Home /News /life-style /

THESE ARE THE BOLLYWOOD CELEBRITIES FAVORITE BREAKFAST RNK

Breakfast: అనుష్క శర్మ-ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ సెలబ్రిటీస్ అమితంగా ఇష్టపడి తినే బ్రేక్ ఫాస్ట్ ఏంటో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bollywood celebrities breakfast: ఈరోజు ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు రోజంతా ఎనర్జిటిక్ గా .. మెరుస్తూ ఉండేందుకు వారు తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏంటో మీకు తెలుసుకోవాలనుందా? అయితే, అవెంటో తెలుసుకోండి..

సాధారణంగా మనమందరం స్టైల్ సెన్స్ (Style sense) కోసం ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood) లో లీడింగ్ ఉన్న హిరోయిన్లను ఫాలో అవుతాం. వారి ఫిజిక్ అంత పర్ఫెక్ట్ గా ఉండటానికి వారు తీసుకునే ఫుడ్, ఇతర వర్కౌట్స్ (Workouts) ఏంటబ్బా? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే  ఈరోజు ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు రోజంతా ఎనర్జిటిక్ గా .. మెరుస్తూ ఉండేందుకు వారు తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏంటో మీముందుకు తీసుకువచ్చాం.

ప్రియాంక చోప్రా..
సరోగసీ (Surrogacy) ద్వారా ఇటీవలె తల్లైన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. పెళ్లి దృష్ట్య ప్రియాంక ఎక్కువశాతం విదేశాల్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆమెకు  ఉదయమే అమ్లెట్ టోస్ట్ లేదా అవకాడో టోస్ట్ అంటే ఫెవరేట్ బ్రేక్ ఫాస్ట్. . ఇక ఆమె నెగిటివ్ ఫుడ్ అయిన పంజాబీ వంటకాల్లో ఆలు పరాఠా , దోశ, ఇడ్లి, పోహ ను బ్రేక్ ఫాస్ల్టో చేర్చుకోవడం ఇష్టమట.

అనుష్క శర్మ..
ఇటీవలె తమ కూతురు ఫోటోలు ఇంటర్నెట్ లో లీకైన సందర్భంగా మళ్లీ వార్తల్లో నిలిచిన అనుష్క శర్మకు కూడా ఫుడ్ ప్రేమికురాలే. ఆశ్చర్యం ఏంటంటే ఈ బ్యూటీకి పూరీ, పరాఠా అస్సలు పడదట. బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్, చీయాసీడ్స్ పోరిడ్జ్ ను తీసుకోవడానికే ఇష్టపడతారు. ఈ విషయాన్ని 2021 లో ఇన్ స్టాగ్రామ్ అనుష్కనే షేర్ చేశారు.

దీపికా పడుకొణె..
దీపికా సౌత్ ఇండియన్ ఫుడ్ లవర్. అందుకే ఉదయం తన బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లి లేదా వడ సంబార్ ను కొకొనట్ చట్నీతో తీసుకుంటారు. దాంతోపాటు ఫిల్టర్ కాఫీ తీసుకోవడం అలవాటు.

 ఇది కూడా చదవండి: అనవసరంగా మాత్రలు వేసుకోవడం వల్ల శరీరానికి కలిగే 5 హనికరాలు! జాగ్రత్తపడండి..


కరీనా కపూర్ ఖాన్..
ఇద్దరి పిల్లల తల్లి అయినా కరీనా.. చాలా స్ట్రిక్ట్ డైట్ పాటిస్తారు. తనకు వైట్ మఖ్కన్, స్టఫ్డ్ పరాఠాకు మించిందేది నచ్చదట. ఇక కరీనా బ్రేక్ ఫాస్ట్ లో దోస, ఇడ్లి, పోహ కూడా తీసుకుంటారు.

మలైకా అరోరా..
మలైకా వర్కౌట్స్ మనకు తెలిసిందే.. ఇందులో భాగంగా ఉదయమే వేడినీరును తాగడం ఆమెకు అలవాటు. లెమన్ జ్యూస్ తోపాటు వెజిటేబుల్స్ , కర్రీ లీవ్స్, పీనట్స్ తో కూడిన ఒక బౌల్ పోహను బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా తీసుకుంటారు.

కృతి సనన్..
ఈ బాలీవుడ్ బ్యూటీ బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన గుడ్డు, టోస్ట్ ను తీసుకుంటారట. అంతేకాదు బట్టర్ వేసి చేసిన వాము పరాఠా కూడా తీసుకుంటారు.

 ఇది కూడా చదవండి: తమలపాకును ఇలా వాడితే మీ ముఖ తేజస్సు డబుల్ అవుతుంది.. ఎలాగో తెలుసా?


శిల్పాశెట్టి కుంద్రా..
ఈ గ్రేట్ ఇండియన్ డైట్.. నాలుగు ధాన్యాలను (జొన్న, మక్క, హోల్వీట్, నచ్నితో కూడిన పనీర్ బూర్జీ, తోఫూ) ఇష్టపడతారు. ఒక్కోసారి వీట్ ఉప్మా, లో ఫ్యాట్ మిల్క్ తీసుకుంటారు. ఒక పుస్తకంలో తనకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే కూడా చాలా ఇష్టమన్నారు. అందుకే అప్పుడప్పుడు బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లి సాంబార్ ఆమె బెస్ట్ ఛాయిస్.

కత్రీనా కైఫ్..
ఈమెకు గుడ్లంటే భలే ఇష్టంగా తింటారట. స్వీట్ పొటాటో మరో ఆప్షన్. అంతేకాదు, పోచ్డ్ ఎగ్స్, ఎగ్ బెనెడిక్ట్, మెష్డ్ స్వీట్ పొటాటో కత్రీనా అమితంగా తినే బ్రేక్ పాస్ట్.

తాప్సీ పన్ను..
తాప్సీ కూడా ఉదయమే కనీసం లీటర్ గోరువెచ్చని నీటిని తీసుకోవడం అలవాటు. దీంతోపాటు వాల్నట్స్, బాదం కూడా తీసుకుంటారు. బాడీ ఆల్కలైన్ మారుస్తుందని  కుకుంబర్ జ్యూస్ తీసుకుంటారు. . ఒకానొక ట్వీట్ లో ఆమెకు ఛోలే బాచూరీ కూడా ఇష్టమని తెలిపింది.

అలీయా భట్..
అలీయాకి ఆలు, చాకొలేట్స్ అంటే చాలా ఇష్టం. Ask-Me-Anything’ ఇన్స్టాగ్రామ్ సెషన్లో ఆమెకు ఉదయమే ఆలూ పరాఠా తినడాన్ని ఇష్టపడతానన్నారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Alia Bhatt, Anushka Sharma, Bollywood beauty, Breakfast, Priyanka Chopra

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు