• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • TELUGU LIFESTYLE NEWS DO YOU WANT SMARTER KIDS TEACH MUSIC NOT CODING SAYS MIT SK GH

Smart Kids: మీ పిల్లల మేధా శక్తి పెరగాలా? కంప్యూటర్ కోడింగ్ కాదు.. ఇది నేర్పించండి..

Smart Kids: మీ పిల్లల మేధా శక్తి పెరగాలా? కంప్యూటర్ కోడింగ్ కాదు.. ఇది నేర్పించండి..

ప్రతీకాత్మక చిత్రం

కంప్యూట‌ర్ కోడ్‌ అనేది ఒక భాష లాంటిది కాదు. అలాగే గ‌ణితం, త‌ర్కం లాంటి ప్రత్యేకమైన సబ్జెక్ట్ కూడా కాదు. అందువల్ల కొన్ని విషయాలకు సంబంధించి, కోడింగ్ నేర్చుకోవడం పెద్దగా ఉపయోగకరంగా ఉండదు

  • Share this:
ప్ర‌పంచం మొత్తం టెక్నాలజీ వెనుక పరుగెత్తుతున్న తరుణంలో.. నేటి తరం విద్యార్థులు కోడింగ్ నేర్చుకోక త‌ప్పని ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అవసరాలకు తగ్గట్లు ఈ మ‌ధ్య ప్రాథ‌మిక విద్యా ద‌శ నుంచే కంప్యూట‌ర్ కోడింగ్ క్లాసుల‌ను ప్ర‌త్యేకంగా నేర్పించ‌డంపై టీచర్లు దృష్టి పెడుతున్నారు. దీని వల్ల విద్యార్థుల మెదడు పనితీరు, విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. అయితే పిల్లల మెదడు అభివృద్ధికి కోడింగ్‌కు బదులుగా సంగీతాన్ని నేర్పించాలంటున్నారు మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (MIT) పరిశోధకులు. ఈ సంస్థ గత డిసెంబ‌ర్లో నిర్వ‌హించిన ఒక అధ్య‌య‌నం ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు.

పిల్ల‌ల‌కు చిన్న‌త‌నం నుంచే కోడింగ్ నేర్పించ‌డం గురించి కొన్ని విష‌యాలను ఎమ్‌ఐటీ రిసెర్చ్ వెల్ల‌డించింది. కంప్యూట‌ర్ కోడ్‌ అనేది ఒక భాష లాంటిది కాదు. అలాగే గ‌ణితం, త‌ర్కం లాంటి ప్రత్యేకమైన సబ్జెక్ట్ కూడా కాదు. అందువల్ల కొన్ని విషయాలకు సంబంధించి, కోడింగ్ నేర్చుకోవడం పెద్దగా ఉపయోగకరంగా ఉండదు. అందువల్ల ఇత‌రాత్రా నైపుణ్యాలు పెర‌గాల‌న్నా, మెద‌డు శ‌క్తి, సామర్థ్యాలు, పనితీరు మెరుగుప‌డాలన్నా పిల్ల‌ల‌కు సంగీత వ్యాయిద్యాల‌ను నేర్పించాల‌ని ఎంఐటీ పరిశోధకులు సిఫారసు చేస్తున్నారు.

ఈ అధ్య‌య‌నం ఫలితాలను ది జ‌ర్న‌ల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో ప్ర‌చురించారు. ఈ ప‌రిశోధ‌నలో భాగంగా మ్యుజిషయన్లు (మ్యూజికల్ గ్రూప్), మ్యుజిషియన్లు కాని వారి (నాన్ మ్యూజికల్ గ్రూప్) మెదళ్లను స్కాన్ చేసి పోల్చారు. ఇందులోని ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే, సంగీత‌కారుల మెద‌డు సంగీత‌కారులు కాని వారి మెద‌డు కంటే నిర్మాణాత్మ‌కంగా, క్రియాత్మ‌కంగా క‌నెక్ట్ అయి ఉంద‌ని తెలిసింది.

ముఖ్యంగా మెద‌డులో మాట్లాడ‌టానికి, శబ్దాలు వినడానికి సంబంధించిన ప్రాంతంలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయని గుర్తించారు. జ్ఞాప‌క‌శ‌క్తి, వ‌ర్కింగ్ మెమోరీ, కార్య‌నిర్వాహ‌క విధుల వంటి కాగ్నిటివ్ విధులను నియంత్రించే భాగాలపై సంగీతం ప్రభావం కనిపిస్తుందని వెల్లడించారు. పిల్ల‌లు వాయిద్యాన్ని వాయించ‌డం ఆపేసిన‌ప్ప‌టికీ మెదడు ప‌నిత‌నం మాత్రం అలాగే ఉంటుందని తెలిపారు. అందువల్ల మీ పిల్ల‌లు తెలివిగ‌ల‌వారు కావాలంటే కోడింగ్ నేర్పించే బ‌దులు వారికి ఏదైనా సంగీత వాయిద్యాన్ని నేర్పాలని, లేదంటే స్కూల్‌ల్లో మ్యూజిక్ ఎడ్యుకేష‌న్ నేర్పించాలని ఈ అధ్య‌య‌నం నిర్వహించిన ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు