Home /News /life-style /

THERE IS A HUGE RISK CHANCES OF INFECTIONS WITH UNPROTECTED SEX AND THESE ARE THE SYMPTOMS AND TREATMENT DETAILS FOR THAT PRV GH

Sexual health: సురక్షితం కాని సెక్స్‌తో ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం.. వీటి లక్షణాలు, చికిత్స వివరాలివే..

మకానాను మీరు చాలా దుకాణాల్లో చూసి ఉండవచ్చు. తెల్లగా ఉంటుంది. ఈ మకానా పురుషులకు చాలా మంచిది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, మినరల్స్, కొవ్వులు, ఫాస్పరస్ మొదలైనవి పురుషులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పురుషులు దీన్ని రోజూ తీసుకుంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి పురుషుల్లో శారీరక బలహీనత తొలగిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

మకానాను మీరు చాలా దుకాణాల్లో చూసి ఉండవచ్చు. తెల్లగా ఉంటుంది. ఈ మకానా పురుషులకు చాలా మంచిది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, మినరల్స్, కొవ్వులు, ఫాస్పరస్ మొదలైనవి పురుషులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పురుషులు దీన్ని రోజూ తీసుకుంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి పురుషుల్లో శారీరక బలహీనత తొలగిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

చాలామంది తొందరపడి జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌ చేస్తారు. దీనివల్ల సిఫిలిస్, క్లామిడియా, గనేరియా లాంటి సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్‌ఫెక్షన్‌లు (sexually transmitted infections) తలెత్తే ప్రమాదం ఉంది

యక్త వయసు నుంచే కామ కోరికలు (sexual desires) అదుపు చేసుకోలేక చాలామంది సతమతమవుతుంటారు. శృంగార జీవితాన్ని (sexual life) ఆస్వాదించాలనుకుంటారు. ఇలాంటి సమయంలో తొందరపడి జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌ చేస్తారు. దీనివల్ల సిఫిలిస్, క్లామిడియా, గనేరియా లాంటి సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్‌ఫెక్షన్‌లు (sexually transmitted infections) తలెత్తే ప్రమాదం ఉంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు (symptoms) బయటకు కనిపించవు కాబట్టి చాలామంది వీటి గురించి పట్టించుకోరు. అయితే వీటిని ఇలా వదిలేయడం వల్ల అవి పెరిగి పెద్దయి పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. అందుకే వీటి పట్ల సరైన అవగాహన తప్పనిసరి అంటున్నారు సెక్సాలజిస్టులు. తాజాగా వారు లైంగిక సంక్రమణ ఇన్‌ఫెక్షన్‌లు, వాటి లక్షణాలు, నిర్మూలన గురించి విలువైన సూచనలు అందించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

లైంగిక సంక్రమణ ఇన్‌ఫెక్షన్‌లు (STI) ఉన్న చాలా మందికి లక్షణాలు కనిపించవు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ పరీక్ష చేయించుకోవడం శ్రేయస్కరం. మీకు ఎస్‌టీఐ ఉందని భావిస్తే, వీలైనంత త్వరగా టెస్ట్ చేయించుకుని చికిత్స పొందడం మంచిది. యోని, అంగ, ఓరల్ సెక్స్‌ (Oral sex)తో సహా లైంగిక సంపర్కం ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి ఎస్‌టీఐ సంక్రమించవచ్చు. ఎస్‌టీఐలు పురుషులు, స్త్రీల మధ్య... స్త్రీల నుంచి స్త్రీలకు... పురుషుల నుంచి పురుషులకు వ్యాపించవచ్చు. అయితే అనేక ఎస్‌టీఐలను (STI) కేవలం యాంటీబయాటిక్స్‌తోనే నయం చేయవచ్చు. హెచ్‌ఐవీ వంటి కొన్నింటికి చికిత్స లేదు, కానీ అవి మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి చికిత్స చేయవచ్చు. ఇన్ఫెక్షన్ (Infection) ఉందా లేదా అనేది కంటికి కనిపించదు కాబట్టి మీరు అసురక్షిత సెక్స్‌లో పాల్గొన్నట్టయితే వెంటనే చెక్-అప్ చేయించుకోవడం ముఖ్యం.

* వ్యాధి లక్షణాలు

క్లామిడియాతో (chlamydia) బాధపడుతున్న చాలా మంది మహిళల్లో ఎస్‌టీఐ లక్షణాలను కనిపించవు. క్లామిడియాకి చికిత్స చేయకుండా వదిలేస్తే.. సంతానలేమి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. గనేరియా (Gonorrhoeic) కూడా సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. 50% మంది స్త్రీలు, 10% మంది పురుషులలో గనేరియా వచ్చినప్పటికీ లక్షణాలు బయటికి కనిపించవు. చికిత్స (Treatment) చేయకుండా  వదిలేస్తే, ఎస్‌టీఐ (STI)లు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మీకు కింద జాబితాలో పేర్కొన్న లక్షణాలు ఏవైనా ఉంటే, పరీక్ష చేయించుకోండి.

మూత్ర విసర్జన చేసినప్పుడు నొప్పి (Pain), జననేంద్రియాల చుట్టూ దురద, మంట లేదా జలదరింపు, మర్మాంగాలు లేదా మలద్వారం చుట్టూ బొబ్బలు, పుండ్లు, మచ్చలు, గడ్డలు, మీ లోదుస్తులలో నల్లటి పొడి లేదా చిన్న తెల్లని చుక్కలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే.

ముఖ్యంగా మహిళల్లో అయితే వైట్ లేదా గ్రీన్ వజైనల్ డిశ్చార్జ్‌, దుర్వాసనతో వచ్చే డిశ్చార్జ్‌, పీరియడ్స్ మధ్య లేదా సెక్స్ తర్వాత రక్తస్రావం, సెక్స్ సమయంలో నొప్పి, దిగువ పొత్తికడుపు నొప్పి.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. పురుషుల్లో పురుషాంగం నుంచి డిశ్చార్జ్‌, మూత్రనాళంలో మంట, దురద లక్షణాలు కనిపిస్తాయి.

అయితే ఈ లక్షణాలు (Symptoms) కనిపించగానే మీకు ఎస్‌టీఐ ఉందని కాదు కానీ వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. అలాగే ఈ లక్షణాలకు కారణమేమిటో కనుగొని చికిత్స పొందవచ్చు. వైద్యుని సంప్రదించడం ముఖ్యం ఎందుకంటే సెక్స్ చేయకపోయినా ఒక్కోసారి థ్రష్ అనే ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి హాని కాని ఇన్ఫెక్షన్లు కూడా పుండ్లు పడటం, దురద, డిశ్చార్జ్‌ తదితర ఎస్‌టీఐ వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

* ఎస్‌టీఐలకు ఎక్కడ పరీక్షలు చేయించుకోవచ్చు?

సెక్సువల్ హెల్త్ క్లినిక్‌లు, కొన్ని కమ్యూనిటీ కాంట్రాసెప్టివ్ క్లినిక్‌లలో టెస్ట్ చేయించుకోవచ్చు. క్లామిడియా నివారణకు కొన్ని దుకాణాల్లో మెడిసిన్ కొనుగోలు చేయవచ్చు.

* సురక్షితమైన సెక్స్ చేయండి

ఎస్‌టీఐ బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ కండోమ్‌లను ఉపయోగించండి. ప్యాకెట్‌పై విశ్వసనీయ ట్రేడ్ మార్క్ గుర్తు ఉన్న కండోమ్‌లను కొనుగోలు చేయండి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Health care, Sexual Wellness

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు