Festive hairstyles: పండగపూట..ప్రత్యేకపూలతో ఫ్యాషన్‌ జడ!

ప్రతీకాత్మక చిత్రం

Festive hairstyles: మల్లెపూలు కేశాలంకరణకు అద్భుతంగా కనిపిస్తాయి. దీన్ని హెయిర్‌ బన్ను చుట్టు చుట్టకోవచ్చు. మీరు బన్‌ పైన లేదా కింద రింగ్‌ టైప్‌లో మల్లెలను అప్లై చేసుకోవచ్చు.

  • Share this:
ఏ పండగ లేదా ఫంక్షన్లకైనా అందంగా రెడీ అవ్వాలనుకునే ఆడవారికి కే వలం డ్రెస్సింగ్‌ మాత్రమే కాదు. కేశాలంకరణ (Hairstyle) కూడా ముఖ్యమే. రానున్న పండుగల నేపథ్యంలో కొన్ని కొత్త వస్త్రాలతో (New dresses) పాటు జడ కూడా కొత్తగా ప్రయత్నించండి. రంగురంగుపూలతో అందంగా మీ జుట్టును అలంకరించుకోవచ్చు. ప్రస్తుతం హెయిర్‌ బన్‌ చుట్టూ ఫ్లవర్స్‌ పెట్టుకోవడం ట్రెండ్‌. ఈ కేశాలంకరణ పండుగలకు, సాంప్రదాయ దుస్తుల్లో కూడా కచ్ఛితంగా అందంగా కనిపిస్తారు. ఈ హెయిర్‌ స్టైల్‌ను చీర లేదా లెహంగాలో చాలా అందంగా ఉంటుంది.

హెయిర్‌ బన్‌ (Hair bun) కు పువ్వులు మంచి లుక్‌ను ఇస్తాయి. బన్‌ స్టైల్‌ చాలా మంది మహిళలకు ఇష్టమైన కేశాలంకరణ. మీరు దీన్ని కాస్త భిన్నంగా చేయాలనుకుంటే.. మీకు కొన్ని ప్రత్యేక అంశాలు గుర్తుంచుకోవాలి. ఇంతకు ముందు గత్యంతరం లేదు అన్నట్లుగా పూలు పెట్టుకునే అమ్మాయిలు కూడా ఈ స్టైల్‌ను తెగ ఇష్టపడుతున్నారు. నిజానికి అందమైన పువ్వులు మీ రూపాన్ని పూర్తిగా నిండుగా కనిపించేలా చేస్తాయి. ఏ సమయంలోనైనా మిమ్మల్ని అద్భుతంగా చూపిస్తాయి.

ఇది కూడా చదవండి:   సౌత్‌కొరియా BTS బ్యాండ్‌ సభ్యుల కల్లు చెదిరే లగ్జరీ లైఫ్‌!

మల్లెపూలు...
అల్లిన మల్లెపూల మాల మీకు కచ్ఛితంగా మంచి రూపాన్ని ఇసుతది. మీరు కొంత సంప్రదాయ రూపంలో రెడీ అవ్వాలనుకుంటే.. దీనికి సరైన ఎంపిక లెహంగా లేదా చీర. ఏదైన ఎత్నిక్‌ లుక్‌కు కూడా ఉపయోగించుకోవచ్చు. మల్లెపూలు కేశాలంకరణకు అద్భుతంగా కనిపిస్తాయి. దీన్ని హెయిర్‌ బన్ను చుట్టు చుట్టకోవచ్చు. మీరు బన్‌ పైన లేదా కింద రింగ్‌ టైప్‌లో మల్లెలను అప్లై చేసుకోవచ్చు.

బంతిపూలు..
మేరిగోల్డ్‌ పూలు మీ జట్టుకు సరైన అభరణం. ఇది ప్రకాశవంతంగా, శక్తివంతంగా కనిపిస్తుంది. మీ జుట్టు బన్‌ చుట్టూ పూలు కట్టుకుంటే.. పట్టుచీర, లెహంగాలకు మంచి లుక్‌ ఇస్తుంది.

ఇది కూడా చదవండి:  కొత్తిమీరను 7 రోజులపాటు ఇలా నిల్వ చేసుకోవచ్చు!

ఆర్కిడ్‌ పూలు..
ఈ పూలు అంతర్జాతీయ పుష్పాలు. అయితే, దేశీ దుస్తుల్లో అద్భుతంగా కనిపిస్తాయి. మీరు మెరిసే లెహంగాలో ఈ పూలు పెట్టుకుంటే.. బాగుంటుంది. ఇతర పూల మాదిరి కాకుండా..ఇవి బన్నకు ఒక వైపు ఒకటి లేదా రెండింటిని మాత్రమే ఉపయోగించండి. ఇది కాకుండా స్టైలిష్‌ దుస్తులకు కూడా ఈ ఫ్లవర్‌ బాగా కనిపిస్తుంది.

గులాబీ..
గులాబీ పూవు అంటే దాదాపు అందరికీ ఇష్టం. గులాబీ చక్కదనం, అందం, ప్రేమకు చిహ్నం. ముఖ్యంగా ఎర్ర గులాబీలు ఏ రకమైన చీర లేదా లెహంగాతోనైనా అందంగా కనిపిస్తాయి.

హైడ్రేంజ..
అనుష్క శర్మ పెళ్లి రోజు ఈ హైడ్రేంజ పూలతో అలంకరించుకుంది. అప్పటి నుంచి మహిళలు హైడ్రేంజ పూవుపై క్రేజ్‌ పెంచుకున్నారు. ఇది చాలా భిన్నంగా, అందంగా కనిపిస్తుంది. లెహంగా లేదా సంప్రదాయ చీరలు లేదా అనార్కలీ సూట్‌ అయినా బాగుంటాయి. మీరు మొత్తం మీ బన్‌ను హైడ్రేంజ పూవులతో కవర్‌ చేసుకోవచ్చు. లేదా బన్‌ మధ్యలో ఒక పూవును పెట్టుకోవచ్చు.
Published by:Renuka Godugu
First published: