HealthTips: దంతాలను తెల్లగా చేసే ఆహార పదార్థాలు ఇవే..

అందమైన దంతాలు.. మన నవ్వుని ఇంకా అందంగా కనిపించేలా చేస్తాయి. అలాంటి దంతాలు తెల్లగా మిలమిల మెరవాలంటే ఇలా చేయండి.

news18-telugu
Updated: June 9, 2019, 5:07 PM IST
HealthTips: దంతాలను తెల్లగా చేసే ఆహార పదార్థాలు ఇవే..
అల్జీమర్స్ బాధితుల మెదళ్లలో ఉండే పి.జింజివలిస్ బ్యాక్టీరియా చిగుళ్ల జబ్బులోనూ ఉంటుందని గుర్తించిన నిపుణులు.
  • Share this:
ఎదుటివారు మనల్ని చూడగానే ఆకర్షించేది నవ్వు.. పళ్లవరుస అందంగా ఉంటే నవ్వు ఇంకా అందంగా ఉంటుంది. అయితే, తినే ఆహారం మన పళ్లను ఇంకా అందంగా కనిపించేలా చేస్తుంది. ఆ ఆహారం ఏంటంటే.. ఆపిల్స్, బెర్రీస్, క్యారెట్లు తినడం వల్ల దంతాల పసుపు రంగు పోయి తెల్లగా మారతాయి... ఈ పండ్లలోని కొన్ని విటమిన్స్ పంటిపై ఉండే పొరను క్లీన్ చేసి చక్కగా తెల్లగా మారతాయి.

అరటిపండు తొక్కని పండ్లపై ఒకనిమిషం పాటు రుద్దితే అందులోని పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ మలినాలను తొలగించి పళ్లని తెల్లగా మారిస్తాయి. అదే విధంగా వంటసోడా కూడా పళ్లని తెల్లగా మారుస్తాయి. నిమ్మతొక్కని వంటసోడాకి అద్ది రాయడం వల్ల పళ్లు మెరుస్తాయి.
క్యారెట్లు: తాజా క్యారెట్లని కొరికి తింటే దంతాల మీద బ్యాక్టీరియా తొలిగిపోయి తెల్లగా మారడమే కాకాకుండా చిగుళ్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి.

ఇప్పటివరకూ ఏమేం తీసుకోవాలో తెలుసుకున్నాం.. అయితే.. పళ్లు అందంగా ఉండాలంటే వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ దంతాలు పసుపురంగులోకి మారతాయి. అదేవిధంగా, మద్యం, సిగరెట్లు కూడా దంతాలను పాడు చేస్తాయి. ఎక్కువగా ఈ అలవాటు ఉన్నవారు వాటిని తగ్గిస్తే దంతాలు ఆరోగ్యంగా అందంగా మారతాయి.



ఇవి కూడా చదవండి..

గుడిలో నివేదన సమయంలో దేవుడిని చూడకుండా పరదా ఎందుకు వేస్తారంటే..వామ్మో.. పెరుగుతున్న స్వైన్ ఫ్లూ.. ఈ లక్షణాలుంటే జాగ్రత్తపడండి..
First published: June 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు