Home /News /life-style /

New Yearలో విదేశీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఆ దేశం మీకు స్వాగతం పలుకుతోంది.. ఈ విషయాలు తెలుసుకోండి

New Yearలో విదేశీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఆ దేశం మీకు స్వాగతం పలుకుతోంది.. ఈ విషయాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Thailand welcome tourists: కరోనా విజృంభణ తగ్గిన ఈ తరుణంలో ఇప్పుడిప్పుడే టూరిస్ట్ ప్రదేశాలు తెరుచుకుంటుండటంతో ప్రజలు మళ్ళీ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. కొంతమంది దేశీయ పర్యటనలను ప్లాన్ చేసుకుంటుండగా, మరికొందరు అంతర్జాతీయ ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు.

ఇంకా చదవండి ...
మరి కొద్ది రోజుల్లోనే 2020 సంవత్సరం ముగియనుంది. ఈ ఏడాది ప్రతి ఒక్కరికీ చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. కరోనా వైరస్(Coronavirus) విజృంభనతో ఎన్నడూ లేనంతగా ప్రజలు ఎక్కువ భాగం ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. ప్రజలంతా లాక్ డౌన్లు, మాస్క్లు, శానిటైజర్లతో కరోనా భయంతో కాలం గడపాల్సి వచ్చింది. ప్రపంచ దేశాలు అమలు చేసిన లాక్ డౌన్ తో అన్ని పర్యాటక ప్రదేశాలు సుదీర్ఘకాలం పాటు మూతపడ్డాయి. తద్వారా దేశీయ, అంతర్జాతీయ టూరిస్ట్ ప్రదేశాలు కల తప్పాయి. అయితే, ఇప్పుడిప్పుడే టూరిస్ట్ ప్రదేశాలు తెరుచుకుంటుండటంతో ప్రజలు- మళ్ళీ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. కొంతమంది దేశీయ పర్యటనలను ప్లాన్ చేసుకుంటుండగా, మరికొందరు అంతర్జాతీయ ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. మీరు కూడా మీ కుటుంబం, స్నేహితులతో కలిసి పర్యాటక ప్రదేశాల సందర్శనకు వెళ్లాలని యోచిస్తున్నారా?.. మిమ్మల్సి ఆహ్వానించడానికి పర్యాటక దేశం థాయిలాండ్ సిద్ధమవుతోంది. అయితే, థాయిలాండ్ కు మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి.

థాయిలాండ్ పర్యటనకు ముందు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు..
1. థాయిలాండ్(Thailand )కు వెల్లే పర్యాటకులు(tourists) అందరూ తప్పనిసరిగా కరోనా నిర్థారణకు చేసే పీసీఆర్ పరీక్ష(PCR test) చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే తప్పనిసరిగా 14 రోజల పాటు హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
2. వర్క్ పర్మిట్ ఉన్న వారు, అక్కడి నివాసితులు థాయిలాండ్లోకి రావడానికి ఇప్పటికే అనుమతినిచ్చింది థాయిలాండ్ ప్రభుత్వం. దీనితో పాటు 60 రోజుల వ్యవధి గల కొత్త ‘టూరిస్ట్ వీసాల’(tourist visa)కు కూడా అన్ని దేశాల ప్రయాణికులు దరఖాస్తు చేసుకోవచ్చని థాయిలాండ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
Honeymoon కోసం ఈ ప్రదేశాలకు వెళ్లండి.. అత్యంత తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎంజాయ్ చేయండి

3. ఈ టూరిస్ట్ వీసాతో అంతర్జాతీయ సందర్శకులు 60 రోజుల వరకు థాయిలాండ్లో ఉండవచ్చని తెలిపింది. కానీ, వారు ఇక్కడికి రాగానే 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైనన్లో ఉండాల్సి ఉంటుందని పేర్కొంది.
4. 60 రోజుల కంటే ఎక్కువ కాలం థాయిలాండ్లో ఉండాలని భావించే ప్రయాణికులు ‘స్పెషల్ టూరిస్ట్ వీసా’(special tourist visa) కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. చైనా(China), ఆస్ట్రేలియా(Australia), వియత్నాం(Vietnam) వంటి దేశాల నుండి వచ్చే వారికి ఈ వీసా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ వీసాతో ఒక పర్యాటకుడు 90 రోజుల వరకు థాయిలాండ్లో ఉండటానికి అనుమతి లభిస్తుంది. అయితే, పర్యాటకుడు ఈ వీసాను గరిష్టంగా 9 నెలల వరకు పొడించుకోవచ్చు.

5. థాయిలాండ్లో అడుగుపెట్టే 72 గంటల్లోపు చేసుకున్న కరోనా టెస్ట్ రిపోర్ట్ ను అందించాల్సి ఉంటుంది. మీరు అక్కడ దిగిన తర్వాత కూడా మరోసారి పరీక్ష చేస్తారు. ఒకవేళ ఆ పరీక్షలో మీకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే, మీరు అక్కడే14 రోజుల వరకు హోమ్ క్వారెంటైన్లో ఉండాల్సి ఉంటుంది.
6. థాయిలాండ్ పర్యటనకు ముందు COVID–19 చికిత్సను కవర్ చేసే ట్రావెల్, మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవడం మర్చిపోకండి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Corona, Thailand, Tourism, Year Ender 2020

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు