THESE ARE THE BEST LESSONS FOR MARITAL LIFE AND DO NOT OPT DIVORCE RNK
Marital life: విడాకులు లేని వివాహనికి ఇలా చేసి చూడండి!
ప్రతీకాత్మక చిత్రం
For stronggest marital life: జీవితంలో కష్టాలు సర్వ సాధారణం. అయితే, మాత్రం అవి బంధాలకు మించిన వి కావు కదా! పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలు ఎన్నడూ మార్చిపోకుండా ఉండాలి.
వైవాహిక జీవితంలో Marital life అందంగా, ప్రశాంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆశించిన జీవితం సాకారం కానప్పుడు లేదా మనస్సు ఇద్దరి మధ్య దూరం పెరిగినపుడు ఇక విడాకులే Divorce దారి అనుకుంటారు. ఈ చేదు అనుభవం మన జీవితంలో ఎదురుకాకూడదు అనుకునేవారు ఈ కొన్ని చిట్కాలను పాటించండి.
ఆనందం..
వివాహ జీవితం ఆశించిన విధంగా సంతోషంగా లేకుంటే.. కొంతమంది విడాకులను ఎంచుకుంటారు. కానీ, విడాకులు తర్వాత ప్లాన్ చేసుకున్న రెండో వివాహం సంతోషంగా ఉంటుందని గ్యారెంటీ ఉండదు. అందుకే జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఎదరైనపుడు.. కాస్త అవగాహనతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మేలు.
చదువు..
వివాహం కోసం చదువు, పనిని వదులుకోవడం మంచి నిర్ణయం కాదు. వివాహం చేసుకోండి.. అలాగే మీకు అనుకూలమైన పరిస్థితులు వచ్చే వరకు ఉద్యోగాన్ని కూడా వదలకండి. ఏదో ఒక సమయంలో మీ చదువు మీకు అండగా ఉంటుంది. ఒకవేళ మీరు వైవాహిక జీవితానికి దూరంగా ఉంటే.. ఆ సమయంలో ఎవరిపై భారం కాకుండా.. స్వంతగా మీ కాళ్లపై మీరు నిలబడేలా.. ఆత్మగౌరవంతో ఉండటానికి ఈ చదువే సహాయపడుతుంది.
నిజం..
జీవితంలో కష్ట సమయాల్లో మీరు సంతోషంగా ఉన్న సమయాల్లోనే చేసిన వాగ్దానాలు మర్చిపోకుండా ఉండాలి. ఈ వాగ్ధానమే మీరు కలసి ప్రయాణం చేయడానికి విశ్వాసం. ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకం, ప్రేమ ఎప్పుడూ గుర్తుంచుకుంటారు.
ప్రేమ..
జీవితంలో శృంగారం, ప్రేమ ఎప్పుడూ ఒకేవిధంగా ఉండాలని ఆశించకూడదు. ఆర్థిక సంక్షోభం వస్తే... భాగస్వామిపై ఉన్న ప్రేమ తగ్గినట్లు అనిపించకూడదు. ఎందుకంటే వివాహ జీవితంలో పిల్లల పెంపకంతోపాటు అనేక విషయాలతో ముడిపడి ఉంటుంది. మీరు ప్రేమించుకున్న రోజులను మరోసారి గుర్తు చేసుకోండి. అంతేకాని, వైవాహ జీవితాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన రాకూడదు.
సమస్యలు..
వైవాహిక జీవితంలో కలిసి ఉంటే సమస్యలు కూడా పరిష్కరించవచ్చు. మన సమస్యలు వేరే ఎవరో పరిష్కరిస్తారనుకోకూడదు. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. మనల్ని మనం అభివృద్ధి చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించినపుడు మీ సమస్యలు సులభంగా పరిష్కరించే సామర్థ్యం మీకు వస్తుంది.
సమానం..
వివాహ జీవితంలో ఇద్దరూ సమానమే. ఎవరూ మరొకరి కంటే గొప్ప కాదు. ఒకరి స్వేచ్ఛ, హక్కులకు విలువనివ్వాలి. ఆర్థిక పరిస్థితులతోపాటు పని విషయాల్లో కూడా ఒకరినిఒకరు అహం ప్రదర్శిస్తే.. కచ్ఛితంగా జీవితం అందంగా ఉండదు. ప్రేమకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి.
తప్పులు..
వివాహ జీవితంలో మరో పెద్ద తప్పు భాగస్వామిని మాత్రమే నిందించడం. వారిద్దరూ తమ తప్పులను ఒప్పుకోవడం, మరచిపోవడం మంచిది. తప్పులు మీకు పాఠాలు నేర్పిస్తాయి. దాన్ని మీ జీవితానికి సంతోషంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.