#Health Tips: ఈ రెండింటిని కలిపి తీసుకుంటే చాలు.. అందం, ఆరోగ్యంగా ఉంటారు..

అందం, ఆరోగ్యం.. ఈ రెండింటి కోసం మనం ఎంతైనా ఖర్చు పెడతాం.. ఏవేవో చేస్తాం. కానీ, మన చుట్టూ ఉండే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్లే ఈ రెండు సాధ్యమవుతాయి. అవేంటంటే..

Amala Ravula | news18-telugu
Updated: September 7, 2019, 2:37 PM IST
#Health Tips: ఈ రెండింటిని కలిపి తీసుకుంటే చాలు.. అందం, ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: September 7, 2019, 2:37 PM IST
పాలు తాగమని ఎంతచెప్పినా చాలామంది పెడచెవినా పెడతారు. కానీ, పాలల్లో ఎన్నో కీలక పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీర నిర్మాణానికి దోహదం చేస్తాయి. పాలను తాగడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఈ పాలల్లో తేనె కలిపి తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందొచ్చు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో, అనారోగ్య సమస్యలు దరిచేరవు.. ఈ రెండింటి కలయిక వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, శరీర జీవక్రియ పెరిగి అరుగుదల శక్తి పెరుగుతుంది.. ఎనర్జీ లెవల్స్ బ్యాలెన్స్ పెరిగి రోజంతా ఎంతో యాక్టివ్‌గా పనిచేస్తారు. ఎముకలు దృఢంగా మారుతాయి. దంతసమస్యలు, కీళ్లనొప్పులు వేధించవు. అదే విధంగా.. పాలు తేనెని కలిపి తీసుకోవడం వల్ల సుఖ నిద్ర పడుతుంది. బాగా నిద్రపోవడం వల్ల మెదడుపనితీరు బాగుంటుంది. తేనెలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మ రక్షణకు దోహదం చేస్తాయి. చర్మాన్ని లోపలి నుంచి కాంతివంతంగా మార్చి మృదుత్వాన్ని చేకూరుస్తాయి. అదేవిధంగా, మొటిమలు, మచ్చలు తొలగి నునుపుదనాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా శిరోజ సౌందర్యం కూడా మెరుగువతుంది.
కాబట్టి పాలు తాగడమా.. అని ఇబ్బందిగా ముఖం పెట్టకుండా ప్రతిరోజూ పాలు, తేనె కలిపి తీసుకోండి.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టండి..

First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...