• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • TELUGU HEALTH TIPS KNOW 5 BEST BRAIN BOOSTING FOOD ITEMS SK GH

Brain health: మెదడు పనితీరును మెరుగుపరిచే 5 అద్భుతమైన ఆహార పదార్థాలు

Brain health: మెదడు పనితీరును మెరుగుపరిచే 5 అద్భుతమైన ఆహార పదార్థాలు

ప్రతీకాత్మక చిత్రం

పెద్దవాళ్లు కూడా పోషకాహార లోపం వల్ల మెదడు సంబంధ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇలాంటి ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కొన్ని ఆహార పదార్థాలు కృషి చేస్తాయని పరిశోధనల్లో తేలింది.

  • Share this:
మనం తీసుకునే ఆహారంతో కొన్ని రకాల అనారోగ్యాలను నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అన్ని రకాల పోషకాలుండే సమతులాహారం తీసుకోవడం వల్ల శారీరక, మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చు. చాలా విరామం తరువాత ఇప్పుడిప్పుడే విద్యా సంస్థలు ప్రారంభమవుతున్నాయి. దీంతో చదువులు, పరీక్షల కారణంగా పిల్లలు ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. పెద్దవాళ్లు కూడా పోషకాహార లోపం వల్ల మెదడు సంబంధ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇలాంటి ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కొన్ని ఆహార పదార్థాలు కృషి చేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఇవి జ్ఞాపకశక్తిని సైతం మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరుపై ప్రభావం చూపే ఈ ఐదు ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

వేరుశనగ:
వేరుశెనగల్లో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్ ఇ, రెస్వెరాట్రోల్ వంటి పోషకాలు, ఖనిజాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది.

బ్రకోలీ:
బ్రకోలీలో విటమిన్ సి, ఫ్లవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతాయి. దీంట్లో ఉండే గ్లూకోసైనోలేట్స్ అనే సమ్మేళనం, శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. బ్రకోలీలో కెలొరీలు తక్కువగా, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

నట్స్, సీడ్స్:
జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్ వంటి గింజలు, విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని (ఆక్సిడేటివ్ స్ట్రెస్) నిరోధిస్తుంది. వివిధ రకాల గింజలు, విత్తనాలను రోజూ తినడం వల్ల మేధోపరమైన సమస్యలకు దూరంగా ఉండవచ్చని అధ్యయనాల్లో తెలిసింది.

అవకాడోలు:
అవకాడోను సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. ఇవి ఎన్నో రకాల పోషకాలకు వనరులుగా ఉంటాయి. వీటిల్లో ఉండే అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్‌ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇవి మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతోపాటు జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి. అవకాడోలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మెదడు పనితీరులో లోపాలు ఎదురుకావని నిపుణులు చెబుతున్నారు.

బెర్రీస్:
నేరుడు పండు, రేగుపండు క్యాన్‌బెర్రీ, స్ట్రాబెర్రీ వంటి వివిధ రకాల బెర్రీ ఫ్రూట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో యాంథోసైనిన్, కెఫిక్ యాసిడ్, కేటెచిన్, క్వెరెసెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటికి మెదడు పనితీరును ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. ఈ పోషకాలు మెదడులో ఏర్పడే వాపును, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బెర్రీ పండ్లను రోజూ తినడం వల్ల మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడుతుందని అధ్యయనాల్లో కనుగొన్నారు. ఇవి అన్ని వయసుల వారిలోనూ జ్ఞాపకశక్తిని, లెర్నింగ్ స్కిల్స్‌ను మెరుగు పరుస్తూ మేధోపరమైన సమస్యలను నివారిస్తాయి.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు