Home /News /life-style /

SURPRISING FACT PIMPLES PROBLEM WILL SOLVE BY TOMATOES HERE IS MORE HEALTH BENEFITS WITH TOMATOES HSN GH

Health Benefits of Tomatoes: టమోటాలతో ఇన్ని లాభాలా..? బ్లాక్ హెడ్స్, మొటిమల సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టమోటాలు కేవలం రుచిని అందించడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా చేకూర్చుతాయి. టమోటాల్లో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. టమోటాల వల్ల కలిగే లాభాలను ఓ లుక్కేయండి.

సీజన్ తో సంబంధం లేకుండా అన్నివేళలా లభించే కూరగాయల్లో టమోటాలు ముఖ్యమైనవి. దాదాపు అన్ని వంటకాల్లో వేసుకోవడానికి వీలుగా ఉండే టమోటాలు వాటికి మంచి రుచిని అందిస్తాయి కూడా. అయితే టమోటాలు కేవలం రుచిని అందించడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా చేకూర్చుతాయి. టమోటాల్లో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. రోజూ టమోటా జ్యూస్ తాగడం చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తద్వారా మీరు మరింత అందంగా కనిపిస్తారు. టమోటాల వల్ల మన చర్మానికి లభించే ఇతర అద్భుతమైన ప్రయోజనాలు, వాటిని మన చర్మం కోసం ఉపయోగించే పద్ధతులు తెలుసుకుందాం.

యాంటీ ఏజింగ్ సప్లిమెంట్
టమోటా సహజ సిద్ధమైన యాంటీ ఏజింగ్ సప్లిమెంట్ లా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ ఫలితాలను అందుకోవచ్చు. టమోటాను చర్మానికి నేరుగా రుద్దుకున్నా చాలు.. అది చర్మం ప్రకాశవంతంగా మారడానికి సహాయపడుతుంది.

జిడ్డుదనం తగ్గిస్తుంది.
ముఖంపై ఆయిల్ ని తగ్గించడంలో టమోటాలు బాగా పనిచేస్తాయి. ఇవి చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి. దీనికోసం టమోటా రసాన్ని చర్మం అంతా రుద్దుకొని 5 నిమిషాల తర్వాత కడుక్కోండి. చాలు.. వెంటనే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు.

Surprising fact Pimples problem will solve by Tomatoes here is more Health Benefits with Tomatoes టమోటాలతో ఇన్ని లాభాలా..? బ్లాక్ హెడ్స్, మొటిమల సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!
ప్రతీకాత్మక చిత్రం


బ్లాక్ హెడ్స్ మాయం..
చర్మంపై ఎక్కువగా ఉండే వైట్ హెడ్స్, బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడంలో టమోటాలు బాగా పనిచేస్తాయి. దీనికోసం టమోటా ముక్కతో చర్మం అంతా రుద్దుకొని 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి. ఇలా తరచూ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ మాయమవుతాయి.

చర్మాన్ని కాంతివంతం చేస్తుంది
టమోటాలు చర్మాన్ని కాంతివంతం చేయడంలో కూడా సహాయపడుతాయి. దీనికోసం టమోటా గుజ్జులో తేనె, పాలు కలిపి అప్లై చేసుకోవాలి. పావు గంట తర్వాత ముఖం కడుక్కుంటే ముఖంలో కొత్త గ్లో కనిపిస్తుంది.

చర్మం పొడిబారకుండా చేస్తుంది
వేసవిలో చర్మం పొడిబారకుండా టమోటాలు సహాయపడతాయి. మీ చర్మం నిస్తేజంగా మారడాన్ని కూడా ఇవి నివారిస్తాయి. దీనికోసం ఒక టమోటాను మాష్ చేసి, దాని గుజ్జును టీస్పూన్ తేనెతో కలిపి చర్మంపై మసాజ్ చేయండి. కనీసం 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. తద్వారా చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు. అంతే కాదు.. ఈ ప్యాక్ తరచూ వేసుకోవడం వల్ల సహజంగా సూర్యుడి నుంచి వచ్చే బలమైన UV కిరణాలను అడ్డుకొని చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది.

ట్యాన్ ని తగ్గిస్తుంది.
టమోటాల్లో విటమిన్ సి, ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మానికి తాజాగా ఉంచడమే కాకుండా, చక్కని రంగును అందిస్తుంది. అంతేకాక, టమోటాలు వడదెబ్బ ప్రభావాన్ని కూడా తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతాయి. టమోటా జ్యూస్‌ను మజ్జిగతో కలపి చర్మానికి పట్టించడం వల్ల చర్మంపై ఎండ ప్రభావం వల్ల ఎర్పడిన ట్యాన్ తొలగిపోతుంది. అంతేకాక, చర్మంపై దద్దుర్లను నివారించి మృదువుగా చేస్తుంది.

Beauty Benefits, Tomatoes, Vitamin, Anti-aging, skin, oiliness, blackheads, astringent, sunburn, చర్మం, టమోటా, ట్యాన్, మొటిమలు, ఆరోగ్య ప్రయోజనాలు, యాంటీ ఏజింగ్ సప్లమెంట్, ఫేస్ ప్యాక్,
ప్రతీకాత్మక చిత్రం


మొటిమలను నివారిస్తుంది
ముఖం మీద ప్రతి రోజు టమోటా రసం రాయడం ద్వారా ఇది బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడంతో పాటు చర్మంపై మొటిమలను నివారిస్తుంది. టమోటాలు మొటిమల నివారణలో బాగా పనిచేస్తాయి. ఇవి చర్మంపై జిడ్డు లేకుండా చేయడం, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడం వంటివి చేస్తూ మొటిమలు రాకుండా చేస్తుంది. మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ టమోటాను ముఖంపై అప్లై చేసుకోండి.
Published by:Hasaan Kandula
First published:

Tags: Ayurvedic tips for healthy life, Best health benefits, Health benefits, Health secrets, Women health

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు