స్త్రీలు ఎదుర్కొనే ప్రమాదకర సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. చాలామందికి అవగాహనలేమి కారణంగా ఈ సమస్య ముదిరి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అయితే.. దీని లక్షణాలను ముందుగానే గుర్తించినట్లైతే సమస్యనుంచి బయటపడొచ్చు.
* రొమ్ముల్లో, చంకల్లో గడ్డలుగా ఉండడం..
* చనుమొనల్లో నుంచి స్రావాలు రావడం..
* చనుమొనలు లోపలకి వెళ్లడం..
* రొమ్ములపై చర్మం ముడతపడడం, గట్టిగా మారడం..
* రొమ్ములపై గుంటలపడడం, నారింజ పండు రంగులోకి మారడం..
ఈ లక్షణాలు ఉన్నట్లైతే ముందుగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయాలి. అదెలా అంటే..
* పీరియడ్స్ అయిన 5, 6వ రోజు అద్దం ముందు నిలుచుని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిశలో చేతివేళ్లతో రొమ్ములను పరీక్షించాలి.. అప్పుడు ఏదైనా గడ్డల్లా తగిలితే.. వైద్యులను ఖచ్చితంగా సంప్రదించాలి.
ముందుగానే రొమ్ము క్యాన్సర్ లక్షణాలను గుర్తించి దానికి తగిన చికిత్సను తీసుకోవడం ద్వారా త్వరగా సమస్యనుంచి బయటపడి హాయిగా జీవించొచ్చు. చాలామంది ఈ విషయాల్లో సమస్య లేకపోయినా అతిగా కంగారుపడడం, నిజంగా సమస్య ఉన్నా నిర్లక్ష్యం చేయడం ద్వారా క్యాన్సర్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.