Home /News /life-style /

SWEET POTATOES HAVE BEEN PART OF HEALTHY FOODS THAT WILL IMPROVE YOUR SEX LIFE MK

ప్రతీరోజు ఆహారంలో చిలగడ దుంప తీసుకుంటే...సెక్స్ జీవితానికి తిరుగులేదట...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వీర్యకణాలు వృద్ధి చేయడంలో చిలగడ దుంప బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజు తీసుకునే ఆహారంలో స్వీట్ పొటాటో లేదా చిలగడ దుంపను చేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు.

    సెక్స్ విషయంలో మగవారిలో తరచూ వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది వీర్యకణాల సంఖ్యలో తగ్గుదల. పిల్లలను కనాలని ప్లాన్ చేసుకున్న కపుల్స్‌ను బాధించే సమస్య స్పెర్మ్ కౌంట్ అనే చెప్పవచ్చు. మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుదలకు జీవనశైలిలో వస్తున్న మార్పులే ప్రధానకారణమని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే వీర్యకణాల వృద్ధి జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వీర్యకణాలు వృద్ధి చేయడంలో చిలగడ దుంప బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజు తీసుకునే ఆహారంలో స్వీట్ పొటాటో లేదా చిలగడ దుంపను చేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే చిలగడ దుంపలో అత్యధిక స్థాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అలాగే ప్రి రాడికల్ డ్యామెజ్ నుంచి చిలగడ దుంప రక్షిస్తుందని సైతం చెబుతున్నారు.

    ఇక శుక్రకణాల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు సిగరెట్, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాల్సిందేనిని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు ఎక్కువగా వేడినీటి స్నానాలకు దూరంగా ఉండాలని, బిగుతైన అండర్ వేర్లు, ఉన్నితో చేసిన డ్రాయర్లు మానివేయాలని వృషణాలపై ఒత్తిడి పెంచే డ్రాయర్లు వేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ సమయాల్లో వదులుగా ఉండే దుస్తులు ధరించాలని సైతం వైద్యులు చెబుతున్నారు.
    First published:

    Tags: Food, Sex Education

    తదుపరి వార్తలు