THE MOLE ON THESE PARTS OF YOUR BODY CAN ENJOY SEXUALLY ACCORDING AND HERE SOME INTERESTING FACTS ABOUT MOLE THEORY SRD
Mole Theory : శరీరంలో ఆ ప్రదేశాల్లో పుట్టుమచ్చ ఉంటే.. శృంగారంలో రెచ్చిపోతారట..!
ప్రతీకాత్మక చిత్రం
Mole theory: పుట్టుమచ్చలనేవి పుట్టుకతోనే వస్తాయి. చనిపోయేవరకూ ఉంటాయి. వాటి వల్ల ఏ నష్టమూ ఉండదు. మరి వాటితో కలిగే ప్రయోజనాలు, వాటి అర్థాలేంటో తెలుసుకుందాం.
అదృష్టంకలిసొస్తుందో లేదో... పుట్టుమచ్చల్ని చూసి డిసైడ్ చేస్తారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. శరీరంలో వివిధ భాగాల్లో పుట్టు మచ్చల వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే... మగవారికీ, ఆడవారికీ పుట్టుమచ్చల విషయంలో చాలా తేడాలు ఉన్నాయని వివరిస్తున్నారు. ఏ పుట్టుమచ్చ వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
* మగవారు తమ కుడివైపు శరీర భాగాలపై పుట్టుమచ్చలు కలిగివుంటే అదృష్టమని పండితులు చెబుతున్నారు. అదే మహిళలైతే... ఎడమవైపు శరీరంపై పుట్టుమచ్చలు కలిగివుంటే మేలు అంటున్నారు.
* ఓ వ్యక్తి శరీరంపై 12 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే... అది చెడు సంకేతాలకు గుర్తు అని చెబుతున్నారు. వారి జీవితంలో ఆనందం, మనస్శాంతి ఉండవని అంటున్నారు. కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే... వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట. అదే ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే... వైవాహిక జీవితంలో మనస్పర్థలు, గొడవలు పెరిగి... విడిపోతారని అంటున్నారు. ఐతే... ఇలా కనుబొమ్మలపై పుట్టుమచ్చలు ఉన్నవారు... ప్రయాణాలు బాగా చేస్తారట.
* కుడి కన్ను రెప్ప మీద పుట్టు మచ్చ ఉండేవారు సెక్సులో రెచ్చిపోతారట. తొడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ప్రేమతో కూడిన చక్కటి జీవితాన్ని గడుపుతారట. అయితే వీరిలో లైంగిక ఆసక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదట.
* పెదాలపై పుట్టుమచ్చ ఉండేవారిలో సెక్స్ అప్పీల్ మాత్రమే కాదండోయ్. సెక్సులో కూడా బాగా రాణిస్తారట. అంటే.. పార్టనర్‌కు పండగేనట.
* ముఖం మధ్యలో మోల్ (పుట్టుమచ్చ) ఉంటే... అది ప్రేమకు గుర్తు. అదే మోల్ ముఖంపై కుడివైపు ఉంటే ఆ వ్యక్తి ఏదైనా ఒక సబ్జెక్టుపై విపరీతమైన నాలెడ్జిని పొందగలరు. అదే మోల్ ముఖంపై ఎడమవైపు ఉంటే... వారు డబ్బును వృథా చేస్తారు. ముఖంపై కుడివైపు ఉండే పుట్టుమచ్చ... సంపద, తెలివితేటలకు గుర్తు. అదే ముఖంపై ఎడమవైపు ఉండే పుట్టుమచ్చ... నిరాశకు గుర్తు. జీవితం ఆనందంగా ఉండదు. కళ్లలో పుట్టుమచ్చ ఉన్నవారు... బాగా ఆలోచించగలరు. కుడివైపు కంటిలో ఉంటే... వాళ్లు క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. ఇతరుల్ని అంచనా వేయడంలో వారికి తిరుగుండదు.
* కళ్లలోపల పుట్టుమచ్చ ఉండేవారు సెన్సిటివ్‌గా ఉంటారు. చిన్న చిన్న విషయాలపైనా లోతుగా స్పందిస్తారు. చెవిలో పుట్టుమచ్చ ఉంటే... ఎక్కువ కాలం జీవిస్తారు. ముఖం చుట్టుపక్కల పుట్టు మచ్చ ఉంటే... వారు ఆనందంగా ఉంటారు. మర్యాదస్తులలా ఉంటారు. నోట్లో పుట్టుమచ్చ ఉంటే... సంపన్నులవుతారు. అదృష్టం మామూలుగా ఉండదు. ఆ వ్యక్తిని చేసుకునే మహిళ అత్యంత ఆనందంగా ఉంటారు.
* ముక్కులో, ముక్కుపైన ఉంటే... ఆ వ్యక్తి చాలా టాలెంట్ కలిగి ఉంటారు. ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో అదృష్టవంతులవుతారు. పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారికి... హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుంది. వారిలో లైంగిక కోరికలు చాలా బలంగా ఉంటాయి. అదే పుట్టుమచ్చ కింది పెదవిపై ఉంటే... వారి జీవితంలో పేదరికం ఉంటుంది. ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే నిరాశతో ఉంటారు. కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే... సంపన్నులు అవుతారు.
* కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే... ఆ వ్యక్తి నిబద్ధత కలిగి ఉంటారు. ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉంటే... వారు కొద్దిగా కోపంగా ఉంటారు. చేతులపై పుట్టుమచ్చలు ఉండేవారు తెలివైన వారు. కుడి చేతిపై పుట్టుమచ్చ ఉంటే... వారు చాలా బలవంతులు అవుతారు. కుడివైపు వెనకవైపున పుట్టుమచ్చ ఉంటే సంపన్నులు అవుతారు. ఎడమ చేతికి పుట్టుమచ్చ ఉంటే... ఆ వ్యక్తి చాలా డబ్బు ఖర్చు పెడతారు. అదే పుట్టుమచ్చ ఎడమ చేతి వెనకవైపు ఉంటే... ఆ వ్యక్తికి జాలి, దయ అంతగా ఉండవు.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.