హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

honeymoon: అక్కడికి హనీమూన్ కు వెళ్తే విడాకులు ఖాయమట.. కొత్త జంటలు అటు వైపు వెళ్లకండి

honeymoon: అక్కడికి హనీమూన్ కు వెళ్తే విడాకులు ఖాయమట.. కొత్త జంటలు అటు వైపు వెళ్లకండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మాల్దీవ్స్ (Maldives) లో హనీమూన్ (honeymoon) ఎంజాయ్ చేసి వచ్చారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ హనీమూన్ వెళ్లివచ్చిన జంటల్లో అత్యధిక జంటలు విడాకులు (divorce) తీసుకుంటున్నారట. ఇదంతా విడ్డూరంగా ఉందని కొట్టిపడేయకండి. ఓ స్టడీ తేల్చిన సత్యాలు ఇవీ.

ఇంకా చదవండి ...

మాల్దీవ్స్ (Maldives) లో హనీమూన్ (honeymoon) ఎంజాయ్ చేసి వచ్చారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ హనీమూన్ వెళ్లివచ్చిన జంటల్లో అత్యధిక జంటలు విడాకులు (divorce) తీసుకుంటున్నారట. ఇదంతా విడ్డూరంగా ఉందని కొట్టిపడేయకండి. ఓ స్టడీ తేల్చిన సత్యాలు ఇవీ. కాబట్టి కాస్త హనీమూన్ ప్లాన్ చేసుకునేప్పుడు కాస్త కేర్ ఫుల్ గా ప్లాన్ చేసుకోండి. లేకపోతే హనీమూన్ డెస్టినేషన్ (honeymoon destination) మీ లైఫ్ ను ప్లాన్ చేసే ప్రమాదం ఉంది. మాల్దీవ్స్ కు హనీమూన్ వెళ్లొచ్చిన జంటల్లో కనీసం 20శాతం మంది విడాకులు తీసుకున్నారని కొత్త డేటా వివరిస్తోంది. మాల్దీవ్స్ అంటేనే లగ్జరీకి కేరాఫ్. మరి ఇంత ఖరీదైన హనీమూన్ (expensive honeymoon) ఎంజాయ్ చేసి ఆఖరుకి బంధానికే గుడ్ బై కొట్టడంలో ఏమైనా అర్థముందా అన్నదేగా మీ అనుమానం.

కంపేర్ డాట్ బెట్ Compare.bet అనే వెబ్ సైట్ 3,100 మంది విడిగా ఉంటున్న లేదా విడాకులు తీసుకున్న దంపతులను ఇంటర్వ్యూ చేసి పెళ్లి తరువాత వారి హనీమూన్ ఎక్కడ జరిగిందనే సమాచారం సేకరించింది. వీరిలో 620 మంది అంటే 20శాతం మంది తాము మాల్దీవ్స్ కు హనీమూన్ వెళ్లినట్టు చెప్పారు. మాల్దీవ్స్ తరువాతి స్థానంలో మరాకా (17శాతం), బోరా బోరా (13 శాతం) నిలిచాయి.

పాపులర్ హాలిడే స్పాట్స్

సాధారణంగా హనీమూన్ అంటే పాపులర్ హాలిడే స్పాట్ల (popular holiday spots) నే ఎంచుకుంటారు. ప్రపంచం చాలా విశాలమైంది, ఇక్కడ మనం చూడాల్సిన ప్రదేశాలకు వెళ్తే జీవితకాలం సమయం కూడా సరిపోదు. మరి అలాంటప్పుడు కొంప కొల్లేరు చేసే హనీమూన్ డెస్టినేషన్ అయిన మాల్దీవ్స్ కు ఎందుకు వెళ్లాలి. అందమైన, విలాసవంతమైన హనీమూన్ డెస్టినేషన్స్ దేశ విదేశాల్లో లెక్కకు మిక్కిలి ఉన్నాయి. వాటిలో ఏదైనా వేరే ప్రాంతాన్ని ఎంచుకోండి. మీ జీవితాన్ని ఆస్వాదించండి.

అక్కడికి వెళ్తే అస్సలు విడిపోరట..

బ్రిటన్ కు చెందిన స్టేకేషన్ (staycation) హాలిడే ప్రకారం బ్రిటన్ లో హనీమూన్ చేసుకున్న జంటలు అస్సలు విడిపోరట. ఇదేదో బెస్ట్ గా ఉంది కదూ. యూరోపియన్ డెస్టినేషన్స్ అయిన వెనిస్, రోమ్ వంటివి కూడా ఈ విడాకుల సెంటిమెంట్ లిస్ట్ లో ఉన్నాయి.

సోలోమూన్స్ లేటెస్ట్ ట్రెండ్

పెళ్లయ్యాక భార్యాభర్తలిద్దరూ జంటగా హనీమూన్ కు వెళ్లడం పాత ట్రెండ్ అనే నేటి జనరేషన్ సోలోమూన్స్ solomoons వైపు మొగ్గుచూపుతున్నారు. అంటే భార్య, భర్త విడిగా వెకేషన్ కు వెళ్తారు అది కూడా వేర్వేరే ప్రాంతాలకు. ఇలా కొత్తగా పెళ్లైన వారు వేర్వేరే వెకేషన్ కు వెళ్లటాన్ని సోలోమూన్స్ గా వెస్ట్రన్ కంట్రీస్ లో ట్రెండ్ అవుతోంది.

ఇందిరా గాంధీ హనీమూన్ ఇక్కడే..

అయినా ఇంత సెంటిమెంట్ ఉన్న ప్లేస్ కు లక్షల రూపాయలు తగలబెట్టడం ఎందుకు థాయ్ ల్యాండ్ వంటి ఎన్నో ఇతర ప్లేసులు ఉన్నాయిగా..అంతెందుకు మనదేశంలో హనీమూన్ డెస్టినేషన్స్ కు ఏం కొరతని విదేశాలకు పోవాలి. అన్నట్టు ప్రేమ వివాహం చేసుకున్న ఇందిరా గాంధీ హనీమూన్ ఎక్కడ చేసుకున్నారో మీకు తెలుసా? కశ్మీర్ లో ఆమె హనీమూన్ అత్యంత రొమాంటింక్ గా సాగిందని స్వయంగా ఆమెనే పలు సందర్భాల్లో చెప్పారు. మరందుకే ఇండియాలోని ప్రకృతి అందాలను ముందు ఎక్స్ ప్లోర్ చేసి ఆతరువాత విదేశాలకు చెక్కేయండి.

హనీమూన్ ఎందుకు?

అసలు హనీమూన్ ఎందుకు? ఫొటో షూట్ కోసమా? స్టేటస్ లు పెట్టుకునేందుకా? లేక ట్విట్టర్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియాలో జస్ట్ పోస్ట్ చేసేందుకా? కొత్తగా పెళ్లైన వధూవరులు ఇంటికి దూరంగా, తెలిసిన వారికి దూరంగా, ఏదైనా కొత్త ప్రాంతంలో ఉంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని హనీమూన్ ను డిజైన్ చేశారు. అలాంటిది విడాకులను పెటాకులు చేసే మాల్దీవ్స్ కు వెళ్లి తంటాలు ఎందుకు తెచ్చుకుంటారు? కొత్త జంటలూ ఓ సారి ఈ విషయం ఆలోచించండి.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Maldives, Marriage

ఉత్తమ కథలు