Weight Health Tips: బరువు తగ్గాలంటే ఇలా... పెరగాలంటే అలా నిద్రపోండి

Sleep Health Tips: మనమంతా కాలేజీ రోజుల వరకూ ఫిట్‌గా ఉంటాం. ఆ తర్వాత నుంచి బరువు పెరగడమో, తగ్గడమో అవుతుంటాం. దానికి కచ్చితమైన పరిష్కారాన్ని తాజాగా కనిపెట్టారు డాక్టర్లు.

news18-telugu
Updated: September 7, 2020, 1:03 PM IST
Weight Health Tips: బరువు తగ్గాలంటే ఇలా... పెరగాలంటే అలా నిద్రపోండి
బరువు తగ్గాలంటే ఇలా... పెరగాలంటే అలా నిద్రపోండి
  • Share this:
Weight Health Tips: చాలా మంది బరువు పెరగడం ఈజీ అనుకుంటారు. అధిక బరువు ఉన్నవారేమో... బరువు తగ్గడం కష్టమనుకుంటారు. ఈ రెండూ కూడా అంత కష్టమూ కాదు... అంత ఈజీ కూడా కాదు. సన్నగా ఉన్నవారు ఏదో ఒకటి తినేస్తే బరువు పెరిగిపోరు. అలాగే... అధిక బరువు ఉన్నవారు... తినడం మానేస్తే బరువు తగ్గిపోరు. అసలీ బరువు సమస్యకు సరైన పరీష్కారం నిద్రే అని తేల్చారు పరిశోధకులు. మీరు గనుక బరువు తగ్గాలని వంద శాతం పట్టుదలతో అనుకుంటే... మీరు మూడు పనులు చెయ్యాలి. 1. సరైన ఆహారం (కొవ్వు లేనిది) తీసుకోవాలి. 2. క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్, వర్కవుట్ వంటివి చెయ్యాలి. 3. టైముకి బాగా నిద్రపోవాలి. ఈ మూడోది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అదే నిజం. బాగా నిద్రపోతేనే బరువు తగ్గగలరని పరిశోధనల్లో తేల్చారు.

పెద్దవాళ్లు రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. కానీ... బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది సరిగా నిద్రపోవట్లేదు. నిద్రను తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ... ఆ నిద్ర తగ్గే కొద్దీ... అధిక బరువు, ఇతర అనారోగ్యాలు మొదలవుతాయనే విషయాన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదు. నిద్ర తగ్గుతున్న కొద్దీ బాడీలో కొవ్వు కరగడం తగ్గుతూ ఉంటుంది. అంటే... కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. అదే బరువు పెరగడానికి కారణమవుతుంది. నిద్రపోయినప్పుడు మన బాడీ బాగా హీట్ అవుతుంది. అది కొవ్వును కరిగిస్తుంది. కొవ్వు తగ్గితే సరిపోదు... బాడీ ఫిట్‌గా ఉండాలి. ఎనర్జీతో ఉండాలి, యాక్టివ్‌గా కనిపించాలి. ఇలా జరగాలంటే బాగా నిద్రపోవాలి. మీరు సరిగా నిద్రపోకపోతే... కొవ్వు పెరిగితే... ఆ తర్వాత ఆ బరువంతా కండరాలపై పడుతుంది. నానాటికీ అవి బలహీనం అవుతాయి. సో... సింపుల్ చిట్కా... నిద్రపోండి.

తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకొని... రోజూ రాత్రివేళ 5గంటల 50 నిమిషాలు మాత్రమే నిద్రపోతే... అలాంటి వారికి కొవ్వు పెద్దగా కరగట్లేదు. అంటే సన్నగా ఉండేవాళ్లు... ఇలా చేస్తే... బరువు పెరగగలరు. అలాగే... ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకొని... రోజూ 8 గంటల 50 నిమిషాలు నిద్రపోతే... ఎక్కువ కొవ్వు కరుగుతుంది. అంటే... బరువు ఎక్కువగా ఉండేవారు... ఎక్కువ సేపు నిద్రపోవాలి.

నిద్రకీ, బరువుకీ సంబంధమేంటి?:
మంచి ప్రశ్న. మనం నిద్రపోయినప్పుడు మన బాడీలో గ్రెలిన్, లెప్టిన్ అనే రెండు ఆకలి హార్మోన్లు ప్రభావితం అవుతాయి. లెప్టిన్ ఆకలిని తగ్గిస్తుంది. గ్రెలిన్ ఆకలిని పెంచుతుంది. తక్కువ సేపు నిద్రపోయే వారికి గ్రెలిన్ ఎక్కువగా ఉత్పత్తవుతోంది. అందువల్ల వారికి ఆకలి పెరిగి... వారు ఎక్కువ తింటారు. బరువు పెరుగుతారు. అలాగే... ఎక్కువ సేపు నిద్రపోయేవారికి... లెప్టిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆకలి పెద్దగా వెయ్యదు. అందువల్ల వారు ఎక్కువ తినరు. ఈ విషయాన్ని ఇదివరకు ఎన్నో పరిశోధనలు తేల్చాయి. తాజాగా... 1,024 మందిపై చేసిన మరో అధ్యయనంలోనూ అదే తేలింది.

మరో విషయం... రోజూ 6 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోయే వారి బ్రెయిన్ బాగా పనిచేస్తూ... వారు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారని గ్రహించాలి. ఐతే... ఆల్రెడీ ఫిట్‌గా ఉంటూ... కొడితే గోడలు బద్ధలయ్యేలా ఉంటారే... అలాంటి వాళ్లు రోజూ 4 గంటలు నిద్రపోయినా చాలట. ఏది ఏమైనా నిద్రను నిర్లక్ష్యం చెయ్యవద్దంటున్నారు పరిశోధకులు. అందువల్ల మీరు రోజువారీ ఏ పనులు మర్చిపోయినా... నిద్రపోవడం మాత్రం మర్చిపోకండే...
Published by: Krishna Kumar N
First published: September 7, 2020, 1:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading