భారత్‌లో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఒక సైన్స్ అనేవారు కూడా ఉన్నారు. చుట్టూ సానుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో వాస్తు సహాయపడుతుంది. సుఖ, శాంతులతో జీవించేందుకు వాస్తుశాస్త్రం దారిచూపుతుంది. వ్యవసాయ భూములు, ఫామ్ హౌస్ నిర్మాణాలు, విత్తనాలు నాటడం సహా వివిధ అంశాల్లో పాటించాల్సిన సూత్రాలను వాస్తు శాస్త్రం వెల్లడిస్తోంది. ఇందులో సైన్స్, దిశ ఆధారిత గణిత గణాంకాలు ఉంటాయి. వీటిని ఆచరించడం వల్ల వ్యవసాయంలో పంటల దిగుబడిని పెంచుకోవచ్చు.
వ్యవసాయ భూమిని ఎంచుకునే ముందు ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలి? బోరుబావి ఎటువైపు తవ్వించాలి? భూమి కొలతలు ఎలా ఉండాలి? చెట్లు ఏ వైపు నాటాలి? కూలీలకు నివాసాలు ఎటువైపు నిర్మించాలి? వంటి వివరాలను వాస్తు శాస్త్రం వెల్లడించింది. ఏ వైపు ఎలాంటి నిర్మాణాలు చేయాలి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. వంటి అంశాలను వాస్తుశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. వాస్తు దోషాలు ఉంటే కలిగే దుష్ఫలితాలను కూడా ఈ శాస్త్రం వివరిస్తోంది. వ్యవసాయ భూమి ఉత్పాదకత పెంచేందుకు వాస్తు శాస్త్రం సూచించిన కొన్ని చిట్కాలు చూద్దాం..
Body Pains in Winter: చలికాలంలో బాడీ పెయిన్స్ సమస్య వేధిస్తోందా?
* వ్యవసాయ భూమి వాలు
వాస్తుశాస్త్రం ప్రకారం వ్యవసాయ భూమి సమతలంగా ఉండాలి. ఎత్తుపల్లాలు ఉండకూడదు. ఒకవేళ భూమి వాలుగా ఉన్నా అది ఉత్తరం లేదా తూర్పు వైపునకు ఉండాలి. భూమి వాలు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం, పశ్చిమం వైపునకు ఉండకూడదు. మంచి దిగుబడులు రావాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఒక వేళ వ్యవసాయ భూమి పశ్చిమం, దక్షిణానికి వాలుగా ఉంటే ఆ భూమిలో వచ్చే ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువవుతుంది. వ్యవసాయభూమికి దక్షిణం వైపు దారి లేకుండా చూసుకోవాలి.
* కొలతలు ఎలా ఉండాలి?
వ్యవసాయ భూమి చతురస్ర, దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. దక్షిణం వైపు, పశ్చిమం వైపు కోత ఉండకూడదు.
మీకు తెలుసా... ? మెంతులతోనే మీ జుట్టు, చర్మం రెండు అందంగా చేసుకోవచ్చు..
* చెట్లు ఎటువైపు ఉండాలి
దక్షిణ, పశ్చిమ దిక్కుల్లో భారీగా పెరిగే మొక్కలను నాటాలి. పంట దిగుబడులు పెంచడానికి ఇది దోహదపడుతుంది.
* బోరు లేదా బావి ఎక్కడ ఉండాలి?
ఈశాన్యంలో బోరు, బావులు ఏర్పాటు చేసుకోవాలి. బోరు బావులను ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో, వాయువ్యంలో తవ్వించకూడదు. దీని వల్ల వ్యవసాయంలో భారీ నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.
* కూలీల నివాసాలు
వ్యవసాయ కూలీలకు పశ్చిమ లేదా నైరుతి దిశలో మాత్రమే నివాసాలు ఏర్పాటు చేయాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.
* ప్రహరీగోడ
వ్యవసాయ భూమికి నైరుతి దిశలో పది నుంచి 20 అడుగుల పొడవుతో 6 అడుగుల ఎత్తు ఉండేలా గోడ నిర్మించాలి. దీని వల్ల వ్యవసాయంలో ఉత్పాదకత పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర లేదా తూర్పు దిశల్లో గోడ నిర్మించకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculuture, Life Style, Lifestyle, Vastu, Vastu Tips