మెరిసే జుట్టు ( Shiny hair) కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కొందరి జుట్టు (Hair Fall) విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. జెనిటిక్స్, వయస్సు, హార్మోనులు, పోషకాల లోపాలు, టాక్సిసిటీ, మెడికేషన్ వల్ల జుట్టు రాలుతూ ఉంటుంది. తీసుకునే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యకరంగా, మెరిసేలా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే,.జుట్టు పెరుగుదలపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా జెనెటిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. జుట్టు రాలడానికి ఇంకా అనేక అంశాలు కూడా ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యకరంగా పెరగడంతోపాటు, మెరుస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడే విటమిన్లు, అవి ఏ ఆహారంలో లభిస్తాయో తెలుసుకుందాం..
వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి దోహదపడే పోషకాలు
ప్రొటీన్స్
వెంట్రుకలు ప్రొటీన్ కెరాటిన్ తో తయారవుతాయని చెప్పుకున్నాం. శరీర ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి హార్వార్డ్ కొన్ని ఆహార పదార్థాలను సూచించింది. గుండె, బ్రెయిన్ చక్కగా పనిచేయడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని హార్వార్డ్ నిపుణులు చెబుతున్నారు.
ఒక గుడ్డు, అరకప్పు శనగలు లేదంటే చేరడు గింజల్లో ఆరు గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఒక ముక్క చికెన్ లేదా ఒక చేప ముక్కలో 30 గ్రాముల ప్రోటీన్స్ తో పాటు అమినో ఆసిడ్లు లభిస్తాయి. పౌల్ట్రీ ఉత్పత్తులతోపాటుమాంసం, చేపలు, శనగలు, పప్పు, ఓట్స్, బీన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని హార్వార్డ్ నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ల సూచనల మేరకు ప్రోటీన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చని వారు సూచించారు.
విటమిన్ బి
వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి, మెరవడానికి విటమిన్ బి దోహదపడుతుంది. విటమిన్ బిలో బయోటిన్, నియాసిన్ ఉంటాయి. జుట్టు రాలకుండా బయోటిన్ సప్లిమెంట్లు కూడా ఉపయోగపడతాయని హార్వార్డ్ హెల్త్ నిపుణులు తెలిపారు. కోడి గుడ్డులో ఇవి పుష్కలంగా లభిస్తాయి.
అయితే కొందరు సగం ఉడికించిన గుడ్డు తింటూ ఉంటారు. అలా చేయవద్దని పూర్తిగా ఉడికించిన గుడ్డు మాత్రమే తినాలని హార్వార్డ్ నిపుణులు తెలిపారు. కోడి గుడ్లు, మాసం, విత్తనాలు, గింజలు, తీపి బంగాళాదుంపలు, బ్రోకోలిలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యం పెరుగుతుందని హార్వార్డ్ నిపుణులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : ఆహారంలో మసాలాలు ఎక్కువ వాడితే రాత్రిళ్లు నిద్ర సరిగా రాదా? నిపుణులు ఏమంటున్నారు?
విటమిన్ డి
ఆరోగ్యకరమైన జుట్టుకు సూర్యరశ్మి దోహదపడుతుంది. జుట్టులోని ఫోలీసెల్స్ చక్కగా పనిచేసేందుకు విటమిన్ డి చాలా ముఖ్యం. టెక్నికల్ గా విటమిన్ డి అనేది విటమిన్ కాదని హార్వార్డ్ హెల్త్ అభిప్రాయపడింది. శరీరంలోనే విటమిన్ డి తయారవుతుంది.
కేవలం చేపల్లోనే కాకుండాగుడ్డు సొనలో కూడా విటమిన్ డిపుష్కలంగా లభిస్తుంది.సూర్యరశ్మి ద్వారా శరీరంలోకి విటమిన్ డి3 చేరుతుంది. అది తరవాత లివర్, కిడ్నీలకు చేరడం ద్వారా విటమిన్ డి గా రూపాంతరం చెందుతుంది. పుట్టగొడుగులు, కాడ్ లివర్ ఆయిల్లో సైతం విటమిన్ డి పుష్కలంగా లభిస్తుందని హార్వార్డ్ హెల్త్ స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hair fall, Hair Loss, Hair problem tips, Health benefits, Health food