మెదడుకు 90 శాతానికి పైగా స్టిములేషన్, పోషకాహారం వెన్నెముక కదలిక ద్వారా ఉత్పత్తి అవుతుంది. మెదడుపై పరిశోధనకు నోబెల్ బహుమతిని గెలుచుకున్న న్యూరో సైంటిస్ట్ డాక్టర్ రోజర్ స్పెర్రీ ఈ విషయం చెబుతున్నారు. మన శరీరం గురించి తెలుసుకోవడం, ప్రతి కదలిక మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పురాతన గ్రంథాలు తెలియజేయడం ఆసక్తికరంగా ఉంటుంది. అయితే యోగా అంటే మనస్సు, శరీరం, ఆత్మను ఒకచోటకు తీసుకు వచ్చి సాధన చేయడం. ఇది శరీరాలను శారీరకంగా, మానసికంగా పునరుజ్జీవింప చేస్తుంది. అయితే యోగాను గణితంతో లింక్ చేయవచ్చు. మనస్సు, శరీరం మధ్య సమతుల్యతను సృష్టించడానికి ఇది వారధిలా పనిచేస్తుంది.
యోగా కదలికలలో మ్యాథమెటిక్స్, జామెట్రీ ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అనేది శరీరం సంపూర్ణ కదలికలను నిర్వహించడానికి, ప్రతి భంగిమలో నియంత్రణను పొందేందుకు ఉపయోగపడే సాధనం. ఈ ప్రత్యేక కనెక్షన్ యోగాను ఉపయోగించి పిల్లలకు గణితాన్ని బోధించే అద్భుతమైన అవకాశాన్ని కూడా అందిస్తుంది. యోగా సహాయంతో, భంగిమల్లో జామెట్రీ కోణాలు, ఆకారాలు, విధులు, పరివర్తనలను బోధించవచ్చు. ఇది టీచింగ్ ప్రాసెస్‌ను వినోదభరితంగా మారుస్తుంది.
యోగాలో 84 లక్షల ఆసనాలు ఉంటాయి, ప్రతి ఒక్కటి సరైన అమరిక, శరీరం స్థానంపై దృష్టి పెడుతుంది. యోగా ఆసనాలను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి కొన్ని మ్యాథమెటిక్స్ అంశాలను పరిశీలిద్దాం.
బాడీ లీనియారిటీ(Body Linearity):
యోగాలో నొల్చొని ఉన్న భంగిమలు, బ్యాలెన్సింగ్ భంగిమలు శరీరం లేదా శరీర భాగాలు స్ట్రైట్ లైన్‌లో ఉండాలని సూచిస్తాయి. దీని ద్వారా స్ట్రైట్ లైన్స్, లీనియారిటీని వివరించవచ్చు. ఉదాహరణకు అధో ముఖ స్వనాసనం (డౌన్‌వర్డ్ డాగ్ పోజ్) చేసినప్పుడు మోకాళ్లను వంచలేము, కాళ్లు కచ్చితంగా లాక్ అయి ఉంటాయి. శరీర పైభాగం నేలకి వాలుతున్నందున వెనుక వైపు, చేతులు ఒకే ప్లేన్‌లో ఉంటాయి. ఇంకా తడాసానం (ది మౌంటైన్ పోజ్)లో, మొత్తం శరీరం తల నుంచి మడమల వరకు స్ట్రైట్ లైన్‌లో ఉండాలి. అలాగే ధ్యాన భంగిమలో లోపల లేదా వెలుపల ఎటువంటి హంచ్ లేకుండా వెనుక భాగాన్ని నిటారుగా ఉంచడం అవసరం.
అక్యూట్, రైట్ యాంగిల్స్(Acute And Right Angles):
సేతు బంధాసన లేదా వంతెన భంగిమ(బ్రిడ్జ్‌పోజ్)లో, మోకాళ్లు ముడుచుకొని ఉంటాయి. పాదాలు కటి నుంచి 10-12 అంగుళాలు, మోకాలు, చీలమండలు స్ట్రైట్ లైన్లో ఉంటాయి. ఇక్కడ ఛాతీ, మెడ, వెన్నెముకకు ఉపశమనం కలిగించడానికి, ఊపిరితిత్తులను తెరవడానికి భంగిమను సక్రమంగా వేయడానికి యాంగిల్ అవసరం.
యాంగిల్ కొంచెం ఎక్కువ లేదా తక్కువ ఉంటే, ఈ శరీర భాగాలపై ఆసనం ప్రభావం ఉండదు. అందువల్ల ఆసనాలు వేసేటప్పుడు రైట్ యాంగిల్స్ చాలా ముఖ్యం. ప్రత్యేకించి సేతు బంధాసనం లేదా మార్జర్యాసనం (క్యాట్ స్ట్రెచ్ పోజ్) వంటి భంగిమలలో, వంగిన కాలు మధ్య కోణం 90 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
ట్రయాంగిల్స్, ఎక్స్‌టెండెడ్ యాంగిల్స్(Triangles And Extended Angles):
ఉత్తిత త్రికోణసనా (ఎక్స్‌టెండెడ్ ట్రయాంగిల్ పోజ్) అంటే ట్రయాంగిల్ సృష్టించడం. అధో ముఖలో, శరీరం ఒక ట్రయాంగిల్‌సృష్టిస్తుంది. ఉత్తిత పార్శ్వకోనసనా (ఎక్స్‌టెండెడ్ సైడ్ యాంగిల్ పోజ్), విరాభద్రసనం II వంటి ఆసనాలలో శరీర బరువును మోసే కాలు బ్యాలెన్స్ సాధించడానికి అబ్‌ట్యూస్ యాంగిల్స్(Obtuse Angles)ను విస్తరిస్తుంది.
కాన్కేవ్స్, కర్వ్స్, హంచెస్ (Concaves, Curves, Hunches):
కడుపు, పెల్విక్ చుట్టూ U లేదా C సృష్టించే ఆసనాలు అర్ధ వృత్తాలను పోలి ఉంటాయి. దీని కోసం మర్జర్యాసనం పరిగణించవచ్చు, ఇది తొడలు, చేతులు పర్పెండికులర్‌గా ఉండేలా వెనుక, భుజాలను సాగదీసి క్రంచ్ చేస్తుంది. క్రెసెంట్(చంద్రవంఖ భంగిమలో)లో చూడవచ్చు.
బ్రీతింగ్ కౌంట్స్:
దృష్టిని పెంచడానికి, శక్తిని స్థిరీకరించడానికి శ్వాసపై నియంత్రణ గొప్ప అభ్యాసం. యోగాలో శ్వాస వ్యాయామాలు నిష్పత్తులు, గణనలలో జరుగుతాయి. ఉదాహరణకు 5 కౌంట్స్ వరకు పీల్చడం, 10 వరకు ఊపిరి నిలిపి ఉంచడం, తర్వాత 15 కౌంట్స్ వరకు ఊపిరి పీల్చుకోవడం ఉంటాయి. యోగాలో శ్వాస నిజమైన రూపం రేషియో ఆఫ్ ఈక్వల్ లెంత్ లేదా ఉచ్ఛ్వాస నిడివిని శ్వాస పీల్చే నిడివి కంటే ఎక్కువగా ఉంచడం. ఊపిరి పీల్చుకునే కౌంట్ ఉచ్ఛ్వాస కంటే ఎక్కువగా ఉంటే, శరీరం ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ని వదిలించుకోవడం లేదని అర్థం.
ఇలా యోగాలోని ప్రతి భంగిమ, ఆసనం మ్యాథమెటిక్స్‌తో ముడిపడి ఉంటుంది. యోగాను, మ్యాథమెటిక్స్‌ను వినోదభరితంగా పిల్లలకు నేర్పించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Life Style, Maths, Yoga, Yoga day 2022