మాఘమాసం వచ్చింది.. ఈ సమయంలో నదీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం..

పాప పరిహారం కోసం ఈ మాసంలో నదీస్నానాలు చేస్తారు. ఈ సమయంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు ఆరోగ్యవంతమైనవే కాదు.. అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి.

Amala Ravula | news18-telugu
Updated: February 9, 2019, 11:19 AM IST
మాఘమాసం వచ్చింది.. ఈ సమయంలో నదీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 9, 2019, 11:19 AM IST
జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందే స్నానాలు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా వేగంగా ప్రవహించే నీళ్లల్లో చేస్తే సైన్స్ పరంగానూ మంచిదేనంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే మాఘమాసంలో సూర్యుడు స్థానం ప్రకారం ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి. ఈ సమయంలో సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి కాబట్టే.. ఈ సమయంలో ఉదయాన్నే స్నానాలు చేయడం మంచిది.
చంద్రుడు మఖ నక్షత్రంలో ఉంటాడు కాబట్టే దీనిని మాఘమాసం అంటారు. ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞాలు, క్రతువులకు సరైన సమయం ఈ కాలం. మాఘమాసంలో ప్రతీ భారతీయుడు పవిత్రస్నానాలు ఆచరించి పాపపరిహారం కోసం నదీస్నానాలు చేయాలని.. దీనివల్ల సకల కల్మషాలు పోతాయని విశ్వసిస్తారు.

అయితే, నదీలో స్నానం చేస్తే చాతర్గుణం లభిస్తే, బావినీటితో స్నానం చేయడం వల్ల పన్నేండేళ్ల పుణ్యం, తటాక స్నానంతో ద్విగుణం, మహానది స్నానంతో శతగుణం, గంగాస్నానంతో గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా స్నాన సమయంలో ‘ప్రయాగ’ను స్మరించడం వల్ల ఉత్తమఫలితం లభిస్తుంది.

కాబట్టి చలి అంటూ దుప్పటికప్పుకోక ఉదయాన్నే స్నానం చేసి సర్వపాపాలను పోగొట్టుకోండి..
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...