ఉదయాన్నే ఈ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే.. రోజంతా యాక్టివ్‌‌గా ఉంటారు...

ఉదయాన్నే సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్లా శరీరం, మెదడు ఉత్తేజంగా మారుతుంది.

Amala Ravula | news18-telugu
Updated: December 3, 2019, 9:16 AM IST
ఉదయాన్నే ఈ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే.. రోజంతా యాక్టివ్‌‌గా ఉంటారు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
17ప్రజెంట్ బిజీ లైఫ్‌లో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తుంటారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి మధ్యలో సరికొత్తగా బ్రంచ్ చేసేస్తుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాటుకి స్వస్తీ చెప్పాల్సిందేనంటున్నారు ఆహార నిపుణులు. ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఫలహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని.. దీని కారణంగా అధికబరువుకి కూడా చెక్ పెట్టొచ్చని.. ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు.
* ఉదయాన్నే సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్లా శరీరం, మెదడు ఉత్తేజంగా మారుతుంది.
* మంచి పోషకాలు నిండిన బ్రేక్‌పాస్ట్ తీసుకోవడం ద్వారా రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ పెరిగడమే కాక.. అధికబరువుని ఈజీగా తగ్గించుకుకోవచ్చు.

* మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఖచ్చితంగా ప్రోటీన్స్ ఉండాలి. దీనివల్ల ఎముకలు, కండరాలు బలంగా మారతాయి
* ఉదయాన్నే అన్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం, కాఫీ, పంచదార కలిగిన డ్రింక్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
* బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్స్‌ని తీసుకోవడం ద్వారా అసిడిటీ వంటి సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు.


* సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. అంతేకాదు.. తలనొప్పి, మగతగా అనిపించడం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.* అంతేకాదు.. ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల స్లిమ్‌గా ఉంటారని తాజా పరిశోదనలు చెబుతున్నాయి.
* గుడ్లు, చికెన్, ఓట్‌మీల్, క్యారెట్స్, తాజా ఆకుకూరలు, కూరగాయలు, గ్రీక్ యోగర్ట్, కాటేజ్ చీజ్, డైరీ ప్రొడక్ట్స్, పాలు, అరటిపండ్లు, కివి, నానబెట్టిన చిక్కుళ్లు, సోయా, హెల్దీ నట్స్, గింజలు, అవకాడో, స్మూతీస్, ప్రోటీన్ షేక్స్ ఆరోగ్యాన్ని కాపాడతాయి..

ఇవికూడా చదవండి..

బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ వద్దు.. డిప్రెషన్‌కి గురవుతారట..

Summer Tips : ఎండాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు పాటించండి..
First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు