Rainy season: వర్షాకాలంలో బ్యాక్టిరియా ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఈ ఫుడ్‌ను అస్సలు తినకూడదు!

వర్షాకాలంలో కొన్ని రకాల ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని చెమట బయటకు పోదు. అందుకే, వేడిని ఇచ్చే ఫుడ్‌ను కొంత మోతాదు పెంచుకోవచ్చు.

వర్షాకాలంలో కొన్ని రకాల ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని చెమట బయటకు పోదు. అందుకే, వేడిని ఇచ్చే ఫుడ్‌ను కొంత మోతాదు పెంచుకోవచ్చు.

  • Share this:
వర్షాకాలంలో ఏ ఫడ్‌ తింటే మంచిదో తెలుసా? అయితే, మన పెద్దవారు కూడా ఏం చెప్పారో తెలుసుకుందాం.సాధారణంగా వర్షం Rain పడుతుంటే అందరికీ వేడివేడిగా ఏ మొక్కజొన్న పొత్తు లేదా బజ్జీలు లేదా పకోడిలు తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ, ఈ సీజన్‌లోనే ఇన్ఫెక్షన్‌లు ఎక్కువగా సోకే కాలం. ఈ కాలంలో ఏ ఆహారం ప్రత్యేకంగా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో ఫుడ్‌పై ఏమాత్రమ అలసత్వం వహించినా.. జలుబు,దగ్గు ఇతర వ్యాధుల బారినపడాల్సి వస్తుంది. ఈ కాలంలో ఇమ్యూనిటీ లెవల్‌ Immuity కూడా తగ్గిపోతుంది.మన రోజూవారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఫుడ్‌ మన డైట్‌లో చేర్చుకోవాలి. వర్షాకాలంలో సీజనల్‌ను బేస్‌ చేసుకుని ఫుడ్‌ తీసుకోవాలి. బాడీ మెటబాలిజం వేసవి కాలం కంటే ఈ కాలంలో పెరుగుతుంది. వాటర్‌ వెజిటేబుల్స్‌ కాకుండా ఇతర ఆహార పదార్థాలు తినాలి.

ఆకుకూరాలు Leafy vegetables కూడా కాస్త తగ్గించాలి. ఎందుకంటే బయట వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కాబట్టి. వర్షాకాలంలో బ్యాక్టిరియా బయటి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. దీంతో వాటర్, ఫుడ్‌ కంటామినేట్‌ అయిపోతుంది. అందుకే రోడ్‌పైన విక్రయించే తినుబం«ఢారాలకు దూరంగా ఉండాలి. నీరు నిల్వ ఏర్పడుతుంది. అందుకే తాగునీరు కలుషితం అవుతుంది. కాయగూరలు, ఆకుకూరలు గోరు వెచ్చటి నీటిలో కడిగి వండుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో కాకరకాయ తీసుకోవాలి.

ఈ సీజన్‌లో మగవారు తమ చర్మసంరక్షణపై తీసుకోవాల్సిన బెస్ట్‌ టిప్స్‌!


కూరల్లో పసుపు Turmeric కచ్ఛితంగా వేసుకోవాలి. కేవలం వర్షాకాలంలోనే దొరికే నేరేడు పండ్ల Jamun fruit ను తప్పకుండా తినాలి. దీనిలో సమృద్ధిగా దొరికే విటమిన్‌ సీ.. ఈ సీజన్‌లో మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. కాస్త స్టార్చీ ఉన్న పండ్లను తీసుకోవచ్చు. ఈ సీజన్‌లో మెటబాలిజం పెరుగుతుంది కాబట్టి డీప్‌ ప్రైడ్‌ ఐటెమ్స్‌ తినవచ్చు. అదికూడా కేవలం ఇంట్లో తయారు చేసుకుంటే మేలు. ఈ సీజన్‌లో నీరు కూడా 2.5–3 లీటర్స్‌ నీరు తీసుకోవాలి. నువ్వులు కూడా కాస్త ఎక్కువగా తీసుకోవచ్చు.

ముఖ్యమైన విషయం ఏంటంటే.. బయట ఫుడ్‌ మానేయాలి. ఓట్స్‌ తరచూ తీసుకోవాలి. ఫ్రీజ్‌లో నిల్వ ఉంచిన ఫుడ్‌ తీసుకోవడం మంచిది కాదు. ఎప్పటికప్పుడు తాజాగా వండుకున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
Published by:Renuka Godugu
First published: