ఈ వెరైటీ షర్ట్ పిచ్చెక్కిస్తోంది...!

Shiva Kumar Addula | news18
Updated: June 11, 2018, 6:45 PM IST
ఈ వెరైటీ షర్ట్ పిచ్చెక్కిస్తోంది...!
  • News18
  • Last Updated: June 11, 2018, 6:45 PM IST
  • Share this:


మనకు షర్ట్ తెలుసు.. టీ షర్ట్ తెలుసు..! కానీ టీ షర్ట్ -షర్ట్ తెలుసా.? అవును మీరు చదివింది కరెక్టే...! అది టీ షర్ట్- షర్ట్..! ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పాశ్చాత్య దేశాల్లోని యువత దీని గురించే మాట్లాడుకుంటోంది. వెరైటీగా కనిపిస్తున్న ఈ సరికొత్త షర్ట్ లో స్పెషల్ ఏంటో తెలుసా..?



ఇందులో ప్రత్యేకత అంటూ  ఏమీ లేదు. షర్ట్, టీ షర్ట్ రెండూ అటాచ్ అయి .. ఉంటాయి. అంటే రెండూ కలిపి ఉంటాయన్న మాట. మనకు ఏది నచ్చితే  దాన్ని ధరించవచ్చు. టీ షర్ట్ వేసుకున్నామనుకోండి.. ముందు భాగంలోని షర్ట్ గాల్లో వేలాడుతోంది. ఇకవేళ షర్ట్ ధరిస్తే.. వీపు భాగంలో టీ-షర్ట్ వేలాడుతుంది. ఈ ట్రెండింగ్ డ్రెస్ లో ఇదే స్పెషాలిటీ.

మనం టీ-షర్ట్ పై షర్ట్ వేసుకున్నాం. షర్ట్ మాదిరి కనిపించే టీ-షర్టూ సుపరిచితమే. పోకిరి సినిమా రిలీజైన రోజుల్లో అదో ట్రెండ్. కానీ ఇలాంటి డ్రెస్ ను ఎప్పుడూ చూడలేదు కదా..!  ఇటీవలే పురుడు పోసుకున్న ఈ షర్ట్.. సోషల్ మీడియాలో సంచలనం స్రుష్టిస్తోంది. వావ్..వాట్ ఏ క్రియేటివిటీ అని కొందరు మెచ్చుకుంటే... షర్ట్  ఇలా కూడా ఉంటుందా అని మరికొందరు నోళ్లు వెల్లబెడుతున్నారు.





ఈ వెరైటీ షర్ట్ ను తయారుచేసింది..ఆషామాషీ కంపెనీ కాదు.  స్పెయిన్ కు చెందిన ప్రఖ్యాత బ్యాలెన్షియాగా ఫ్యాషన్ హౌజ్ దీన్ని డిజైన్ చేసింది. ఇంతకు దీని ధరంతో తెలుసా...?  1290 అమెరికన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో 87వేల రూపాయలన్న మాట. ఇంకేం ..మీకూ నచ్చితే ఆన్ లైన్ లో ఆర్డరిచ్చేయడి.
Published by: Shiva Kumar Addula
First published: May 30, 2018, 8:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading