ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన స్క్విడ్ గేమ్ సిరీస్ (squid game) కొరియన్ కు చెందింది. దీంతో కొరియన్ బ్రాండ్స్(Korean brands) , దుస్తులు, వంట ఒక్కసారిగా ప్రఖ్యతి పొందాయి. అయితే, స్క్విడ్ గేమ్ తరహాలోనే ఉండే మరో 5 నవలలు ఉన్నాయి. అవి మీరు తప్పకుండా చదవాల్సిందే. ఆ వివరాలు తెలుసుకుందాం.
ది వెజిటేరియన్..
ఇది సౌత్ కొరియన్ మోడర్న్ నవల. వీటిలో ఇతర మనషులను అవమానించడం, కోరిక, ఇతరులను అర్థం చేసుకోవడం గురించి వివరించారు. మన తడబడుతున్న ప్రయత్నాల గురించిన నవల ఇది.
ది ఇంటర్ ప్రిటేటర్..
ఈ న్యూయార్క్ సిటీ కోర్టు వ్యవస్థ కోసం 29 ఏళ్ల కొరియన్ అమెరికన్ వ్యాఖ్యాత సుజీ పార్క్ గురించిన నవల ఇది. ఆమె తన కుటుంబ చరిత్ర గురించి ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ఇందులో ఆమె పాత్ర చిలిపిగా చూపించారు.
డ్రిఫ్టింగ్ హౌజ్..
యుద్ధానంతర కాలం నుంచి సమకాలీన కాలం వరకు కొరియా, యూనైటెడ్ స్టేట్స్ కు సంబంధించిన పుస్తకం. ఈ నవల సామూహిక గతంలో జరిగిన గందరగోళాన్ని, వారి ప్రస్తుత సవాళ్లతో పునరుద్దరించడానికి పోరాడుతున్న వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. ఇది కొరియాలో జీవితంలోని రాజకీయ, ఆర్థిక కష్టాలు, ప్రత్యేకంగా వలసల అనుభవం గురించి వివరించిన నవల.
ప్లీజ్ లుక్ ఆఫ్టర్ మామ్..
ఇది సాన్ యో అనే మహిళ గురించిన నవల. ఇందులో ఆమె పాత్ర తల్లి, భార్యగా ఆమె పడిన తపన, సర్దుకుపోవడం, త్యాగాలను వివరించారు.ఆమె సింగిల్ మామ్ గా రూపొందించారు. గతంలో హార్ట్ అటాక్ తో బాధపడి తదనానంతరం బిడ్డ భవిష్యత్తు కోసం కొరియాలోని గ్రామం నుంచి సీయోల్ కు ప్రయాణం చేయాల్సి వస్తుంది.
ఫాక్స్ గర్ల్..
కొరియా యుద్ధం తర్వాత విడుదల చేసిన కొరియన్ యువకుల సమూహం దిగ్భ్రాంతికరమైన కథను ఈ నవల చెబుతుంది. కథ మధ్యలో ఇద్దరు టీనేజ్ అమ్మాయిల పరిచయం ఉంటుంది. హ్యూన్ జిన్, సూకీ, లోబెట్టోతో ఒక టెంపరరీ కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.