బిర్యానీ తిన్న తర్వాత చాయ్ తాగండి.. కారణం ఇదే..

బిర్యానీ బయటతిన్నవారికి, ఆర్డర్ చేసినవారికి టీ ఫ్రీగా ఇచ్చేవారని కొంతమంది చెబుతారు. అది టీ కోసం ప్రమోషన్‌గా కూడా చాలామంది హోటల్ యజమానులు వాడేసుకునేవారట. అందుకే.. ఇప్పటికీ.. చాలామంది అలానే బిర్యానీ తినగానే టీ తాగుతుంటారు.

news18-telugu
Updated: June 23, 2019, 5:17 PM IST
బిర్యానీ తిన్న తర్వాత చాయ్ తాగండి.. కారణం ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బిర్యానీ.. చాలామంది ఫేవరెట్.. నేటికాలంలో చాలామంది వారానికి ఓ సారైనా టేస్ట్ చేస్తారు. పార్టీలు, ఫంక్షన్స్.. ఇంట్లో అకేషన్స్ ఇలా ఏదైనా సరే.. బిర్యానీ ఉండాల్సిందే. వెజిటేరియన్స్ వెజ్ బిర్యానీ, పులావ్, పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ.. నాన్ వెజిటేరియన్స్ చికెన్, మటన్, ప్రాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే.. ఓ లిస్టే ఉంది. అదే చాంతాడంతా అవుతుంది. అయితే.. ఇప్పుడైతే చాలామంది బిర్యానీతో పాటు.. లేదా.. తిన్న తర్వాత వెంటనే కూల్‌డ్రింక్స్ తాగుతున్నారు కానీ.. ముందునుంచి ఓ అలవాటు ఉంది. అదే చాయ్ తాగడం.. అవును.. ఇప్పటికీ చాలామంది తిన్నవెంటనే చాయ్ తాగుతారు. ఇక ఇరానీ చాయ్ అందుబాటులో ఉన్నవారు.. దాన్ని తీసుకుంటారు. ఇది ఎందుకంటే ఓ పెద్ద కథే ఉంది..

నిజానికీ బిర్యానీని ఎక్కువగా ఆయిలీ ఫుడ్, నెయ్యి, డాల్డా వేసి వండుతారు. అది తిన్నప్పుడు ఆహారనాళంలో జిడ్డు పేరుకుపోతుంది. దీంతో.. తిన్నవెంటనే టీ తాగడం వల్ల ఆ జిడ్డు కరిగిపోతుందని ఇలా తాగేవారు. ఇదే కారణంతో అప్పట్లోనే బిర్యానీ బయటతిన్నవారికి, ఆర్డర్ చేసినవారికి టీ ఫ్రీగా ఇచ్చేవారని కొంతమంది చెబుతారు. అది టీ కోసం ప్రమోషన్‌గా కూడా చాలామంది హోటల్ యజమానులు వాడేసుకునేవారట. అందుకే.. ఇప్పటికీ.. చాలామంది అలానే బిర్యానీ తినగానే టీ తాగుతుంటారు.

అయితే, ఇలా తాగడం వెనుక రహస్యం ఉందని.. మీరూ గ్లాసులు గ్లాసుల టీ తాగేయొద్దు.. అది మొదటికే మోసం తెస్తుందని మరిచిపోవద్దు సుమా..

ఈ వీడియో కూడా చూడండి..
First published: June 23, 2019, 5:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading