Home /News /life-style /

THESE ARE EVERY MORNING HEALTHY BREAKFASTS FOR KIDS RNK

9 Healthy breakfasts: మీ పిల్లలు ఇష్టపడి తినగలిగే 9 రకాల హెల్తీ బ్రెేక్ ఫాస్ట్ రెసిపీలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

9 Healthy breakfasts for kids: ఈరోజు మనం రుచికరమైన.. త్వరగా తయారు చేసుకునే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు ఏంటో తెలుసుకుందాం.

Breakfast for kids: మనం రోజంతా ఏ ఫుడ్ తిన్నా.. బ్రేక్ ఫాస్ట్ (Breakfast) చాలా కీలకం. ఎందుకంటే ఇది మనల్ని రోజంతా యాక్టీవ్గా ఉండేలా చేస్తుంది. అయితే, పిల్లలకు (Kids)  కూడా బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమైన అంశం. ఇది వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. నిజానికి 20-30 శాతం పిల్లలు తమ బ్రేక్ ఫాస్ట్ను (Breakfast)  స్కిప్ చేస్తున్నారని ఒక సర్వేలో తేలింది. పేరెంట్స్ కూడా ఇది ఒక పెద్ద టాస్కే..

వీట్ బ్రాన్ ప్యాన్ కేక్స్..
ప్యాన్ కేక్స్ (Pancakes) , వేఫీల్స్ బ్రేక్ ఫాస్ట్ ఛాంపియన్లని చెప్పాలి. ఇది రుచి విషయానికి వస్తే.. కానీ, ఇందులో పిండి, ఓట్స్ కలిపిన మైదాతో తయారు చేస్తారు. దీన్ని మరింత బలవర్ధకంగా మార్చుకోవడానికి ఇందులో తేనె, బెల్లం, అరటిపండ్లు, కోకోవా పౌడర్ వాడితే పిల్లలు కూడా మరింత ఇష్టపడి తింటారు.

క్వినోవా ఉప్మా..
ఇది మంచి వెజిటేబుల్ బ్రేక్ ఫాస్ట్ (Breakfast) . మీరు వాడే ఉప్మారవ్వ బదులుగా క్వినోవా (Quinoa) జత చేసి చూడండి. ఇందులో అత్యధికంగా ప్రోటీన్స్, ఫైబర్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

ఇది కూడా చదవండి: మీ ఫైనాన్షియల్ లైఫ్ 2022లో ఇలా హ్యాపీగా మార్చుకోండి..

పీనట్ బట్టర్, హోల్ గ్రెయిన్ టోస్ట్..
సులభంగా తయారు చేసుకునే ఈ పీనట్ బట్టర్, టోస్ట్ కాంబోను పిల్లలు ఇష్టపడి తింటారు. అయితే, తీపి కోసం ఇందులో కొన్ని అరటిపండ్లను ఉపయోగించాలని నిర్ధారించుకోండి. మీరు మరింత క్రంచ్ కోసం కొన్ని తేనె లేదా చియా సీడ్స్ కూడా చల్లుకోవచ్చు. అప్పుడు బ్రేక్ ఫాస్ట్ రెసిపీల్లో ఇదే అగ్రస్థానం పొందుతుంది.

ఓట్స్ ఇడ్లీ..
ఇడ్లీ ఆల్ టైం ఫెవరేట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ. అయితే, పిల్లలకు తయారు చేయాలనుకున్నప్పుడు బేస్ ను ఇడ్లీరవ్వ బదులుగా ఓట్స్ ను కలపండి. దాన్ని పప్పుతో కలిపి తీసుకుంటే అదనంగా ఫైబర్, ప్రోటీన్స్, మంచి శక్తి లభిస్తుంది.

చాకొలేట్ మ్యూసిలీ..
చాకొలేట్తో తయారు చేసిన వాటిలో ఎప్పుడు షుగర్ కలిసి ఉంటుంది. మ్యూసిలీ దీంట్లో మంచి ఎంపిక. ఇందులో హోల్ గ్రెయిన్స్, నట్స్, బెర్రీ, తక్కువ మోతాదులో చక్కెర ఉంటుంది. ఇది పిల్లలు రోజంతా యాక్టీవ్గా, ఎనర్జీటిక్ గా ఉండేలా ప్రోత్సహిస్తుంది.

ఇది కూడా చదవండి: మీలో ఈ 5 లక్షణాలు ఉంటే.. మిమ్మల్ని బ్యాడ్ స్పీకర్ అనుకుంటారు..

బనానా బెర్నీ స్మూథీ..
ఒకవేళ మీరు పనులకు వెళ్లే తల్లిదండ్రులు అయితే, బనానాను బ్లెండ్ చేసి, బెర్రీ, ఓట్స్, పాలు కాలిపి ఈ స్మూథీని తయారు చేసి ఇవ్వండి. ఇవన్ని కలిపి మరోసారి గ్రైండ్ చేసుకుంటే రోజంతటికీ సరిపడే పోషకాలు తయారవుతాయి.

ఓవర్ నైట్ ఓట్స్..
వీటిని తయారు చేయడం సులభం, చాలా ఆరోగ్యకరమైనది. ముందు ఓట్స్ ముందు రోజు రాత్రి వాటిని నానబెట్టండి. మీ పిల్లలకి ఇష్టమైన టాపింగ్స్‌తో ఈ వంటకాన్ని అందించండి. మీరు 1/4 కప్పు (26 గ్రాములు) రోల్డ్ వోట్స్ 1/2 కప్పు (120 మి.లీ) పాలను ఒక చిన్న మేసన్ జార్‌లో కలపాలి. గింజలు, తురిమిన కొబ్బరి, చియా గింజలు, ఎండిన లేదా తాజా పండ్లతో అలంకరించండి. వాటిని వండడానికి ప్రత్యామ్నాయంగా, ఫ్రిజ్‌లో ఉంచి, ఓట్స్ రాత్రిపూట మెత్తబడేలా చేయండి.

పంప్కిన్ క్వినోవా పోరిడ్జ్..
క్వినోవా ఇన్సెస్ట్ంట్ రెసిపీ. గ్లూటెన్-ఫ్రీ కూడా . ఈ అల్పాహారం విటమిన్ A పంచ్‌ను ప్యాక్ చేస్తుంది. క్వినోవాలో ఒక భాగాన్ని ఏ రకమైన పాలలో అయినా రెండు భాగాలు తీసుకుని అందులో మీడియం-తక్కువ మంటపై 10 నిమిషాలు ఉడికించాలి. కొన్ని గుమ్మడికాయ, దాల్చినచెక్క చిటికెడు జాజికాయలో కలపాలి. అది ఉడికిన తర్వాత మీరు సర్వ్ చేసే ముందు బ్రౌన్ షుగర్, తరిగిన గింజలు లేదా తురిమిన కొబ్బరిని పైన వేయండి.

బెర్రీ యోగర్ట్ పర్ఫైట్స్..
సులభంగా ..ప్రయాణంలో భోజనం కోసం తాజా బెర్రీలు, గ్రానోలా చిలకరించడంతో అధిక-ప్రోటీన్ కలిగి ఉంటుంది. దీనిపై గ్రీక్ పెరుగును లేయర్ చేయండి.
Published by:Renuka Godugu
First published:

Tags: Breakfast, Children

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు