హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Meditation: మెడిటేషన్‌ ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి?.. ఇలా చేస్తే ఈజీగా మెడిటేషన్ చేయొచ్చు..

Meditation: మెడిటేషన్‌ ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి?.. ఇలా చేస్తే ఈజీగా మెడిటేషన్ చేయొచ్చు..

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ధ్యానంలో మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ వంటి రకరకాల మెడిటేషన్లు ఉన్నాయి. వీటిలో ఒక్క మెడిటేషన్ ద్వారా ఒక్కో రకం ప్రయోజనాలు పొందవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ధ్యానం (Meditation) అనేది ఒక వ్యక్తి మానసిక స్పష్టత, మానసిక ప్రశాంత కోసం చేసే ఒక మెంటల్ ప్రాక్టీస్. ధ్యానంలో మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ వంటి రకరకాల మెడిటేషన్లు ఉన్నాయి. వీటిలో ఒక్క మెడిటేషన్ ద్వారా ఒక్కో రకం ప్రయోజనాలు పొందవచ్చు. కొందరు వ్యక్తులు ఒత్తిడి (Stress), ఆందోళనను తగ్గించడానికి, ఏకాగ్రత (Concentration)ను పెంచుకోవడానికి ధ్యానం చేస్తారు. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయడం తప్పనిసరి. అయితే కొత్తగా మెడిటేషన్ చేసేవారు పాటించాల్సిన టిప్స్ (Beginners Guide To Meditation) ఏవో తెలుసుకుందాం.

* ఎలా ప్రారంభించాలి?

కొత్తగా మెడిటేషన్ చేసేవారు గంటల కొద్దీ ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. రోజూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తూ మెడిటేషన్‌కి మీ బాడీ, మైండ్ అలవాటు పడేంత వరకు ఓపిక పట్టాలి. అలవాటయిన తర్వాత మెడిటేషన్ సమయాన్ని పెంచవచ్చు. అలానే డైలీ ఒకే టైమ్‌లో మెడిటేషన్ చేసేలా ప్లాన్ చేసుకుంటే ఇది సులభంగా ఒక అలవాటుగా మారుతుంది.

డైలీ రొటీన్ ప్లాన్ చేసుకునే టైమ్‌లో మీ మెడిటేషన్‌కి ఎలాంటి అంతరాయాలు కలగకుండా చూసుకోవడం ముఖ్యం. మంచి ఆత్మవిశ్వాసం, పాజిటివిటీతో రోజున ప్రారంభించాలనుకునేవారు మార్నింగ్ మెడిటేషన్ చేస్తే మంచిది. స్ట్రెస్ పోగొట్టుకోవాలనుకునేవారు ఈవినింగ్ సమయంలో ధ్యానం చేయవచ్చు.

* రోజూ ఒకే చోట ధ్యానం చేయాలి

రోజూ ఒకే రూమ్‌లో ఒకే చోట ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి కష్టం లేకుండా మైండ్ అండ్ బాడీ మెడిటేషన్‌కి ఈజీగా సిద్ధమవుతాయి. అప్పుడు మీరు ధ్యాన స్థితిలోకి ప్రవేశించడం సులువు అవుతుంది. అలాగే కొత్తగా మెడిటేషన్ చేసేవారు మనసుకు ప్రశాంతంగా అనిపించే ప్లేస్ ఎంచుకోవాలి. అలానే చిరాకు పుట్టించని దుస్తులు ధరించాలి. మరీ వదులుగా ఉండే లేదా మరీ టైట్‌గా ఉండే దుస్తులు కాకుండా సరిగ్గా సరిపోయే బట్టలు ధరించడం ద్వారా మెడిటేషన్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలవు.

* భంగిమ

మెడిటేషన్ అనగానే యోగా మ్యాట్‌పై లెగ్స్ క్రాస్ చేసుకుని కూర్చోవడం లేదా పద్మాసనంలో ఉండాలని చాలామంది అనుకుంటారు. నిజానికి అలా కూర్చోవాల్సిన అవసరం లేదు. మీకు అనుకూలంగా ఉండే భంగిమలో కూర్చుని మెడిటేషన్ చేయవచ్చు. ధ్యానం సమయంలో మీ వీపును నిటారుగా ఉంచడం చాలా ముఖ్యం. అప్పుడే శ్వాస ఎక్కువగా తీసుకోవడం సాధ్యమవుతుంది. మెంటల్ అలర్ట్‌నెస్ కూడా పెరుగుతుంది.

* నార్మల్ బ్రీతింగ్

ధ్యానం సమయంలో శ్వాసపై ఎక్కువగా శ్రద్ధ పెట్టకూడదు. సాధారణ సమయంలో శ్వాసపై కాన్సన్ట్రేషన్ ఎలా చేయమో ధ్యానం చేసేటప్పుడు కూడా అలాగే ఉండాలి. లేదంటే చాలా స్లోగా శ్వాస తీసుకుంటూ మనసుని, శరీరాన్ని కామ్‌ చేయవచ్చు. శ్వాస ఎలా తీసుకున్నా అది మీ మనసును, మీ బాడీని రిలాక్స్ చేసేలాగానే ఉండాలి.

30 ఏళ్ల తర్వాత బిడ్డ పుట్టాలని ప్లాన్ చేసుకునే దంపతులకు నిపుణుల సలహా..!

PCOS problem: గుమ్మడి గింజల నుంచి అవిసెగింజల వరకు... పీసీఓఎస్ సమస్యకు ఉపకరించే విత్తనాల జాబితా..!

* ప్రశాంతత ముఖ్యం

బాగా ఒత్తిడి కనిగించిన పనుల తర్వాత వెంటనే కూర్చొని మెడిటేషన్ చేయాలనుకోవడం మంచిది కాదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. అందుకే కాస్త మనసు కుదుటపడ్డాక మెడిటేషన్ చేయాలి.

* ఓపిక అవసరం

ధ్యానం మొదట కష్టంగా ఉంటుంది. మెడిటేషన్‌లో ప్రోగ్రెస్ రావడానికి కూడా చాలా టైమ్‌ పడుతుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని చాలా ఓపికతో ఉండాలి.

First published:

Tags: Malvika sharma lifestyle

ఉత్తమ కథలు