Home /News /life-style /

SURVEY REVEALS THAT WOMEN WILL MAY CHEAT IF MEN DONT GIVE ANY COMPLIMENT TO HER HSN GH

Lack of compliments: దాంపత్య జీవితంలో దీన్ని కనుక ఫాలో అవ్వకపోతే.. భర్తపై భార్యకు లైంగిక ఆకర్షణ తగ్గిపోతుందట..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భర్తపై ప్రేమ తగ్గిపోవడం, ఇతరుల పట్ల ఆకర్షణ కలగడానికి మగవారి ప్రవర్తనే కారణమట. ఓ సర్వేలో ఆసక్తికర విషయం బయటపడింది. మగవాళ్లు కనుక ఆ ఒక్కటి ఫాలో అవకపోతే ప్రమాదమేనని సర్వే తేల్చిచెబుతోంది.

దాంపత్య బంధంలో పొడగ్తలు లేకుంటే మహిళలు సంతృప్తి చెందరనే విషయం మనకు తెలిసిందే. అందుకే రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు ప్రతి చిన్న విషయానికి భాగస్వామిని పొగుడుతుంటారు. అభినందించే లక్షణం (compliments) లేకపోతే మహిళలు మగవాళ్లను మోసం చేసే అవకాశం ఉందని తాజా సర్వే చెబుతోంది. ఆడవాళ్లకు జీవిత భాగస్వాముల నుంచి పొగడ్తలు, దయ, కేరింగ్ వంటివి అందనప్పుడు, వారిపై నమ్మకం కోల్పోతారని అధ్యయనం వెల్లడించింది. గ్లీడెన్ (Gleeden) అనే డేటింగ్ యాప్ ఈ సర్వే చేసింది. ఇందులో భాగంగా 11,000 మంది మహిళల నుంచి అధ్యయనానికి సంబంధించిన వివరాలను సేకరించారు. వీరిలో 84 శాతం మంది మహిళలు.. తమపై భాగస్వాములు తగిన శ్రద్ధ చూపించట్లేదని, కాంప్లిమెంట్స్ ఇవ్వట్లేదని ఫిర్యాదు చేశారు. అభినందనలు, పొగడ్తలు లేకపోవడం వల్ల దాంపత్య బంధంలో అనవసర చర్చలు, అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నాయని 61 శాతం మంది చెప్పారు. ఇలాంటి ప్రవర్తన వల్ల తమ వివాహ బంధం దెబ్బతిన్నదని 77 శాతం మంది తెలిపారు.

ప్రశంసించడం, రిలేషన్‌షిప్‌కు విలువ ఇవ్వడం వంటివి భాగస్వామి నుంచి ఆశిస్తామని, వీటిని తప్పకుండా అనుభూతి చెందాలనుకుంటామని సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది చెప్పారు. ఈ లక్షణాలు లేనప్పుడు, వాటిని వేరేవారి నుంచి పొందేందుకు మహిళలు ప్రయత్నిస్తారు. ఈ లోపం వారిని ఇతరులతో సంబంధం పెట్టుకునేలా ప్రోత్సహిస్తుంది. పొగడ్తలు లేకపోవడం వల్ల భాగస్వామిపై కోరికలు కలగట్లేదని 76 శాతం మంది అభిప్రాయపడ్డారు. మగవాళ్ల నుంచి అభినందనలు, పొగడ్తలు లేకపోవడం వల్ల వారిపై లైంగిక ఆకర్షణ పూర్తిగా తగ్గిపోతుందని 42 శాతం చెప్పారు.

నమ్మకం పోతుంది
భాగస్వామి ప్రవర్తన వల్ల విసిగిపోయిన మహిళలు, ప్రేమను పొందడానికి ఇతరులతో సంబంధాలు పెట్టుకునేందుకు కూడా వెనుకాడరని సర్వేలో తేలింది. ఆడవాళ్లు ఇలాంటి చిన్న అనుభూతులకు దూరమైనప్పుడు రిలేషన్‌షిప్‌పై వారికి నమ్మకం పోతుందని జర్నల్ ఆఫ్ సెక్స్ మారిటల్ థెరపీ (Journal of Sex Marital Therapy) తెలిపింది. భాగస్వామి లేదా కాబోయే భర్తల నుంచి క్రమం తప్పకుండా పొగడ్తలు వచ్చినప్పుడే ఆడవాళ్లకు వారిపై లైంగిక ఆకర్షణ ఎక్కువగా కలుగుతుందని అధ్యయనం వెల్లడించింది.
Published by:Hasaan Kandula
First published:

Tags: Couple affair, Husband kill wife, Newly married couples, Wife kill husband

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు