హోమ్ /వార్తలు /life-style /

Hair extensions care: మీ హెయిర్ ఎక్స్‌టెన్షన్ ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే.. ఈ అద్భుతమైన టిప్స్ మీకోసమే..

Hair extensions care: మీ హెయిర్ ఎక్స్‌టెన్షన్ ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే.. ఈ అద్భుతమైన టిప్స్ మీకోసమే..

Hair extensions care: మీరు వాడే ఎక్స్‌టెన్షన్ ఎక్కువకాలం మన్నికగా ఉపయోగించాలంటే.. వాటికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

Hair extensions care: మీరు వాడే ఎక్స్‌టెన్షన్ ఎక్కువకాలం మన్నికగా ఉపయోగించాలంటే.. వాటికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

Hair extensions care: మీరు వాడే ఎక్స్‌టెన్షన్ ఎక్కువకాలం మన్నికగా ఉపయోగించాలంటే.. వాటికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

    హెయిర్ ఎక్స్‌టెన్షన్ (Hair extensions)  నేచురల్ జుట్టు కానప్పటికీ వీటిని ఉపయోగించేటప్పుడు మామూలు హెయిర్ లా కనిపించాలంటే కొన్ని టిప్ప్ పాటించాలి. దీంతో అవి ఎక్కువగా కాలం మన్నడంతోపాటు నేచురల్ లుక్ ఇస్తాయి. వీటికి మీ జుట్టుకు (Hair care) ఉపయోగించే ఉత్పత్తులను ఉపయోగించాలి. కానీ, ఎక్కవ కఠినంగా రసాయనాలను ఉపయోగించకూడదు. దీంతో సాధ్యమైనంత ఎక్కవ కాలం ఉపయోగించవచ్చు.

    ఎక్స్‌టెన్షన్ కడిగే విధానం..

    ఎక్స్‌టెన్షన్ రూట్స్ నుంచి ఆయిల్ను తొలగించే షాంపూలను ఎంచుకోవాలి. మీ వెంట్రులకు ఉపయోగించే షాంపూ కండీషనర్లను మాత్రమే ఉపయోగించండి. అలాగే వీటి వాషింగ్ కి వేడినీరు కాకుండా.. గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. వేడినీళ్లతో వెంట్రుకలు పొడిబారిపోతాయి.

    ఎక్స్‌టెన్షన్ పెట్టుకుని పడుకోకండి..

    వాష్ చేసిన తర్వాత వాటిని ఆరబెట్టాలి. ఇవి పూర్తిగా ఆరనివ్వాలి. వాటిని పెట్టుకుని పడుకోకూడదు. తడిగా ఉన్నప్పుడు జుట్టు బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఎక్స్‌టెన్షన్ డ్యామేజ్ అవుతుంది.

    ఇది కూడా చదవండి: ఈ 5 రాశుల స్త్రీలకు బెస్ట్ మామ్ అయ్యే లక్షణాలు ఉంటాయట..

    దువ్వే విధానం..

    మీరు మీ సహజ జుట్టును చాలా గట్టిగా బ్రష్ చేస్తే కూడా రాలిపోతాయి. అందుకే అతి జాగ్రత్త తీసుకోకపోతే మీ ఎక్స్‌టెన్షన్ వదులుగా మారతాయి. వీటికి చిక్కులు రావడం సహజం. కానీ మీరు దానితో ఎలా వ్యవహరిస్తారు అనేది క్లిష్టమైనది. అధిక-నాణ్యమైన దువ్వెన వాడాలి. తరువాత, మీరు మీ జుట్టును చివర నుండి దువ్వుతూ పైకి వెళ్లాలి. ఈ ప్రక్రియ మీ జుట్టు, ఎక్స్‌టెన్షన్, స్కాల్ప్‌పై అతి తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది, వాటిని మంచి స్థితిలో ఉంచుతుంది. మీరు రోజుకు ఎన్నిసార్లు దువ్వుతున్నారనే విషయానికి వస్తే, మీరు ఎంత సున్నితంగా ఉంటే అంత మంచిది. అయితే, ఎల్లప్పుడూ ఉదయం, పడుకునే ముందు, కడగడానికి ముందు, కడిగిన తర్వాత దువ్వుతే సరిపోతుంది.

    ఇది కూడా చదవండి: షుగర్ లెవల్స్ పెరిగాయా? ఈ ఒక్క రెమిడీతో సాధారణ స్థాయికి వచ్చేస్తుంది! 

    వారానికోసారి కండిషనింగ్ ..

    ఎక్స్‌టెన్షన్ తేమగా, మృదువుగా, మెరుస్తూ ఉంచడానికి, మీరు ఎల్లప్పుడూ వారానికోసారి కండిషనింగ్ షెడ్యూల్ చేయాలి.

    నో హీట్..

    ఎక్స్‌టెన్షన్ పై ఎక్కువ హీట్ వాడితే అవి మీ ఓరిజినల్ జుట్టు మాదిరి పాడవుతాయి. ఎందుకంటే ఇవి నూరుశాతం మానవ వెంట్రుకలతో తయారు చేసినవి కాబట్టి. అవి డ్రైగా మారి, చివర్లు చిట్లిపోతాయి. ఎక్స్‌టెన్షన్ పాడైన తర్వాత మీరు ఎంత కండిషనింగ్ ట్రీట్ మెంట్ చేసినా జుట్టును రీప్లేస్ చేయలేరు.

    First published:

    ఉత్తమ కథలు