Home /News /life-style /

THE VAST MAJORITY OF INDIANS STILL HAVE ARRANGED MARRIAGES AND MARRYING WITHIN YOUR CASTE REMAINS AN ESSENTIAL FEATURE OF MARRIAGE IN INDIA GH SSR

Love Marriage in India: భారత్‌లో ప్రేమ వివాహాల పరిస్థితి ఏంటి? ఎక్కువమంది ఎటువైపు మొగ్గు చూపుతున్నారు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో సినిమాల ప్రభావం చాలా ఎక్కువ. ముఖ్యంగా యువకులను ప్రేమ, రొమాన్స్ లాంటి అంశాలు బాగా ప్రభావితం చేస్తున్నాయి. ఇది నిజమే అయినప్పటికీ ఇప్పటికీ చాలా వివాహాలు పెద్దలు కుదిర్చినవే కావడం గమనార్హం.

భారత్‌లో చాలా మంది యువతీ యువకులు ప్రేమ విషయంలో ఎన్నో రహస్యాలను దాస్తుంటారు. తమ ప్రేమను పెద్దవాళ్లు ఒప్పుకుంటారో లేదోనని వారిలో వారే మదనపడుతుంటారు. ఈ అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ రుక్మిణి.ఎస్ కొంత డేటా సేకరించారు. భారత్‌లో ప్రేమ పరంగా అసాధారణమైన దృక్పథాన్ని ఆమె వెలికితీశారు. ఆ వివరాలను బీబీసీ వార్తాసంస్థ తాజాగా ప్రచురించింది. భారత్‌లో ప్రేమ పెళ్లిళ్లపై రుక్మిణి దృష్టి సారించిన విషయాలు ఏవో క్లుప్తంగా తెలుసుకుందాం.

భారత్‌లో సినిమాల ప్రభావం చాలా ఎక్కువ. ముఖ్యంగా యువకులను ప్రేమ, రొమాన్స్ లాంటి అంశాలు బాగా ప్రభావితం చేస్తున్నాయి. ఇది నిజమే అయినప్పటికీ ఇప్పటికీ చాలా వివాహాలు పెద్దలు కుదిర్చినవే కావడం గమనార్హం. 2018లో లక్షా 60 వేల కుటుంబాలపై సర్వే చేయగా.. ఇందులో 93 శాతం వివాహితులు తమది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని చెప్పారు. కేవలం 3 శాతం మంది మాత్రమే ప్రేమ వివాహం చేసుకున్నారు. 2 శాతం మంది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని పేర్కొన్నారు. ఈ డేటా ప్రకారం భారత్‌లో చాలామంది పెద్దలు కుదిర్చిన వివాహాలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Aunty: అల్లుడి వరసయ్యే 18 ఏళ్ల కుర్రాడితో అఫైర్ ఈ అత్తను ఎక్కడ కనిపించేలా చేసిందంటే..

కాలక్రమేణా ఈ విషయంలో కొంత మార్పు వచ్చినప్పటికీ ఇంకా వివాహంలో పెద్దల ఇష్టాయిష్టాలే ఎక్కువగా ఉన్నాయి. రెండు పదుల వయసులో పెళ్లి చేసుకుంటున్న వారిలో 90 శాతం మంది పెద్దల ప్రమేయంతోనే ఒక్కటయ్యామని పేర్కొన్నారు. కొన్నిసార్లు పెద్దలు బలవంతంగా పిల్లలను ఒప్పిస్తుండగా.. మరికొన్నిసార్లు పిల్లలే తల్లిదండ్రులను అర్థం చేసుకొని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు.

భారత్‌లో పెళ్లి విషయంలో కులం చాలా కీలకమైన పట్టింపు. ఈ అంశంపై 2014లో 70 వేల మందిపై సర్వే చేయగా.. పట్టణాల్లో ఉంటున్నవారిలో కేవలం 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే కులాన్ని పట్టించుకోలేదని తేలింది. మతాంతర వివాహాలైతే ఇంకా అరుదు. కేవలం 5 శాతం పట్టణ నివాసితులు మాత్రమే వేరే మతానికి చెందిన వారిని పెళ్లి చేసుకున్నారు. మనదేశంలో యువత చాలా వరకు కులాంతర వివాహాలు చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ల అభిప్రాయానికి, వాస్తవంగా జరిగేదానికి(డేటా ప్రకారం) ఎంతో వ్యత్యాసముంది.

2015లో పరిశోధకులు మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ల ద్వారా 1000 మంది వధువులను సంప్రదించారు. వారిలో సగం మంది తమ కులం కాని వ్యక్తులను వివాహం చేసుకునేందుకు ఆసక్తి కనబర్చినప్పటికీ అత్యధిక మంది సొంత కులానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్హతలు, జీతం, అందం అన్నీ ఒకే విధంగా ఉన్నప్పటికీ దళిత పెళ్లి కొడుకులను సంప్రదించే అవకాశం చాలా తక్కువని తేలింది. ఈ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఏం చేసినా అది తిరుగుబాటుగా మారుతోంది.

ఇది కూడా చదవండి: OMG: ప్రభాస్ అని హీరో పేరు పెట్టుకున్నావ్.. కానీ నీ సంగతి తెలిస్తే ప్రభాస్ ఫ్యాన్సే కాదు..

ఈ ప్రేమ పెళ్లిళ్ల వ్యవహారంలో రాజకీయ పక్షాలు కూడా తలదూరుస్తున్నాయి. ఇటీవల లవ్ జీహాద్ అనే ఉద్యమం తెరపైకి వచ్చింది. దీని ప్రకారం ముస్లిం పురుషులు, హిందూ స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా వారి మతం మారుస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపా వివాహం కోసం మహిళలను మతం మార్చడానికి బలవంతం చేస్తోన్న పురుషులకు కఠినమైన శిక్షలను విధిస్తోంది. ప్రేమ విషయంలో చట్టబద్ధత పరిమితులను మరింత పెంచింది.

ఇలాంటి చర్యల వల్ల కులాంతర, మతాంతర వివాహాలు పాతాళానికి చేరే అవకాశముంది. అంటే ప్రేమ వివాహాల పట్ల విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ఇప్పటికే చాలా మంది మతాంతర వివాహాలు చేసుకున్నవారు తమ పేర్లను బహిర్గత పరచుకునేందుకు ఇష్టపడట్లేదు. కొంతమందైతే వివాహ లైసెన్స్ పొందేందుకు కూడా ఆసక్తి కనబర్చట్లేదు.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Arrange marriage, Love marriage, Lovers, Marriages

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు