Betel Leaf Health Benefits: తమలపాకుతో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్
తమలపాకు
Betel Leaf Health Benefits: తమలపాకుల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్-సీ, థియామిన్, రైబోఫ్లోవిన్, కేరోటిన్ లాంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
తమలపాకుల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మన పూర్వీకులకు దీని ఉపయోగాల గురించి బాగా తెలుసు. ఆధునిక ప్రజలకు దాని ఉపయోగాల గురించి పెద్దగా తెలియదు. నోటి క్యాన్సర్ వల్ల వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటూ పాన్ తినడాన్ని నిరుత్సాహపరుస్తుంటారు. భారతదేశంలో పొగాకు లేదా సున్నం, అరేకా గింజతో పాన్ తినడం సంప్రదాయం. ఆధ్యాత్మిక ఆచారాలు, ప్రార్థనల్లో తమలపాకులను శుభప్రదంగా భావిస్తారు.
ఎన్నోప్రయోజనాలు..
వాస్తవానికి తమలపాకుల్లో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్-సీ, థియామిన్, రైబోఫ్లోవిన్, కేరోటిన్ లాంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం వీటిలో గొప్ప మూలం. వాస్తవానికి తమలపాకులు చాలా తక్కువగా ఉంటాయి. ఇది పోషకాలకు గొప్ప వనరుగా దోహదపడుతుంది. అయితే నిజమైన ఔషధ ప్రయోజనాలు ఇతర పోషక రహిత భాగాల నుంచి ఉత్పన్నమవుతాయి. వీటిలో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ వంటి నిరోధక సమ్మేళనాలు ఉన్నాయి. వీటిలో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, ఆల్కలాయిడ్లు, స్టెరాయిడ్లు, క్వినోన్లు ఉన్నాయి.
ఈసమస్యలకుచెక్పెడుతుంది..
తమలపాకుల్లో యాంటీ మైక్రోబియల్ క్యాన్సర్ నిరోధక, డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. కార్డియో వాస్కులర్ డిసీజ్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు నివారణలో తోడ్పడుతుందని పలు అధ్యయనాల్లో నమోదు చేశారు. సాంప్రదాయ వైద్యంలో గాయాలు, మంట, ఉబ్బసం చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. సంప్రదాయ ఔషధంలో ఇతర ప్రయోజనాలు నోటి కుహరం లోపాలు, జీర్ణ సంబంధిత సమస్యలు, ఒత్తిడిని తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి.
కొన్ని సమస్యలు..
నోటి క్యాన్సర్ కు సంబంధించిన ఆందోళనలు వాస్తవమైనవే. పొగకు, ఇతర పదార్థాల ప్రభావం పెదవి, నోరు, నాలుక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే స్వతంత్రంగా తమలపాకులు హానికరమైన ప్రభావాలను కలిగిఉన్నట్లు కనుగొనలేదు. నిర్దిష్ట పరిస్థితుల కోసం ఆయుర్వేద గ్రంథాల్లో తమలపాకు తినే విషయంలో వివిధ సిఫార్సులు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో హానికరమైన పదార్థాలు ఉన్నా లేవా అనే కంటే తమలపాకుల వల్ల కలిగే ప్రయోజనాలు గురించి మరిన్ని శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.