గర్భిణుల్లో అధికబరువు... పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం

గర్భం దాల్చిన తరువాత మహిళల శరీరాకృతిలో మార్పులు రావడం, బరువు పెరగడం సహజం. కానీ కొంతమంది గర్భిణులు విపరీతంగా బరువు పెరుగుతారు. ఇది అనారోగ్యాలకు సంకేతం కావొచ్చు. తల్లి అధిక బరువు కడుపులో పెరుగుతున్న బిడ్డపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

news18-telugu
Updated: September 18, 2020, 1:13 PM IST
గర్భిణుల్లో అధికబరువు... పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గర్భిణులు బరువు పెరగడం సాధారణ విషయమే. ప్రెగ్నెన్సీ తరువాత హార్మోన్లలో మార్పులు బరువు పెరగడానికి దారితీస్తాయి. కానీ అధిక బరువు తల్లీబిడ్డలిద్దరికీ సమస్యగా మారే అవకాశం ఉంది. గర్భిణుల్లో అధిక బరువుతో కడుపులో పెరుగుతున్న శిశువు దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లో ఆస్తమా, అలర్జీలు ముందు వరుసలో ఉన్నాయి. ది న్యూయార్క్ టైమ్స్ కథనం కూడా ఈ విషయాలను ధ్రువీకరించింది. కొన్ని రకాల అలర్జీలు నవజాత శిశువుల్లో తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే గర్భిణులు ఎప్పటికప్పుడు బరువును సరిచూసుకోవాలి. దీనిపై కాబోయే తల్లిదండ్రలు అవగాహన పెంచుకోవాలి.

పరిశోధనలో తేలిన విషయాలు

గర్భిణుల్లో అధిక బరువు పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు చైనాలోని జామా నెట్వర్క్ ఓపెన్ అనే సంస్థ ప్రయోగాలు చేసింది. ఇందులో భాగంగా పరిశోధకులు షాంఘైలో 15,145 మంది తల్లీ బిడ్డల జంటలను ఎనిమిదేళ్ల పాటు అధ్యయనం చేశారు. దీని ప్రకారం 33 నుంచి 55 పౌండ్ల వరకు బరువు పెరిగిన గర్భిణుల పిల్లలకు ఆస్తమా, ఫుడ్ అలర్జీ, డ్రగ్ అలర్జీ వంటివి వచ్చే అవకాశం 13శాతం ఎక్కువ అని తేలింది. ఆ చిన్నారులకు తామర వంటి చర్మవ్యాధులు వచ్చే అవకాశం 9శాతం ఎక్కువ అని వారు చెబుతున్నారు. నిపుణుల సూచనల ప్రకారం గర్భిణుల బరువు 22 నుంచి 33 పౌండ్ల వరకు ఉండొచ్చు.

గర్భిణులు 55 పౌండ్ల కంటే ఎక్కువ బరువు ఉంటే.. పిల్లలకు ఆస్తమా రిస్క్ 22శాతం, అలర్జీల బారిన పడే అవకాశం 14శాతం ఎక్కువ. వారికి తామర వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం 15 శాతం, డ్రగ్ అలర్జీ వచ్చే అవకాశం 21 శాతం పెరుగుతుంది. గర్భధారణకు ముందే అధిక బరువు ఉన్న మహిళలకు పుట్టే బిడ్డల్లో ఇలాంటి అలర్జీలు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

ఇతర కారణాలు కూడా ఉన్నాయి
అధ్యయనాలు చేసేటప్పడు కొన్ని ఎక్స్టర్నల్ ప్యాక్టర్స్ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. వీటిల్లో తల్లి ఆదాయం, పొగ, మద్యం తాగే అలవాట్లు, కుటుంబంలో ఎవరికైనా అలర్జీలు ఉన్నాయా తదితర అంశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 25 శాతం మంది వివిధ రకాల అలర్జీలతో బాధపడుతున్నట్టు అధ్యయన బృందంలో సభ్యుడు యిటింగ్ చెన్ చెబుతున్నారు. జన్యుపరంగా పిల్లలకు అలర్జీలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడే అవకాశం తగ్గుతుందని ఆయన వివరిస్తున్నారు. అన్ని రకాల అలర్జీలు ప్రాణాంతకం కాదు. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలితో ఇలాంటి అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు.
Published by: Sumanth Kanukula
First published: September 18, 2020, 1:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading