Home /News /life-style /

SWIMING CAN HELP IN WEIGHT LOSS PVN

Weight loss : ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకుంటే స్విమ్ చేయడం బెటరా?ఈ విషయాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Swimming helps in weight loss : ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య.. అధిక బరువు. ఊబకాయం వల్ల నానా తిప్పలు పడుతుంటారు. అయితే మీరు వేగంగా బరువు తగ్గడానికి బెస్ట్ ఆఫ్షన్ కోసం చూస్తున్నట్లయితే..స్విమ్మింగ్(ఈత కొట్టడం) ప్రయత్నించవచ్చు.

ఇంకా చదవండి ...
Swimming helps in weight loss : ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య.. అధిక బరువు. ఊబకాయం వల్ల నానా తిప్పలు పడుతుంటారు. అయితే మీరు వేగంగా బరువు తగ్గడానికి బెస్ట్ ఆఫ్షన్ కోసం చూస్తున్నట్లయితే..స్విమ్మింగ్(ఈత కొట్టడం) ప్రయత్నించవచ్చు. ఈత వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. స్విమ్మింగ్ వల్ల శరీరం చురుకుగా ఉండటంతో పాటు ఇది మంచి కార్డియో వ్యాయామం కూడా. మీరు జిమ్‌కు వెళ్లడం ఇష్టం లేకుంటే లేదా మీకు కీళ్ల నొప్పులు ఉంటే అప్పుడు ఈత ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు తగ్గడానికి స్విమ్మింగ్

-స్విమ్మింగ్.. ఇతర కార్డియోవాస్కులర్ వ్యాయామాల లాగే కేలరీలను బర్న్ చేస్తుంది. బరువును తగ్గిస్తుంది.

-ఈత కొట్టడం ద్వారా.. చేతులు, కాళ్ళు కలిసి ఉపయోగించబడతాయి, దీని కారణంగా మొత్తం శరీరం పని చేస్తుంది. కొవ్వు సులభంగా కరిగిపోతుంది. ఫ్రీస్టైల్‌లో కనీసం 30 నిమిషాల పాటు స్విమ్మింగ్ చేస్తే దాదాపు 300 కేలరీలు ఖర్చవుతాయని, అదే స్విమ్మింగ్.. బటర్‌ఫ్లై స్ట్రోక్‌లో చేస్తే దాదాపు 400 కేలరీలు ఖర్చవుతాయని నిపుణులు చెబుతారు.

Relationship Tips : మీరు ప్రేమించినవాళ్లు దూరంగా ఉన్నారా..ఇలా చేస్తే మీ ప్రేమ సక్సెస్

-ఆరోగ్యకరమైన జీవితానికి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి స్విమ్మింగ్ ఒక బెస్ట్ ఆప్షన్. ఇది పూర్తి శరీర వ్యాయామం. ఇది బాడీ కొవ్వును త్వరగా కరిగిస్తుంది.

-వివిధ రకాల స్విమ్మింగ్ స్ట్రోక్‌లు కేలరీలను వివిధ మార్గాల్లో బర్న్ చేయగలవు. కేలరీల బర్న్ మీరు ఉపయోగించే కండరాలపై ఆధారపడి ఉంటుంది. బటర్‌ఫ్లై స్ట్రోక్ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈత అనేది మొత్తం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Swimming, Weight loss, Weight loss tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు