#PoliceEvents: పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ డేట్ ఫిక్స్

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ తేదీలను తెలంగాణ పోలీస్ నియామక బోర్డు వెల్లడించింది.

Amala Ravula | news18-telugu
Updated: February 1, 2019, 7:54 AM IST
#PoliceEvents: పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ డేట్ ఫిక్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎస్సై, కానిస్టేబుల్ ఫ్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 11 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈవెంట్లకి సంబంధించిన హాల్‌టికెట్లు అభ్యర్థులు ఫిబ్రవరి 5 నుంచి 9వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్వపు జిల్లాల ప్రాతిపదికనే ఫిజికల్ ఈవెంట్ల కోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అభ్యర్థులకు పీఈటీ పరీక్షల కోసం హైదరాబాద్‌లో మూడు కేంద్రాలను మిగతా జిల్లా అభ్యర్థులకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్ల కోసం ఏర్పాటు చేస్తున్నారు.

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలుంటే సంబంధిత ఫోన్ నెంబర్లలో లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని ఆయన కోరారు. ఫోన్ నెంబర్లు: 93937 11110, 93910 05006, ఈమెయిల్: ఈమెయిల్: support@tslprb.in
రాష్ట్రంలో 16,925 కానిస్టేబుల్, 1217 ఎస్సై పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమినరీలో ఎగ్జామ్‌లో 3,77,770మంది అర్హత సాధించారు.
First published: February 1, 2019, 7:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading