TEMPERATURES HIT MINUS 48C RUSSIA CHILDREN ARE SENT HOME FROM SCHOOL NS GH
ఆ పట్టణంపై మంచు దుప్పటి.. -48C కు చేరిన చలి.. విద్యార్థులకు సెలవులు ప్రకటన..
ప్రతీకాత్మక చిత్రం
World's Coldest City Yakutsk: మంచు దుప్పట్లో కూరుకుపోయిన యాకుట్స్క్ నగరానికి సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ (viral) అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు (temperature) విపరీతంగా పడిపోవటంతో ప్రపంచంలోని అత్యంత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే యాకుట్స్క్ (Yakutsk) నగరంలో స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చేశారు.
మంచు దుప్పట్లో కూరుకుపోయిన యాకుట్స్క్ నగరానికి సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ (viral) అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు (temperature) విపరీతంగా పడిపోవటంతో ప్రపంచంలోని అత్యంత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే యాకుట్స్క్ (Yakutsk) నగరంలో స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చేశారు. దీంతో పిల్లలంతా వీధుల్లోకి వచ్చి మంచులో ఆడుకుంటూ గడుపుతున్న వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. రష్యాలోని యాకుట్స్క్ పరిస్థితి చూసిన నెటిజన్లు వీరు పాలల్లో యాంటీఫ్రీజ్ పెట్టుకోవాలని కామెంట్ చేస్తున్నారు. వామ్మో గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రతల్లో బతకటమే కష్టమంటే.. వీరు ఎలా ఆడుకుంటున్నారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్కూళ్లకు సెలవులు
వరల్డ్ కోల్డెస్ట్ సిటీగా పేరుగాంచిన యాకుట్స్క్ లో జంతువులు మాత్రం చలికి తట్టుకోలేక అల్లాడి పోతున్నాయి. యాకుట్స్క్ నగరంలోని వీధులన్నీ మంచు దుప్పట్లో కూరుకుపోయాయి. దీంతో ఇక్కడి విద్యాసంస్థలన్నీ పిల్లలకు శీతాకాలం సెలవులు ఇచ్చేసాయి. మైనస్ 42డిగ్రీల నుంచి మైనస్ 50 డిగ్రీల నమోదవుతున్న పళ్లు కొరికే చలిలో అక్కడక్కడా వింటర్ స్పోర్ట్స్ జరుగుతుండగా స్థానికులు పాల్గొంటుండడం విశేషం.
జంతువులకు ఇబ్బందులు
ఇక ఇక్కడి జంతువులు, కుక్కలు, పిల్లులు చలికి వణికిపోతుండగా, కొన్ని జంతువులు మాత్రం మంచుతో ఆడుకుంటున్నవీడియోలు నెట్లో కనిపిస్తున్నాయి. వీధి కుక్కలు, పిల్లులకు ఆహారం లేక, చలికి తలదాచుకునేందుకు షెల్టర్లు చాలక ఇబ్బందులు పడుతుండగా జంతు ప్రేమికులు ఈ వీడియోలపై తమ విచారం వ్యక్తంచేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున కుక్కలు, పిల్లులు మృత్యువాత పడుతున్నాయి. గడ్డకట్టే ఉష్ణోగ్రతలను తట్టుకోలేక నగరంలో ఎటుచూసినా అమాంతం ముడుచుకుపోతున్న జంతువులే కనిపిస్తున్నాయి. వీధుల్లో ఎక్కడ చూసినా నీలుక్కుపోతున్న జంతువులు, జంతువుల శవాలు కనిపిస్తున్నాయి. కొందరు యువకులు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి జంతువులకు (stray animals) ఆహారం ఇచ్చి, వాటిపై వస్త్రాలు కప్పుతూ వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఇక్కడ వీధి కుక్కల కోసం సరైన సంరక్షణా కేంద్రాలు ఇప్పటివరకూ ఏర్పాటు కాలేదు.
గడ్డ కట్టే ఉష్ణోగ్రతలు వద్ద
మైనస్ 48 సెల్సియస్ ల ఉష్ణోగ్రతల వద్ద గడ్డ కట్టే చలితో ప్రజా జీవనం స్థంభించిపోయింది. ఆర్కిటిక్ సర్కిల్ దక్షిణాన ఉన్న ఈ నగరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. వజ్రాలు ఎక్కువగా లభించే ప్రాంతంగా యాకుట్స్క పేరుగాంచింది. ఈ సీజన్ లో ఇక్కడ ఉదయం 10 గంటలైనా సూర్యోదయం కాకపోగా, మధ్యహ్నానికల్లా సూర్యాస్తమయం జరిగిపోతుంది. సైబీరియా తూర్పు ప్రాంతంలో ఉన్న యాకుట్స్క్ అత్యంత శీతలప్రాంతంగా రికార్డు సృష్టించింది.