తెలుగు అక్షరాలను పలికితే ఎక్సర్‌సైజ్ చేసినట్లే.. పరిశోధనలో తేలిన నిజం..

ప్రతీఒక్కరూ ఇంగ్లీష్ భాషపై ఇష్టంతో ఆ లాంగ్వేజ్ వెంట పరుగులు పెడుతున్నారు. కానీ, మన భాషలోని పదాలను వాడితే వర్కౌట్ చేసినన్నీ ఉపయోగాలున్నాయని అంటున్నారు ఆరోగ్యనిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Amala Ravula | news18-telugu
Updated: March 2, 2019, 12:21 PM IST
తెలుగు అక్షరాలను పలికితే ఎక్సర్‌సైజ్ చేసినట్లే.. పరిశోధనలో తేలిన నిజం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తేనెలొలుకు తెలుగు, తేట తేట తెలుగు, తెలుగు వెలుగు ఈ మాటలన్నీ రాను రాను కరువయ్యేలా ఉన్నాయి. ప్రతీఒక్కరూ ఇంగ్లీష్ బాట పడుతున్న వేళ తెలుగు భాష గొప్పదనాన్ని ప్రతీఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
తెలుగు అక్షరాలను పలికితే ఆ భాషకి అందమే కాదు.. మన శరీరంలోని ముఖ్యమైన కండరాలు కూడా కదులుతాయి. కావాలంటే మీరూ పరీక్షించుకోండని చెబుతున్నారు నిపుణులు.
క, ఖ, గ, ఘ అనే అక్షరాలను పలికినప్పుడు పొట్ట కండరాలు కదులుతాయి..

ఇక చ, ఛ, జ, ఝ అక్షరాలను ఉచ్ఛరించేటప్పుడు మన ఛాతీ భాగం కదులుతుంది.
ట, ఠ, డ, ఢలను పలికేటప్పుడు నాలుక కదిలి ఎక్సర్‌సైజ్ అవుతుంది.
ప, ఫ, బ, భలను పలికినప్పుడు పెదాల కండరాలు కదులుతాయి.


య, ర, ల, వలని పలికినప్పుడు దవడ, ముఖ కండరాలు కదులుతాయి.
Loading...
కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.. తెలుగు భాష మన గొప్పతనమే కాదు.. ఆరోగ్యం కూడా..
తెలుగుభాషని గౌరవించడం ఇప్పటికైనా నేర్చుకుని ఇంగ్లీష్ పోకడలను తగ్గించి.. తెలుగుకి తగిన గౌరవాన్నిద్దాం..
కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు తెలుగుభాషను పలుకుతూ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ తమ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్లు చెబుతున్నారు.. ఈ విధమైన వీడియోలు నెట్టింట్లో చాలానే ఉన్నాయి... మీరూ ఓ లుక్కేయండి..

ఇవికూడా చదవండి..

#Alert: సిద్ధం కండి.. మార్చిలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీ


 

#ICET: ఐసెట్ 2019 షెడ్యూల్ విడుదల..
First published: March 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...