Vastu Tips: ఎంత ప్రయత్నించినా జాబ్ రావడం లేదా? ఇంట్లో ఈ వాస్తు మార్పులు చేయండి..

(ప్రతీకాత్మక చిత్రం)

Vastu Tips: కొన్ని వాస్తు టిప్స్ పాటించడం ద్వారా జీవితంలో మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి కోరుకున్న కొలువు వరిస్తుందంటున్నారు వాస్తు నిపుణులు. ఆ టిప్స్​ ఏంటో పరిశీలిద్దాం.

  • Share this:
కొందరు వాస్తును కొట్టిపారేస్తూ ఉంటారు. మరికొంత మంది మాత్రం వాస్తు కూడా సైన్స్ లాంటిదేననినమ్ముతుంటారు. అందుకే, వాస్తు ప్రకారమే ఇళ్లు కడుతుంటారు.వాస్తు అనేదిమనపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. మనంపనిచేసే ప్రాంతంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేలా చేస్తుంది.వాస్తు టిప్స్ పాటిస్తే అదృష్టం కలిసొచ్చి మనరోజూవారి పనితీరు మెరుగు పడుతుంది. కొన్ని వాస్తు టిప్స్ పాటించడం ద్వారా జీవితంలో మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి కోరుకున్న కొలువు వరిస్తుందంటున్నారు వాస్తు నిపుణులు. ఆ టిప్స్​ ఏంటోపరిశీలిద్దాం.

1.మంచి ఉద్యోగం రావాలంటే
కేజీ నుంచి పీజీ పూర్తి అయ్యే వరకు ఎంతో కష్టపడి చదువుతాం. కానీ చదువు పూర్తి చేసిన తరవాత వెంటనే ఉద్యోగం రాకపోతే చాలా బాధపడిపోతూ ఉంటాం. అయితే జీవితంలో చదువుతో పాటు కెరీర్ కూడా చాలా ముఖ్యం. కోరుకున్న ఉద్యోగం లభించాలంటే కేవలం మన చదువుతోపాటు కొంచెం అదృష్టం కూడా తోడుకావాలంటున్నారు వాస్తు నిపుణులు. ప్రతి చోటా పంచభూతాలు ఉంటాయి. ప్రకృతిలో అవి మమేకమై ఉంటాయి. అలాంటి ప్రకృతికి, మనకు మధ్య బ్యాలెన్స్ చేసేదే వాస్తు. వాస్తు బాగుంటేనే కదా అదృష్టం కలసి వచ్చేది.

మెంతులు.. ప్రయోజనాలు బోలెడు.. ఎన్నో సమస్యలకు చెక్! ఎప్పుడు తినాలో తెలుసుకోండి..

2. ఏవి ఎక్కడ పెట్టాలి
మీరు పనిచేయడానికి కూర్చునేప్పుడు, మీ వెనుకవైపు గోడ ఉండేలా చూసుకోండి. ముందువైపు ఎట్టి పరిస్థితుల్లో గోడ ఉండకూడదు. ఇది అనేక అడ్డంకులు సృష్టిస్తూ ఉంటుంది. కూర్చున్న ముందుభాగం ఖాళీగా ఉంటే మంచి ఐడియాలు వస్తాయి. వెనుకవైపు పర్వతాలు, కొండలు వంటి ఫోటోలు పెట్టుకోవాలి.

3. ఫర్నిచర్ ఎలా సర్ధుకోవాలి
పనిచేసే బెంచీ, కుర్చీ సాధారణ కలపతో తయారు చేసినవి ఉండేలా చూసుకోవాలి. గుండ్రంగా ఉండే టేబుల్ వాడవద్దు. దీర్థచతురస్రాకారంలో ఉంటే బల్ల వాడుకోవాలి. దీని వల్ల పని వాతావరణం మెరుగుపడుతుంది.

Dual Flush: టాయిలెట్ల‌లో డ‌బుల్ ఫ్ల‌ష్ ఎందుకో తెలుసా.. వాటి ఉపయోగాలు  ఇవే

4. ఎటువైపు తిరిగి కూర్చోవాలి
తూర్పు వైపునకు తిరిగి కూర్చుని పని చేసుకునేలా డెస్క్ ఏర్పాటు చేసుకోవాలి. అలా కుదరకపోతే పనిచేసే డెస్క్ పైన ఓ అద్దం పెట్టుకోండి. దీని వల్ల సమీపంలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి పనితీరు మెరుగు పడుతుంది.

5. విరిగిన ఫర్నిచర్ వాడవద్దు
విరిగిన ఫర్నిచర్, మూలలు విరిగిపోయిన టేబుల్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దు. అలా ఉన్న వారు వాటిని వెంటనే రిపేరు చేయించుకోవాలి. విరిగిన ఫర్నిచర్ నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి. విరిగిన ఫర్నిచర్ వల్ల పని అసంపూర్తిగా మిలిగిపోవడం, క్రియేటివ్ ఐడియాలు రాకపోవడం జరుగుతుంది.

Kidney Stones: కిడ్నీలో రాళ్లా..? వాటిని కరిగించి బయటకు పంపే శక్తి దీనికి ఉందని తెలుసా?

6. ఎత్తుగా ఉండే కుర్చీనే వాడండి
వెనుకవైపు ఎత్తుగా ఉండే రివాల్సింగ్ కుర్చీ ఉండేలా చూసుకోండి. ఇది ఆరోగ్యానికి కూడా ముఖ్యం. ఇక ఎత్తైన, సాధారణ చెక్క స్టూల్ అయినా ఫర్వాలేదు.

7. ట్యాప్​ నుంచినీరు లీకు కానీయకండి
ఇంట్లో ట్యాపుల నుంచి నిరంతరం నీరు లీకు కాకుండా జాగ్రత్త పడండి. ఇలా నీరు పోతూ ఉంటే డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది.

Pink guava: పింక్ జామకాయ తింటున్నారా...అయితే ఇది తప్పకుండా తెలుసుకోండి

8.తూర్పువైపు తిరిగి మాట్లాడాలి
ఏవైనా ఇంటర్వ్యూలు కానీ, పనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మాట్లాడేప్పుడు తూర్పువైపు, కుదరకపోతే ఉత్తరం వైపు తిరిగి మాట్లాడాలి.

9.అదృష్టం తెచ్చే మొక్కలు పొంచుకోండి
రోజ్ మారీ, లావెండర్, స్పైడర్ ప్లాంట్ మొక్కలు ఇంట్లో పెంచుకోవాలి. వీటి వల్ల డబ్బు రాక పెరగడంతో పాటుఒత్తిడి తగ్గుతుంది.ఇంట్లో గాలిని కూడా ఈ మొక్కలు శుద్ధి చేస్తాయి. పని చేసే వాతావరణం, చదువుకునే పరిస్థితులు మెరుగుపడతాయి.

మధ్యాహ్నం కొద్దిగా నిద్ర పోతే కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయంట.. అవేంటో

10. వెలుగులు ఎలా ఉండాలి
ఇంట్లో సరైన వెలుగురు ఉండేలా చూసుకోవాలి. స్టడీ కోసం ఫ్లోర్ ల్యాంప్స్, ఎల్ఈడీ బల్బులు వాడాలి. ఇంట్లో మంచి వెలుగురు ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి అంతా మంచి జరుగుతుంది.

11.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
పనిచేసే ప్రాంతం శుభ్రంగా ఉంచుకోవాలి. పనికి రాని వస్తువులు తీసేయాలి. వస్తువులన్నీ క్రమ పద్దతిలో సర్థుకోవడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పనితీరు మెరుగుపడుతుంది. క్రియోటివ్ ఐడియాలు వస్తాయి.
Published by:Shiva Kumar Addula
First published: