Maida Flour: మైదా పిండి అనేక ఆరోగ్య సమస్యలు కారణమని మీకు తెలుసా ?

ప్రతీకాత్మక చిత్రం

Maida Flour: గోధుమ పిండి వ్యర్థాల్లో ప్రమాదకర రసాయనాలు (కెమికల్స్) కలిపి రిఫైన్డ్ చేయడం ద్వారా... మైదాపిండి తయారవుతుంది. ఇందులో పోషకాలు, ఫైబర్, విటమిన్లు ఏవీ ఉండవు.

 • Share this:
  మైదా పిండి చూడటానికి చాలా బాగుంటుంది. స్మూత్‌గా ఉంటుంది. తినేటప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా మైదాతో వంటలు వేగంగా అయిపోతాయి. అందుకే చాలా మంది దాన్ని వాడుతుంటారు. కానీ మైదాతో ఎంత ప్రమాదమో తెలిస్తే... కచ్చితంగా దాన్ని దూరం పెడతారు. బ్రెడ్,(Bread) పిజ్జా, పాస్తా, కేక్స్, కుకీస్, మఫ్పిన్స్, డోనట్స్, న్యూడుల్స్, బర్గర్స్... వీటి తయారీలో మైదా కలుపుతారని తెలుసా మీకు. జస్ట్ 2 మినిట్స్‌లో పూర్తయిపోతుందనే న్యూడుల్స్ వంటకాన్ని చాలా మంది తల్లులు... తమ పిల్లలకు చేసి పెడుతుంటారు. అందులో మైదా ఉంటుంది. అంటే తమకు తెలియకుండానే పిల్లలకు విషాన్ని పెడుతున్నట్లే.

  గోధుమ పిండి (Wheat Flour)వ్యర్థాల్లో ప్రమాదకర రసాయనాలు (కెమికల్స్) కలిపి రిఫైన్డ్ చేయడం ద్వారా... మైదాపిండి తయారవుతుంది. ఇందులో పోషకాలు, ఫైబర్, విటమిన్లు ఏవీ ఉండవు. ఇది ఈజీగా జీర్ణం అవుతుంది. అందువల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. తద్వారా ఎన్నో అనారోగ్యాలు (Illness)చుట్టుముడతాయి. మైదా తినడం వల్ల కలిగే నష్టాల్ని తెలుసుకుందాం. తద్వారా... వీలైనంత త్వరగా దాన్ని దూరం చేసుకోవచ్చు.

  బరువు పెరుగుదల : మైసూర్ బోండాం (లేదా మైసూర్ బజ్జీ) లాంటి వాటిని మైదాతోనే చేస్తారు. అలాంటి వాటిని రెగ్యులర్‌గా తింటే... ఆటోమేటిక్‌గా బరువు పెరుగుతారు. బాడీలో కొవ్వు పేరుకుపోతుంది. ఊబకాయం (Obesity) వచ్చేస్తుంది. కాబట్టే మైదా మనం తినకూడదు.

  షుగర్ లెవెల్స్ పెరుగుదల : మైదా తింటూ ఉంటే... క్రమంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చేస్తుంది. మైదాలో షుగర్ లెవెల్స్ పెంచే గుణాలు చాలా ఎక్కువ. మైదా వంటలు తింటే... ఒక్కసారిగా ఇన్సులిన్, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఒక్కసారి డయాబెటిస్ వస్తే ఇక పోదు. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఇబ్బంది పడకూడదంటే మైదా వదిలేయాలి.

  చెడ్డ కొవ్వు పెరుగుదల : మైదాలో చెడు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ. అది బాడీలో పెరిగే కొద్దీ అడ్డమైన రోగాలు వచ్చేలా చేస్తుంది.

  హైబీపీ సమస్య : బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, వేడి... ఇలాంటి అంశాలన్నీ కలిసి... హైబీపీ వచ్చేలా చేస్తాయి. అందుకే మైదాతో చేసిన పదార్థాలు తినకూడదు.

  జంక్ ఫుడ్డే : మైదాను మరో రకంగా చెప్పాలంటే జంక్ ఫుడ్ అనుకోవచ్చు. ఇది నోటికి రుచిగా ఉంటుంది కానీ... ఆరోగ్యాన్ని చెడగొట్టి... మనస్శాంతిని దూరం చేస్తుంది.

  Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

  Avoid Diabetes: డయాబెటిస్ రావొద్దని కోరుకుంటున్నారా ? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..

  యాసీడీటీ : తరచూ మైదా పదార్థాలు తింటూ ఉంటే... పొట్టలో బరువుగా, ఏదో రాయిని మోస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తిన్న ఆహారం అరగదు. జీర్ణం కాదు. గ్యాస్ తయారపవుతుంది. త్రేన్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సమస్యలే. యాసీడీటీ అంటారు కదా అది వస్తుంది. మలబద్ధకం కూడా వేధిస్తూ ఉంటుంది.

  గుండె జబ్బు, ఇతర రోగాలు : మైదా అనేది ఓ అందమైన రోగాల పుట్ట అనుకోవచ్చు. మైదా ఎంత టేస్టీయో... అంత చేదైన రోగాలని అది ఇస్తుంది. గుండె, బ్రెయిన్, చర్మం, కళ్లు, ఇతర శరీర అవయవాల్ని నాశనం చేస్తుంది. స్లో పాయిజన్‌లా ఇది పనిచేస్తుంది.
  Published by:Kishore Akkaladevi
  First published: