హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Work From Home: ఉద్యోగం చేస్తుంటే మీకు ఇలా అనిపిస్తుందా? అయితే.. జాబ్ మారాల్సిన సమయం వచ్చినట్లే.. తెలుసుకోండి

Work From Home: ఉద్యోగం చేస్తుంటే మీకు ఇలా అనిపిస్తుందా? అయితే.. జాబ్ మారాల్సిన సమయం వచ్చినట్లే.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Job tensions: ప్రస్తుతం మీరు చేస్తున్న జాబ్ మీకు ఇక సెట్ కావటం లేదని, మీరు ఉద్యోగం మారాల్సిన సమయం వచ్చిందని తెలుసుకునేందుకు కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలి. అవేంటంటే..

ప్రస్తుతం మీరు చేస్తున్న జాబ్ మీకు ఇక సెట్ కావటం లేదని, మీరు ఉద్యోగం మారాల్సిన సమయం వచ్చిందని తెలుసుకునేందుకు కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలి. మీకు నచ్చిన కంపెనీలో నచ్చిన జాబ్ రోల్ లో ఉన్నప్పటికీ ఆఫీస్ అంటే మీకు విపరీతమైన తలనొప్పి వస్తోందంటే మాత్రం విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిందే. గతంలోలా మీ పనితీరు, ఆలోచనా విధానం లేకపోతే మాత్రం ఇక కొత్త కొలువు వెతుక్కోవాలన్నమాట. మనందరికీ 2020 సంవత్సరం పలు సవాళ్లను మిగల్చగా ఆఫీస్ అంటే చాలా మందికి విపరీతమైన బోర్ తెచ్చిపెట్టింది. ఏదో సెలవు పెట్టాలనిపిస్తే సరి కానీ అలాకాకుండా ఇక ఏదో ఒక సాకు చెప్పి పదేపదే మీరు ఆఫీస్ కాల్, ఆఫీస్ వర్కు తప్పించుకుంటున్నారంటే ఉద్యోగం వేట మొదలుపెట్టాల్సిందే. మీ బాస్ అన్నా, మీ కొలీగ్స్ అన్నా మీకు అప్పుడప్పుడు విపరీతమైన చిరాకు తెప్పిస్తే సరేకానీ నిత్యం మీకు ఇలాంటి ఫీలింగ్ వస్తే ఇక పాత ఆఫీస్ కు గుడ్ బై కొట్టాల్సిన టైం వచ్చిందని ఫిక్స్ అయిపోండి.

యాంక్జైటీ డిసార్డర్ (Anxiety disorder)

కరోనా (Corona) సమయంలో ఉద్యోగులంతా ఎదుర్కొంటున్న ఈ యాంక్జైటీ డిసార్డర్ మీలోనూ ఉందంటే అది ఏస్థాయిలో ఉందో గుర్తించే ప్రయత్నం చేయండి. ఉద్యోగిగా మీరు అనుభవిస్తున్న యాంక్జైటీ విపరీతమైన స్థాయిలో ఉంటే మాత్రం జాగ్రత్తపడండి. మీ టీంలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల తీవ్రస్థాయిలో పనిఒత్తిడి ఉందా? అదనపు ఉద్యోగ బాధ్యతలు మోయలేనంతగా ఉన్నాయా వంటివి ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి. పదేపదే నిందారోపణలు చేయటం వంటివి గతంలో ఎన్నడూ లేనివి ఇప్పుడు జరిగి, మీకు మానసికంగా అధిక భారం అయితేమాత్రం ఇక ఈ కొలువు నుంచి తప్పుకోండి.

వర్క్ ఫ్రం హోం కారణంగా అతిగా పనిభారం మోయాల్సి వస్తున్న ఉద్యోగులంతా ఒక్కసారి తమ తాజా పరిస్థితిని రివ్యూ చేసుకునే చాన్స్ వచ్చింది. ఈ యాంక్జైటీ మరీ ఎక్కువ అయితే కాస్త వర్క్ నుంచి బ్రేక్ కూడా తీసుకోండి. ఎక్స్టెండెడ్ వర్కింగ్ అవర్స్, రిమోట్ వర్కింగ్ కారణంగా ఉద్యోగులు పని ఒత్తిడిని గతంలో ఎన్నడూ లేనిదానికంటే ఎక్కువ స్థాయిలో అనుభవిస్తున్నట్టు సైకాలజిస్టులు వివరిస్తున్నారు కూడా. ఇంతకీ మీ మెంటల్ హెల్త్ పరిస్థితి దారుణంగా పడిపోయిందని చెప్పే కొన్ని సూచనలు మీరు చెక్ చేసుకోండి..

సిక్ లీవ్

పదేపదే సిక్ లీవ్ అప్లై చేస్తున్నారా? పెద్దగా అవసరం లేకపోయినా, ఆఫీసు పని తప్పించుకునేందుకు ఏదో సాకులు చెప్పేందుకు సిక్ లీవ్ పెడుతున్నారా? ఆఫీసులో అంతా సవ్యంగా లేదని చెప్పేందుకు మీ లీవ్ ట్రాక్ రికార్డ్ చాలు. సిక్ లీవ్ పెట్టి బయటికి వెళ్లి మీ ఫ్రెండ్స్ లేదా క్లైంట్లను కలిసేందుకు మొగ్గుచూపుతున్నారా? మీ వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ తప్పించుకునేందుకు మీరిలా చేస్తుంటేమాత్రం సిక్ లీవ్ దీనికి పరిష్కారం కానేకాదని గుర్తించండి. సో.. ఇక కొత్త జాబ్ వెతుక్కోండి.

ఆఫీస్ కాలంటే పానిక్

ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందన్నా, మీ కొలీగ్స్ నుంచి కాల్ వచ్చిందిన్నా ఉలిక్కిపడుతున్నారా? మీ మేనేజర్, టీం లీడర్, ఆఖరుకి మీ సబార్డినేట్ కాల్ చేసినా మీకు పానిక్ గా ఉందంటే మీ ప్రస్తుత జాబ్ మారాలని అర్థం. మీ ఆఫీస్ కాల్స్ తో మీకు కడుపునొప్పి, చెస్ట్ పెయిన్, వాంతికి వచ్చినట్టు, హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతోందంటే ఇక మీరు ఈ ఉద్యోగంలో ఇక ఎక్కువ కాలం ఉండటం కష్టం కావచ్చు. మరోవైపు ఇలాంటి లక్షణాలన్నీ ఉంటేమాత్రం ముందు మీరు ప్రొఫెషనల్ థెరపిస్ట్ ను సంప్రదించండి. అంతేకాదు డిజిటల్ డీటాక్స్ (digital detox) కూడా మీరు ట్రై చేయాల్సిన సమయం వచ్చిందని గుర్తించి ఈ ప్రయత్నం కూడా చిత్తశుద్ధితో చేయండి.

టీంమేట్స్ తో సోషల్ ఈవెంట్స్ వద్దు

టీం లంచులు, పార్టీలు, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ను మీ కొలీగ్స్ తో మీరు ఎంజాయ్ చేయలేక, సాకులు చెప్పి వీటిని ఎగరగొడుతున్నారనుకోండి. ఇక మీరు ఇలాంటి సోషల్ ఈవెంట్స్ కు దూరంగానే ఉండండి. టీం ఔట్, పిక్నిక్, ఫ్రైడే పార్టీలు మీరు బలవంతంగా మీ కొలీగ్స్ తో వెళ్తేమాత్రం మీకు యాంక్జైటీ ఇంకా పెరుగుతుంది. మీలో అతిగా మూడ్ స్వింగ్స్ ఉన్నాయంటే మీరిక ఉద్యోగం మారాల్సిందే.

ఆత్మన్యూనత

మీరు తరచూ చాలా ఆత్మన్యూనతతో ఫీల్ అవుతున్నారంటే అందుకు మీ ఉద్యోగం కారణం అయితేమాత్రం ఉద్యోగం మారేప్రయత్నాలు మొదలుపెట్టాల్సిందే. టార్గెట్లు వంటివి పూర్తిచేసినప్పటికీ మీరు లోగా ఫీల్ అవుతున్నారంటే ఈ ఉద్యోగం మీకు సరికాదని అర్థం.

శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం

మీరు పనిచేసేచోట మాత్రమే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఎంచుకోండి. దీంతో మీ సహఉద్యోగులతో అనారోగ్యకరమైన వాతావరణాన్ని మీరు బలవంతంగా భరించాల్సిన అవసరం ఉండదు. ఆఫీసుకు దూరంగా ఉంటే చాలు మీరు బెటర్ గా ఫీల్ అవుతున్నారంటే ఈ ఆప్షన్ ఎంచుకోండి. నెగిటివ్ ఫీలింగ్స్ కు దూరంగా ఉంచేలా మీకు WFH ఉపయోగపడుతుంటే మీరు మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు కోరుకున్న కంపెనీలో, మీ డ్రీమ్ కంపెనీలో డ్రీమ్ ప్రాజెక్టులో పనిచేస్తున్నా మీకు మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉందంటే అది మీకు సెట్ కాలేదనేది సారాంశం.

First published:

Tags: Job, Work From Home

ఉత్తమ కథలు