హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Weekend Story: ఈ వీకెండ్ లో విక్రమ-బేతాళ అద్భుతమైన కథను మీ పిల్లలకు చెప్పండి..

Weekend Story: ఈ వీకెండ్ లో విక్రమ-బేతాళ అద్భుతమైన కథను మీ పిల్లలకు చెప్పండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Weekend Story: సాధారణంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా ఒక వ్యక్తి మనకు మద్దతు ఇవ్వనప్పుడు అతను చెడ్డవాడు అని అంటాము.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram

Weekend Story: ఇటీవల పిల్లలకు కథలు (Stories) వినే అలవాటు అసలే లేదు. తల్లిదండ్రులకు (Parents)కూడా చెప్పే అలవాటు లేదు. అయితే మొదట్లో తాత, అమ్మమ్మ లేదా తల్లిదండ్రులు రాత్రి పడుకునే ముందు పిల్లలకు అద్భుతమైన కథలు చెప్పేవారు. ఇప్పుడు సమయానికి కొరత ఏర్పడింది. కానీ, మీరు వారాంతంలో పిల్లలకు ఒక కథ చెప్పవచ్చు. అప్పుడు, పిల్లలు (Children) మన చరిత్రతో జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. ఏ కథ చెప్పాలో మీకు గందరగోళంగా ఉంటే మేము సహాయం చేస్తాము. ప్రతి వారాంతంలో మేము మీకు కొత్త కథను అందిస్తాము. పిల్లలకు చెప్పండి,వారికి అనేక ఆలోచనలను నేర్పించవచ్చు.

సాధారణంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా ఒక వ్యక్తి మనకు మద్దతు ఇవ్వనప్పుడు అతను చెడ్డవాడు అని అంటాము. ఇలా చెప్పడం వెనుక కూడా ఓ కథ ఉంది. అదే, విక్రమ-బేతాళ. రాజు విక్రమాదిత్యను అడవికి వెళ్ళే దారిలో ఒక మృగం వెంబడించి కథ చెబుతుంది. దానికి సంబంధించిన వివిధ ప్రశ్నలు వేసి సమాధానం చెప్పకపోతే తల పగలగొడతానని బెదిరిస్తాడు. ఆ సమయంలో బేతాళుడు చెప్పిన అనేక కథలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇది జీవితానికి అనేక నీతులను తెలియజేస్తుంది. ఇక్కడ మనం జీవితంలోని అత్యంత ముఖ్యమైన సూత్రాలలో ఒకదాని కథను అందించాము.

ఇది కూడా చదవండి:  తక్కువ సమయంలో పొడవాటి జుట్టు పొందడానికి 5 సాధారణ చిట్కాలు..

ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉన్నాడు. అతను చాలా విధేయుడు. ఆయనపై ప్రజలకు చాలా నమ్మకం ఉండేది. ఈ పెద్దాయన ఇంటి పక్కన ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు, ఆ వ్యాపారి వచ్చి నేను పని కోసం పట్నం వెళ్తున్నాను. కాబట్టి మీరు నా సంపదను భద్రంగా ఉంచుతారా? అని అడుగుతాడు. అందుకు అంగీకరించిన ముసలివాడు ఆ సంపదను దేవుడి సాక్షిగా ఉంచుతానని వాగ్దానం చేస్తాడు.

అలాగే కొంత కాలం తర్వాత వృద్ధుడు తన కొడుక్కి సంపదను చూసుకునే బాధ్యతను అప్పగిస్తాడు. కానీ కొడుకు, ఆ సంపదను ఖర్చు చేయడం ప్రారంభిస్తాడు. దీనిపై పట్టణవాసులు వృద్ధుడికి ఫిర్యాదు చేస్తే.. అదంతా అబద్ధమని కొడుకు నోరు మూయించాడు. కానీ, ఖర్చు చేస్తూనే ఉన్నాడు.

ఇలా సమయం గడిచిపోయింది. ఒకసారి వ్యాపారి తిరిగి వచ్చి సంపదను తిరిగి అడిగాడు. వృద్ధుడు కొడుక్కి ఫోన్ చేసి తిరిగి ఇవ్వమని అడుగుతాడు. కానీ కొడుకు మాత్రం పావు వంతు మాత్రమే ఇచ్చాడు అంతే. దీంతో కోపోద్రిక్తుడైన ధనవంతుడు, వృద్ధుడు మోసం చేస్తున్నాడని రాజుకు ఫిర్యాదు చేస్తాడు.

ఇది కూడా చదవండి: భారతదేశంలో ప్రసిద్ధ వైన్ ఉత్పత్తి చేసే ద్రాక్ష తోటలు - సందర్శించడం మర్చిపోవద్దు!

ఈ ఫిర్యాదుపై రాజు ఆరా తీస్తే.. తన కొడుకు తప్పు చేశాడని వృద్ధుడు ఒప్పుకున్నాడు. అప్పుడు రాజు కొడుకుని కొట్టి జైల్లో పడేస్తాడు. కానీ, వ్యాపారి వృద్ధుడిని శిక్షించమని అడుగుతాడు. దీనికి కారణం ఏంటని రాజు అడగ్గా, నేను ఆ వృద్ధునికి సంపదను చూసుకోమని చెప్పాను, కాని ఆ ముసలాయన ఆ పని చేయక తన కొడుక్కి ఇచ్చాడు. నేను అతని వల్ల బాధపడుతున్నా. కాబట్టి వృద్ధుడు నేరస్థుడు. ఇది రాజుకు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ కథ చెప్పిన తర్వాత బేతాళుడు విక్రమాదిత్యుడిని రాజు నిర్ణయం ఏమిటని అడుగుతాడు. విక్రమాదిత్యుడికి, వృద్ధుడు నేరుగా సంపదను దొంగిలించనప్పటికీ, దానిని రక్షించే బాధ్యత అతనిపై ఉంది. కుమారుడిపై ప్రజలు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. కాబట్టి వృద్ధుడే దోషి. అతను శిక్షకు అర్హుడని చెప్పారు.

నీతి: జీవితంలో బాధ్యత నుండి తప్పించుకోలేము. మన కర్తవ్యాన్ని మనమే నిర్వర్తించాలి అన్నది దీని తత్వం. మన నిర్లక్ష్యానికి మరెవరూ బాధ్యులు కారు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )

Published by:Renuka Godugu
First published:

Tags: Parents

ఉత్తమ కథలు