Home /News /life-style /

ఎదిగే పిల్లలకు ఈ 5 పోషకాలు చాలా ముఖ్యం! మరి, మీ పిల్లలకు ఇవి పెడుతున్నారా?

ఎదిగే పిల్లలకు ఈ 5 పోషకాలు చాలా ముఖ్యం! మరి, మీ పిల్లలకు ఇవి పెడుతున్నారా?

పెరుగుతున్న పిల్లలకు పోషకాలు ఉన్న ఆహారం అందించడం ఎంతో అవసరం. వర్షాకాలం కారణంగా ఎన్నో వ్యాధులు కూడా వస్తాయి. వీటిని అధిగమించి బలంగా ఉండాలంటే ఈ పోషకాలే వారికి సహాయపడతాయి. 

    ఈ రోజుల్లో చిన్న పిల్లలను పెంచడం ఎంతో సున్నితమైన విషయం. వారిని పెంచడంపై కాస్త దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్వకాలంలో కాకుండా ప్రస్తుత కొత్తగా.. విభిన్నంగా వివిధ రకాల ఆహారం లభిస్తుంది. వాటిని పిల్లలకు ఎలా పెట్టాలో.. వారి ఎదుగుదలకు ఎలా సహాయపడతాయోననే సందేహం ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు ఈ విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించాలి. మీరు కూడా అలాంటి కేటగిరీలో ఉంటే.. ఎదిగే పిల్లలు మీ ఇంట్లో ఉంటే ఎలాంటి ఆహారం అందించాలనేది కాస్త తెలుసుకోండి. పిల్లల ఆరోగ్యంపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని అంటారు. ఎందుకంటే అది పిల్లల పెరుగుదల, జీవక్రియపై ప్రభావం పడుతుంది. మీ ఎదిగే పిల్లలకు ఎలాంటి పోషకాహారం ముఖ్యమో ఓసారి చూడండి.

    ప్రోటీన్‌లు..
    చేపలు, పౌల్ట్రీ, మాంసం, గుడ్డు,పాలు, కూరగాయలు, పెరుగు, పనీర్‌ చీజ్, సోయ, టోఫు, వేరుశనగల్లో ప్రోటిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అంతేకాదు మీ పిల్లల్లో కండరాలు, ఇతర కణజాలాల నిర్మాణంలో ఇవి సహాయపడతాయి.

    విటమిన్‌ సీ..
    విటమిన్‌ సీ ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి, వాటితో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్‌ సీ వల్ల పిల్లలు ఆడుకునేటపుడు గాయపడితే, వాటిని త్వరగా నయం కావడానికి ఉపయోగపడుతుంది. సిట్రస్‌ పండ్లు పిల్లలకు మంచివి. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి విటమిన్‌ సీ పండ్ల రసాలు పిల్లల ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. జామ, బొప్పాయి, టమాట వంటి కూరగాయలు కూడా విటమిన్‌ సీ కలిగి ఉన్న కూరగాయలు. ఇవి ఐరన్‌ను గ్రహిస్తాయి.

    విటమిన్‌ డీ..
    పిల్లలకు విటమిన్‌ డీ పొందడానికి సూర్యకాంతి మంచిది. వారిని సూర్యకాంతిలో ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఇంటి బాల్కనీ, టెర్రస్‌పై ఆడుకోనివ్వాలి. ఎముకలు దృ«ఢంగా, ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ విటమిన్‌ అవసరం.

    సరైన మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఇవ్వడం మంచిది. ఇది మెదడు, నరాల అభివృద్ధికి మంచిది. ముఖ్యంగా ఇది పిల్లల జీవక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. కానీ, వేయించిన ఫుడ్‌లలో ఉండే ఫ్యాట్‌ మాత్రం మంచిదికాదు. ఈ ఆహారంతోపాటు హైడ్రేషన్‌ కూడా ముఖ్యం, నీరు తాగడం ద్వారా టాక్సిన్స్‌ శరీరం నుంచి బయటకు పోతాయి. సమతూల్య ఆరోగ్యకరమైన ఆహారం పిల్లలకు సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది.
    Published by:Renuka Godugu
    First published:

    Tags: Children, Fruits, Sun

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు