Home /News /life-style /

Mexican chicken fajita: చికెన్ ఫాజితాని.. వేడివేడి టోర్టిల్లస్తో తింటే టేస్టీగా ఉంటుంది..

Mexican chicken fajita: చికెన్ ఫాజితాని.. వేడివేడి టోర్టిల్లస్తో తింటే టేస్టీగా ఉంటుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మెక్సికన్ ఫాజిటాస్ ను  (Mexican fajitas) ను సులభంగా.. కొన్ని టిప్స్ ద్వారా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

మీకు ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేయాలని ఆరాటపడతారు. అయితే, త్వరగా రుచికరమైన ఆహారాన్ని వండుకోవాలనుకుంటున్నారా? ఈసారికి మెక్సికన్ ఫాజిటాస్ ను  (Mexican chicken fajitas) ప్రయత్నించడి. కొన్ని టిప్స్ ద్వారా సులభంగా దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు..
చికెన్ బ్రెస్ట్ పీస్- 450 గ్రాములు
లెమన్ జ్యుస్ -1/4 కప్
జీలకర్ర పొడి- 2 టీస్పూన్స్
ఉల్లిపాయలు-3
ఎల్లో పెప్పర్ -1
కోషర్ సాల్ట్- తగినంత
ఎక్స్ ట్రా వర్జిన్ ఆయిల్-1/2
చిల్లీ ఫ్లేక్స్-1 టీ స్పూన్
రెడ్ బెల్ పెప్పర్- తగినంత
క్యాప్సికం గ్రీన్-1

ఇది కూడా చదవండి: వంట చేసేటప్పుడు హిమాలయన్ వెల్లుల్లి రెబ్బలు 2 వేసుకుంటే.. ఇన్ని లాభాలు..


హిమాలయన్ వెల్లుల్లిగా పిలిచే ఈ వెల్లుల్లి


చికెన్ మ్యారినేషన్..
ఈ రెసిపీ తయారీకి ముందుగా చికెన్ (chicken) ను బాగా కడగాలి. ఆ తర్వాత అందులో ఉన్న నీటిని తొలగించాలి. ఇప్పుడు పెద్ద ట్రేని తీసుకుని అందులో ఆయిల్ వేయాలి. ఆ తర్వాత లెమన్ జ్యుస్, రెడ్ చిల్లీ ఫ్లెక్స్ లేదా రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు వేసి కలిపి.. దీన్ని చికెన్ కి 30 నిమిషాలపాటు మ్యారినేట్ చేయాలి.

తయారీ విధానం..
మిగిలిన కూరగాయలను కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని వేడయ్యాక అందులో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ బ్రెస్ట్ను వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరోవైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని వెగ్గీస్ వేసుకోవాలి.

ఇది కూడా చదవండి:  బరువు తగ్గించే 5 రకాల బ్రహ్మాండమైన 'టీ' లు.. అస్సలు వదిలిపెట్టరు..


ఇప్పుడు ఈ వెగ్గీస్ను టాస్ చేసుకోవాలి. దీనికి ఉప్పు, పెప్పర్ చికెన్కు కలిపి 3-4 నిమిషాలు టాస్ చేసుకుంటే చికెన్ ఫాజితా రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడి టోర్టిల్లాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
Published by:Renuka Godugu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు