THERE IS A POLAR BEAR IN THIS PICTURE DO YOU HAVE THE ABILITY TO FIND IT RNK
Optical illusion: ఈ చిత్రంలో ఒక ధృవపు ఎలుగుబంటి ఉంది.. దాన్ని కనుక్కునే సత్తా మీలో ఉందా?
Optical Illusion
Optical illusion | మన మెదడు ఒకేసారి చాలా విషయాల గురించి ఆలోచిస్తున్నందుకు మనం ఇంతకు ముందెన్నడూ చూడని చిత్రాన్ని చూసిన వెంటనే మన సబ్కాన్షియస్ మైండ్‌లో పక్కదారి పట్టవచ్చు.
Optical illusion: మనం చూడగలిగే విషయాలు ఎక్కువ శాతం మనకు ఇంకేదో తెలుసుకునేలా చేస్తాయి. ఒక్కోసారి చూసినప్పుడు ఇంకేదో అనిపించవచ్చు. ఒక్కసారి చూస్తే అది వేరేలా ఉంటుంది. ఇది వ్యక్తులు, వస్తువులు, ఎదురయ్యే సమస్యలు... ఇంకా అనేక విషయాలకు వర్తిస్తుంది. దీనినే ఆప్టికల్ ఇల్యూషన్ (Optical illusion) అంటారు. దూరం నుండి చూస్తే మన మెదడుకు (Brain) తెలిసిన ఆ చిత్రం సమీపంలో ఉన్నప్పుడు మరొక చిత్రాన్ని చూపుతుంది.
మనల్ని ఇలా అనిపించేలా చేసే కొన్ని అంశాలు ఉన్నాయి. మన మెదడు నిరంతరం అనేక విషయాల గురించి ఒకేసారి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి, మనం ఇంతకు ముందెన్నడూ చూడనిది మన సబ్కాన్షియస్ మైండ్‌లో పక్కదారి పట్టవచ్చు. కాబట్టి మన మెదడు డెడ్ టైమ్, రియల్ టైమ్‌తో కొత్త ముగింపునకు పనిచేస్తుంది. ఈ చిత్రంలో కూడా ఆ ఆప్టికల్ ఇల్యూజన్ దాగి ఉంది. బాగా పరిశీలించి, అందులో ధృవపు ఎలుగుబంటి చిత్రాన్ని మీరు చూడగలరేమో చూడండి. దీనితో మేము మీ గురించి కొన్ని విషయాలు వివరంగా చెబుతాం..
ఆప్టికల్ ఇల్యూషన్..
ఇంటర్నెట్లో ఇలాంటి అనేక సూక్ష్మమైన ఆప్టికల్ ఇల్యూజన్ దాగి ఉన్నాయి. ఇక నెటిజన్లు ఇలాంటి పజిల్స్‌ని సాల్వ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందుకే ఈ రకమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ చాలా వైరల్ అవుతుంది.
ఈ చిత్రంలో చాలా మంది స్నోమెన్లు ఉన్నారు. నేటి ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్లో మీరు ఈ చిత్రంలో దాచిన ధ్రువపు ఎలుగుబంటి (పాండా)ని కనుగొనాలి. ఈ ప్రసిద్ధ ఆప్టికల్ ఇల్యూజన్ హంగేరియన్ కళాకారుడు గెర్కెలి తుడాస్ రూపొందించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని చాలా మంది ఉపయోగిస్తున్నారు.
ఇంటర్నెట్లో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది భిన్నంగా వ్యాఖ్యానించారు. అందులో ఈ ధృవపు ఎలుగుబంటి చిత్రం కనిపించలేదని పలువురు వ్యాఖ్యానించారు. వారిలో ఒకరు, "నాకు ఒక డ్రాగన్, 2 స్లిప్పర్లు ,పాప్ డబ్బా దొరికాయి. కానీ ధృవపు ఎలుగుబంటి చిత్రాన్ని కనుగొనలేకపోయాను. కానీ, బాగానే ట్రై చేశాను" అని వ్యాఖ్యానించాడు. మరొకరు, "నేను 15 నిమిషాలపాటు వెతికాను కానీ, కనుగొనలేకపోయాను." అన్నాడు
ఇలా చాలా మంది ధృవపు ఎలుగుబంటి చిత్రం ఈ చిత్రంలో కనిపించడం లేదని అంటున్నారు. వారిలో కొందరు దాని చిత్రాన్ని కనుగొన్నారు ,దాన్ని షేర్ చేశారు.
ఈ చిత్రంలో మంచు ఎలుగుబంటి చిత్రం దాగి ఉంది. దీన్ని చూడటానికి చిత్రంలో కుడివైపు వెతకండి. మరింత సులభంగా తెలుసుకోవడానికి, ఆకుపచ్చ ,తెలుపు చెక్కర్స్ స్కార్ఫ్ ధరించిన స్నోమాన్ దగ్గర చూడండి. కాకపోతే, ముక్కులో క్యారెట్లు లేని స్నోమాన్ కోసం చూడండి. వీటి సహాయంతో సులభంగా గుర్తించవచ్చు. అంటే పజిల్ని కనిపెట్టిన వారి మెదళ్లు మెరుగ్గా పనిచేస్తాయని అర్థం.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.