Health Tips: మోసాంబి రసంతో ఎన్నో ప్రయోజనాలు.. కళ్ల కింద వలయాలు, మొటిమలకు శాశ్వత పరిష్కారం ఇలా..

మోసాంబి (Image:youtube)

Health Tips: మోసంబి లో అధికంగా ఉండే నిమ్మకాయ గ్లూకోసైడ్ అయిన ఫ్లెవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్, బాక్టీరియల్ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణలను కలిగి ఉంది. కాబట్టి మోసాంబి జ్యూస్ తాగితే కళ్ల కింద వలయాలు, మొటిమలు తగ్గడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

  • Share this:
    కళ్ల చుట్టూ వలయాలతో చాలామంది ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. నిద్రలేమి వలనో, ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల.. పిల్లలకైతే ఎక్కువ సేపు మేల్కొని చదవడం వల్ల, ఎండలో బాగా తిరగడం వల్ల.. ఇలా రకరకాల కారణాలతో పిల్లల నుంచి పెద్దవాళ్లవరకూ ఉండే సమస్య డార్క్ సర్కిల్స్. నీరు తక్కువగా తాగే వారిలో, ఆస్తమా ఉన్నవారిలో, విటమిన్ సి లోపం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే కళ్లు చుట్టూ వలయాలు మరియు మొటిమలు పోవాలంటే మోసాంబి రసం ఎంత గానో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మోసంబి లో అధికంగా ఉండే నిమ్మకాయ గ్లూకోసైడ్ అయిన ఫ్లెవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్, బాక్టీరియల్ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణలను కలిగి ఉంది. కాబట్టి మోసాంబి జ్యూస్ తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అనేక కంటి ఇంఫెక్షన్ ను మరియు గ్లాకోమా ,కంటి శుక్లమ్ వంటి కంటి సమస్యలను నివారిస్తుంది.

    అందమైన చర్మం పొందడానికి మోసంబి జ్యూస్ సహాయపడుతుంది. మోసంబి చర్మాన్ని మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. చుండ్రు మరియు జుట్టు రాలడం ఉన్నవారు రోజూ మోసంబి రసం తాగితే, ఈ సమస్యలను త్వరగా వదిలించుకోవచ్చు. వేసవి కాలంలో ప్రతీ ఒక్కరు ఎక్కువగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. దాంతో చర్మంపై ఆ ఎఫెక్ట్ కనపడుతుంది. చర్మ సమస్యలు కూడా ఎక్కువగా వేసవి కాలంలోనే వస్తుంటాయి. చర్మాన్ని వివిధ రకాల సమస్యల నుంచి కాపాడుకోవాలంటే మోసాంబి రసం ఉపయోగపడుతుంది. ఫేస్ వాష్, క్రీమ్ సహా అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ లో మోసాంబి రసాన్ని వాడుతారు. విటమిన్ సీ కలిగిన సిట్రస్ పండ్లు ఎక్కువగా ఆరోగ్యానికి మేలు చేకూర్చడంతో పాటు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. వీటిని చర్మానికి అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందొచ్చు. రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి.

    చర్మాన్ని పూర్తిగా బిగుతుగా చేయడంతో పాటు ముఖం ప్రకాశవంతంగా మెరసే విధంగా తోడ్పడుతుంది. అయితే దానిని ఈ విధంగా వాడితే ఆరోగ్యకరంగా ఉంటారు. ప్రస్తుతం వర్షాకాలం సమయంలో చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో కళ్ల చుట్టు నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఈ సమస్యతో బాధపడే వారు మోసాంబి రసం అక్కడ అప్లై చేసినట్లయితే ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు చర్మంపై మొటిమలను కూడా దీనిని అప్లై చేస్తే పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇంకా రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. మోసాంబి రసం చర్మంలో బ్లీచింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. మొసాంబి చర్మంపై మచ్చలు, వర్ణద్రవ్యం తొలగించడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
    Published by:Veera Babu
    First published: