డ్రగ్స్ మన టాలివుడ్‌నే కాదు.. బాలివుడ్ Bollywood ను కూడా ఊపేస్తున్న సందర్భం ఇది. ఆదివారం ప్రముఖ బాలివుడ్ హిరో షారుఖ్ కాన్ Sharukh khan కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ సంచలనం రేపింది. ప్రస్తుతం దీనిపై అనేక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎందుకు యువతలో ఈ డ్రగ్స్ వినియోగం పెరిగిందో.. దారితీసిన ఒత్తిళ్లు ఎలా ఉంటాయో చూద్దాం. మాదకద్రవ్యాల వినియోగంపై ఓ నజర్ వేద్దాం.
డ్రగ్స్‌ను దుర్వినియోగం లేదా పరిమితికి మించి కేవలం ఆనందం పొందడం కోసం.. వారి ఒత్తిడిని తగ్గించుకోవడానికి వాడుతారు. డ్రగ్స్ ద్వారా తీవ్ర ఆరోగ్య రుగ్మతలకు దారితీస్తుంది.
అస్సలు డ్రగ్స్ ఎందుకు వాడతారో మనస్తత్వశాస్త్రం మనం ఊహించని దానికంటే చాలా దారుణమైన విషయాలను తెలియజేసింది. డ్రగ్స్‌కు బానిసగా మారడానికి ప్రధాన మూల కారణం డబ్బు, అధికారం. ప్రాథమికంగా వ్యసనం అంటే ఒక వ్యక్తి ఎక్కువ ఆహ్లాదకరమైన కార్యాచరణలో పాల్గొన్నపుడు.. అది వారి రోజువారీ విధులకు ఆటంకం కలిగించినా కూడా దాన్ని ఆ వ్యక్తి ఆపలేడు. అది శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
డ్రగ్ వినియోగం మొదట స్వచ్ఛదంగా Individually ప్రారంభిస్తారు. సరికొత్త అనుభూతి కోసం.. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడటానికి ప్రయత్నిస్తారు. ఇది కాలక్రమేణా వ్యక్తి స్వీయ నియంత్రణ Self control సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. చివరికి ఇది వ్యసనంగా మారుతుంది.
మానసిక ఒత్తిడి Mental stress, బాధకరమైన అనుభవం వల్ల డ్రగ్స్‌కు బానిసలవుతున్నారట. ఒక వ్యక్తి తనను తాను ఒత్తిడి నుంచి మరల్చుకోవడానికి డ్రగ్స్‌ను ఆశ్రయిస్తారు. కొంతమంది దృఢ సంకల్పంతో డ్రగ్స్ వినియోగం ఆపేస్తారు.
NIDA ప్రకారం ప్రజలు అనేక కారణాల వల్ల డ్రగ్స్ వాడతారు. మంచి అనుభూతి పొందాలని, పాఠశాలలో లేదా పనిలో ఇతరుల కంటే మెరుగ్గా రాణించాలని ఇలా చేస్తారు. ముఖ్యంగా ఇది టీనేజర్స్‌లో సాధారణం కావడం గమనార్హం.
మాదకద్రవ్యాలు పనిచేసే తీరు..
Depressants..డిప్రెసెంట్స్..
ఇవి ఫంక్షనల్ యాక్టివిటీ తగ్గించేవి. తక్కువ పరిమాణంలో తీసుకున్నపుడు రిలాక్స్‌గా అనిపిస్తుంది. పెద్ద మొత్తంలో డిప్రెసెంట్స్ తీసుకుంటే.. వికారం, అపస్మారకస్థితి, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యకు కూడా ప్రేరేపిస్తాయి. గంజాయి, హెరాయిన్, మార్ఫిన్, GHB వంటి నల్లమందు డిప్రెసెంట్లకు ఉదాహరణలు.
Hallucinaogen హల్లోసినోజెన్స్..
ఇది వాడకం వల్ల లేనిది ఉన్నట్లుగా చూపించవచ్చు. ఇటువంటి సందర్భాలు మతిస్థిమితం, భయాందోళన, మానసిక ఆనందం, వికారం, జీర్ణాశయ సమస్యలకు దారితీయవచ్చు. ఎల్‌ఎస్‌డీ, గంజాయి, మ్యాజిక్ మష్రూమ్, కెటామైన్ హాలూసినోజెన్‌లకు నమూనాలు.
MDMA-ఎండీఎంఏ..
రానురాను హృదయ స్పందన రేటు, అధిక రక్తపోటు, జ్వరం, ఆకలి తగ్గడం లేదా మార్పు, ఆందోళన, నిద్రలేమికి దారితీస్తుంది. పెద్ద మొత్తంలో తీసుకున్నపుడు మూర్చ, కడుపు తిమ్మిరి, ఆందోళనకు దారితీస్తుంది. కెఫైన్, నికోటిన్, కొకైన్, ఎక్స›్టఎండీఎంఏకు ఉదాహర ణలు.
అనారోగ్య సమస్యలు..
డ్రగ్స్ నిరంతరం వాడటం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తాయి. డిప్రెషన్, మతిస్థిమితం కోల్పోవడం, ఆందోళన వంటి మానసిక సమ్యలు వస్తాయి. గుండె సంబంధిత, శ్వాసకోశ వ్యాధులు.. మూత్రపిండాలు దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. ఈ డ్రగ్స్ వ్యసనం ఒక్కోసారి మరణానికి దారితీస్తుంది.
ఎన్‌ఐడీఏ ప్రకారం గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి, కేన్సర్, మానసిక అనారోగ్యం, హెచ్‌ఐవీ,హెపటైటిస్ ఇతర ప్రభావాలు ఉండవచ్చు.
డ్రగ్స్ వ్యసనాన్ని చికిత్స చేయవచ్చు. దీనికి కాస్త సమయం, కృషి కావాలి. ఇది దీర్ఘకాల ప్రక్రియ. కుటుంబ పాత్రతోపాటు నిపుణుల అవసరం కూడా ఉండాలి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా అంశాలపై దృష్టి పెట్టవచ్చు.
చికిత్స..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood actor, Drug case, Drugs, Tollywood drug case