణం తాండవం చేసి వేలమందిని బలి తీసుకుంది. హాస్పిటల్‌లలో ఆక్సిజన్ లేక, బెడ్ కావాలంటే వారి తమ ఆక్సిజన్ తీసుకుని రావాలి అనే స్థాయి వచ్చింది. ఇలాంటి సమయంలోనే దేవుడి పంపినట్టు, దేవదూతలా బీహార్ ‘ఆక్సిజన్ మ్యాన్’ గౌరవ్ రాయ్ ముందుకు వచ్చారు. తను దాచుకున్న 1.25 లక్షలు ఉపయోగించి, రాష్ట్రమంతటా ప్రమాదంలో ఉన్న వారికి ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. ఆయన ఫోన్ రింగ్ అవ్వడం ఆగేది కాదు, కానీ ఆయన పట్టుదలతో నిస్సహాయ స్థితిలో ఉన్న కనీసం 1,500 మంది ప్రాణాలు ఆయన కాపాడారు.

  మనలో ప్రతీ ఒక్కరికి ఇలాంటి అద్భుతమైన మనషుల తెలిసే ఉంటారు. ఇలాంటి నిస్వార్థ గాథలను రికార్డ్ చేసి, వారికి తగిన గౌరవం అందిచాలని Lifelong Online  నమ్ముతోంది. వారి సేవకు, వీరత్వానికి గౌరవం ఇవ్వడానికి, వారికి కృతజ్ఞతలు తెలియచేయడానికి, వారి కథలను ఆన్‌లైన్‌లో ఆర్కైవ్ చేయడం ఉత్తమ మార్గం. ఈ కలెక్షన్ మానత్వాంలోని ఈ భాగానికి బుక్‌మార్క్‌గా నిలవగలగాలి అని ఆశ. తద్వారా, మనం అందరం ఈ పేజీలను చదువుకుని స్ఫూర్తి చెందాలి.

  ఈ కష్ట సమయాలలో మీకు సహాయపడానికి అలాంటి అపరిచితుల గురించి మీకు తెలిసి ఉంటే, #NeverForgetLifelongతో వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయండి లేదా myhero@lifelongindia.com ఇమెయిల్ చేయండి.
  ఎందుకంటే, ఈ కథలను షేర్ చేయడం ద్వారా, దేశం కష్ట సమయంలో ఉన్నప్పుడు అండగా నిలబడిన అపరిచితులకు మేము మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేయాలనుకుంటున్నాము.

  This article has been created by Studio18 on behalf of Lifelong Online
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Corona

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు